30, డిసెంబర్ 2010, గురువారం

అను నిముషము శుభ శకునమ్మేఅనురాగ లోకాల, నా ప్రణయిని
"అడుగిడిన వేళలకు" సుస్వాగతం!
విరబూయు (ఆ )తరుణాలు అవి - చూడగా ;
కిన్నెరల గానాల కొసగినట్టి
శుభ శకునాలు సుమ్మీ!

ఆ వన్నె తరుణాలకెపుడు
కవి కులములు
ఋణ పడి ఉండును,
ఇది సత్యము!!!!!!!

మాట వినని మనస్సు


ప్రేయసీ!
నీ కదలికలు కలువలై
నా కనుల సరసులలొ
విరబూయుచున్నవి;
నా మనసు అట నుండి
సుతరాము మరల నేరదు చెలీ!
నేరమిది - అని ఎంచి
ఏ తీరుగా నన్ను
శిక్షించ దలిచేవొ?
ఒప్పుకొందును చెలీ!
ఏదైననూ.......
అది నాకు ఆమోదమే!
ఆనంద కందళిత హృదయ ఆస్వాద యోగ్యమే.

తనలోన Doubt


ప్రేమ, మమతల శుక శాబకమ్ములు ప్రియా!
ఈ ఎద గూటిలోన
ఇసుమంత విసువైన లేకుండ
నిరతమూ కూజితమ్ము లిడుచున్నవో ప్రియా!

అనురాగమీలాగున
జన మనమ్ముల
సంచారములు సేయుచూ ఉండుటది ~~~~~
అలరించుటా?
లేక - అలమటిల్లగ జేయుటా??

ప్రమోదానంద అద్వైతము
ఆ కొండ కోనలలొ ; కానలలొ,
ఎండలలొ, వానలలొ ;
గల గలల జలపాత ఉరుకులు ;
వాగులూ వంకలూ నదులు
జిలిబిలీ కిరణాల(కు) ఒడులు ;

సతతమ్ము పఠియించు
వెలుగు పాఠాలను
రవి చంద్ర బింబములు ;

ప్రణయినీ సౌందర్య కాంతి ప్రతిస్ఫలనలను
నిరతాధ్యయన శీలురై
నాదు నయనమ్ములు!

నాదు నేత్రద్వయి
నేడు,
ప్రమదా వనములందున
ప్రమోదా స్నానములు సేయుచూ
అద్వైతమై ~~~~~~~
ఇట్టె లీనమాయేను తనలోన ఔర!!
ఔర! ఔరా!

27, డిసెంబర్ 2010, సోమవారం

ప్రేమకు కొలమానము ఉన్నదా?


ఉత్పల గంధీ!
ప్రేమ భావనా దామినులను తృణీకరించుదామని ;
శాయ శక్తులా ప్రయత్నిస్తూనే ఉన్నాడు మానవుడు;
ఐనా కానీ,
"మమతాను రాగ ఆలాపన"లోనే
తాను ఉన్మీలనమౌతూనే ఉన్నాడు కదూ! విచిత్రం!
ఇపుడు
"ప్రేమ మహత్తును కొలవ గలిగే కొలమానం -
తయారీలో నిమగ్నమై ఉన్నాడు.
నిన్న- నేడు- రేపు- కూడా...
ఇంతే! ఇదింతే!
ఇంతింతని వివరించ లేని
"వలపు మహత్తు కథా ఫణితి"ఇంతేలే!
ఓ మగువా!
అనురాగ ధారల నీటి బుగ్గలలో నేనున్నూ
తలమునకలై ఉన్న నేను
స్వానుభవంతో రాస్తూన్న లేఖ సుమీ ఇది!!ఔ!

" ప్రేమకు కొలమానము ఉన్నదా? "

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
___________________________
( See the link for nice arts)

utpala gaMdhI! ;
prEma BAvanaa daaminulanu
tRNIkariMchudaamani ;
SAya Saktulaa prayatnistUnE
unnaaDu maanavuDu;
ainaa kaanI,
"mamataanu raaga aalaapana"lOnE
taanu unmIlanamautUnE unnaaDu kadU! vichitraM!
ippuDu
"prEma mahattunu kolava galigE kolamaanaM"
- tayaarIlO nimagnamai unnaaDu.
ninna- nEDu- rEpu- kUDA...! ;
iMtE! idiMtE!
iMtiMtani vivariMcha lEni
"valapu mahattu kathaa phaNiti"iMtElE!
O maguvaa!
anuraaga dhaarala nITi buggalalO nEnunnuu ;
talamunakalai unna
nEnu svaanuBavaMtO raastUnna lEKa sumI idi!!au!

24, డిసెంబర్ 2010, శుక్రవారం

మనోజ్ఞ నైజము

ప్రణయినిది అలవి మాలిన పరిహాస నైజము!
ఇది నిజము!
సౌందర్యవతి నీట ఈదులాడేటి తరుణాన
జల తరంగిణీ వాద్యమయ్యేను సరసు!

“నీది కొన గోళ్ళ జాల్వారు సౌదామినులు ఇవి నాల్గు పదులు,
సుదతి! నీదు కరములను ముద్దాడు పది మెరుపులు!
చరణములందుకుని, సాష్ఠాంగ పడుచుండు పది దామినుల్. ”
అని నేను చూపాను నలభయ్యి మిరుమిట్ల మెరుపులను.

పద్మముల అల్లుకొనెనా మెరుపులు ;
సూర్యుడే పడెనోయి ఆ మెరుపు జాలములోన.

చిరు అలకలను చెలియ అభినయిస్తూను,
పిడికిళ్ళు మూసుకుని నఖములను దాచుకొనె!
మెరుపులను దాచుట ఎవరి తరము!?
తెలిసేది ఎన్నటికి నా వనితకు?!

తెలియగా
నాదు ప్రణయినిది
అలవి మాలిన పరిహాస నైజమ్ము!
ఇది నిజము!

భావ శాఖలుఓ పంచ వన్నెల రామ చిలుకా!
నిర్జల ఎడారుల గుండా
ప్రచండ ప్రభంజనాల గుండా
ఎగర లేక, ఎగర లేక, ఆయాస పడుతున్నావా?
రావమ్మా!రావమ్మా!ఇటు కేసి రావమ్మా!
పచ్చందనాల సందోహ నందన వని ఇది!
ఓ ప్రేమాన్విత శుక రాణీ!
నాదు లలిత భావనా పల్లవ పూర్ణ తరు శాఖలపైన
సుంత విశ్రమించుమా! ;
పుష్ప భారాన్వితమైన
ఈ నా హృదయ లతా నికుంజ పరివేష్ఠిత పాదపపు
ఇంపు సొంపుల కొమ్మలలోన
నీ గూడును నిర్మించుకొనుమా!
******************************
bhaava SAKalu
____________
O paMcha vannela raama chilukaa!
nirjala eDArula guMDA ;
prachaMDa praBaMjanaala guMDA ;
egara lEka , egara lEka ,
aayaasa paDutunnaavaa?
raavammaa!raavammaa!iTu kEsi raavammaa!

pachchaMdanaala saMdOha naMdana vani idi!
O prEmaanvita Suka raaNI!
naadu lalita BAvanaa pallava pUrNa
taru SAKalapaina ;
suMta viSramiMchumaa! ;
pushpa BAraanvitamaina
I naa hRdaya lataa nikuMja
parivEshThita paadapapu
iMpu soMpula kommalalOna
nI gUDunu nirmiMchukonumaa!

******************************

21, డిసెంబర్ 2010, మంగళవారం

“చిరు గాలి పల్లకి


మనోజ్ఞ వర్ణ ఖచిత రాగ రంజితమైన
"నా గీతికా నవ వధువును"
“చిరు గాలి పల్లకి"లో పంపించినాను

చేరు కున్నదిలే చెలీ!
నీ కడకు నా పాట

సుతి మెత్తనౌ
నీదు మృదు దరహాస పద్మ పరాగ రేణువులలోన
అది తనివార తానాలు ఆడి
నా వద్దకు
మరలి వచ్చిన
“మలయ వీచికయె ఋజువు”.

( 2004 my song)

&&&&&&&&&&&&&&&&&&&&

manOj~na varNa Kachita raaga raMjitamaina
naa gItikaa na vadhuvunu
“chiru gaali pallakilO paMpiMchinaanu
chEru kunnadilE chelii!
nI kaDaku naa paaTa
suti mettanau
nIdu mRdu darahaasa padma paraaga rENuvulalOna
adi tanivaara taanaalu ADi
naa vaddaku
marali vachchina
“malaya vIchikaye Rjuvu”.

పల్లె పడుచుతో నింగికి పోటీ


ముంగిట పల్లె పడుచు
ముగ్గులను వేస్తూన్నది,
ఆ రంగ వల్లులను చూచిన
నీల గగనం
వాన విల్లులను చిత్రించింది,
మెరుపులను విరచించింది;
ఐనా కూడా
అంబరం పోటీలో నిలబడలేకపోయింది

&&&&&&&&&&&&&&&&&&

muMgiTa palle paDuchu
muggulanu vEstUnnadi,
aa raMga vallulanu chUchina
nIla gaganaM
vaana villulanu chitriMchiMdi,
merupulanu virachiMchiMdi;
ainaa kUDA
aMbaraM pOTIlO nilabaDalEkapOyiMdi

చెట్ల కృతజ్ఞత


“ విత్తును నేను,
ఇంతప్పటి నుంచీ నీ నుండి మొలకెత్తాను,
ఇంతైనాను
ఇంతింతైనాను”
అంటూన్నాయి పాదపములు!
పౌర్ణమీ చాందినీల లోగిలిలో
ఆకుల సంగీతాన్ని అందిస్తూ
తమ నీడల జిలుగు వస్త్రాలను
వెన్నెల నీడల చుక్క బుటాలతో నింపి
వసుధ మాతను సమర్చిస్తున్నాయి.

చెట్ల కృతజ్ఞత
________

&&&&&&&&&&&&&&&&&&&&&

cheTla kRtaj~nata ;
_________________

“ vittunu nEnu,
iMtappaTi nuMchI nI nuMDi molakettaanu,
iMtainaanu
iMtiMtainaanu”
aMTUnnaayi paadapamulu!
paurNamI chaaMdinIla lOgililO
aakula saMgItaanni aMdistU
tama nIDala jilugu vastraalanu
vennela nIDala chukka buTAlatO niMpi
vasudha maatanu samarchistunnaayi.

చూపుల సౌదామినులు


కారు మేఘాలు
తొలక్రి పులకరింతలుగా
కరిగి పోతున్నవి

వర్ష ఋతువు
నదీ నాసికలో శ్వాసగా
సాగుస్తూన్న ప్రయాణాలు
నిరాఘాటంగా సాగి పోతూన్నవి ;;;;

ఇని సౌందర్యాలను
ధరణికి ఇచ్చినందుకు బహుమతులుగా
నా తరుణీ మణి చూపుల సౌదామినులను
పొందతున్నాయి కదా ఆ మబ్బులు! వారెవ్వా!

&&&&&&&&&&&&&&&&&&&&&&&

kaaru mEGaalu
tolakri pulakariMtalugaa
karigi pOtunnavi

varsha Rtuvu
nadI naasikalO Svaasagaa
saagustUnna prayaaNAlu
niraaGATaMgaa saagi pOtUnnavi ;;;;

ini sauMdaryaalanu
dharaNiki ichchinaMduku bahumatulugaa
naa taruNI maNi chUpula saudaaminulanu
poMdatunnaayi kadaa aa mabbulu! vaarevvaa!

ముద్రణ హక్కులు (Haiku 1)సౌహార్ద్ర లిపి
హృదయ పుటలపై
ముద్రణ హక్కులను పొందింది;
“ఆర్ద్ర భావనలకు
విద్వత్తు అవసరమా? నేస్తమా!”
అని అడుగుతూన్నది
&&&&&&&&&&&&&&&&

హైకూలు

sauhaardra lipi
hRdaya puTalapai
mudraNa hakkulanu poMdiMdi;
“aardra bhaavanalaku
vidvattu avasaramaa? nEstamaa!”
ani aDugutUnnadi

ధన్యోస్మి!
అక్షరాల పూలూ
ఆ భావ పరిమళాలూ
నా మనసు దారంపై
సుతి మెత్తగా జాల్వారుతూ
అల్లుకొంటూన్న కమ్మని మాలికలు ఔతున్నాయి.
ధన్యురాలినైనాను ముమ్మాటికీ!
ధన్యోస్మి! ధన్యోస్మి!

aksharaala pUlU
aa bhaava parimaLAlU
naa manasu daaraMpai
suti mettagaa jaalvaarutuu
allukoMTUnna kammani maalikalu autunnaayi.
dhanyuraalinainaanu mummaaTikI!
dhanyOsmi! dhanyOsmi!

ఉత్తమ గురువులు
ప్రణయినీ!
తొలి ఝాము, మలి ఝాములు
ఒకే పరి నిరు వైపుల వెలిసిన వెటుల? ఎటుల?
ఎల నాగా! శశి వదనా!
నీ నును లేత చెక్కిళుల ద్వంద్వముల
ఏక సమాసముగా
అద్దములో తిలకిస్తూ
‘ఉవిద నుదుట దిద్దుకొనును కుంకుమలు.
శ్రీ తిలకపు ప్రతిస్ఫలనలు!
వెలసెనోహోహో! అద్వితీయమిది
ప్రకృతి అందాలకు
ఉత్తమ గురువులు దొరికినవీ నేడీ నాడే!

ఉత్తమ గురువులు
*******************************

praNayinI!
toli jhaamu, mali jhaamulu
okE pari niru vaipula velisina veTula? eTula?
ela naagaa! SaSi vadanaa!
nii nunu lEta chekkiLula dvaMdvamula
Eka samaasamugaa
addamulO tilakistU
‘uvida nuduTa diddukonunu kuMkumalu.
SrI tilakapu pratisphalanalu!
velasenOhOhO! advitIyamidi
prakRti aMdaalaku
uttama guruvulu dorikinavI nEDii naaDE!

తలపుల పట్టమహిషులు

రెప్పలెత్తి
అటుకేసి చూస్తూ ఉంటే
నా నయనాలు కాస్తా
“జ్యోత్స్నా గోళాలే ఐనాయి
ఈ 'చంద్రికా గోళముపైన
స్థిర నివాసానికి హక్కు దారులు 'ఎవరో?
తెలుసునా ప్రేయసీ!
నిన్ను గూర్చిన 'నా తలపుల పట్ట మహిషులే'
ప్రమీలా! ప్రణయ నాయకీ!

తలపుల పట్ట మహిషులు


reppaletti
aTukEsi chUstU uMTE
naa nayanaalu kaastaa
“jyOtsnaa gOLAlE ainaayi
I 'chaMdrikaa gOLamupaina
sthira nivaasaaniki hakku daarulu 'evarO?
telusunaa prEyasI!
ninnu gUrchina naa talapula paTTa mahishulE,
pramIlaa! praNaya naayakI!

19, డిసెంబర్ 2010, ఆదివారం

అనాదిగా “ప్రేమ యొక్క ప్రయాణము”


చెవి ఇక్కడే ఉన్నది
ఎంతో దూరం నుండి వచ్చే
సవ్వడిని స్వీకరిస్తూన్నది

కన్ను ఇక్కడే ఉన్నది
కనీనికల చూపులు మాత్రం
కోటి కల్పముల దూరాలలో ఉన్న
తారా గ్రహ గోళములను చేరుకుంటూన్నవి

కేవల మాత్రపు చర్మేంద్రియాలకే
ఇంతింతటి ఘన శక్తిని కలిగి ఉన్నాయి కదా!

మరి, మానవాళి ప్రాణి కోటి
హృదయాలను శాసించే
“ప్రేమ యొక్క ప్రయాణము”
ఆ అనాది అగాధాలలోని వల్మీకముల నుండీ
ఇటు, ఆ అజ్ఞాత భవిష్యత్ అనూహ్య రోదసీ దిగంచలాల దాకా
సాగుతూనే ఉంటుంది,
కొన సాగుతూనే ఉంటుంది
ఇందులో ఆశ్చర్యం ఏమునది?
అసహజం ఏమున్నది? మిత్రమా!

&&&&&&&&&&&&&&&&&&&&&&&chevi ikkaDE unnadi ;
eMtO dUraM nuMDi vachchE
savvaDini svIkaristUnnadi

kannu ikkaDE unnadi
kaniinikala chUpulu maatraM
kOTi kalpamula dUraalalO unna
taaraa graha gOLamulanu chErukuMTuunnavi

kEvala maatrapu charmEMdriyaalakE
iMtiMtaTi Gana Saktini kaligi unnaayi kadaa!

mari, maanavALi praaNi kOTi
hRdayaalanu SAsiMchE
“prEma yokka prayaaNamu”
aa anaadi agaadhaalalOni valmIkamula nuMDI
iTu,
aa aj~naata Bavishyat anUhya rOdasI digaMchalaala daakaa
saagutUnE uMTuMdi, kona saagutuunE uMTuMdi
iMdulO aaScharyaM Emunnadi
asahajaM Emunnadi? mitramaa!

పెదవుల కవిలె కట్ట
అగణిత మౌక్తికముల నేల దాచుకుందువు నెలతా!
నీ అరుణాధరముల నాలాగున బిగబట్టిన జాణతనము,ఔరా!
నీదు పెదవుల కవిలె కట్టను విప్పుమా!
ఆణిముత్తెముల నిటు కేసి విసురుమా!
పడతిరో!
లెక్కకు మిక్కిలి భవ్య భావ లోకమ్ములకు
అవియె ఆలవామ్ములు కదా!

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

agaNita mauktikamula nEla daachukuMduvu nelataa!
nI aruNaadharamula
naalaaguna bigabaTTina jaaNatanamu,auraa!
nIdu pedavula kavile kaTTanu vippumaa!
aaNimuttemula niTu kEsi visurumaa!
paDatirO!
lekkaku mikkili Bavya BAva lOkammulaku
aviye aalavaammulu kadaa!

15, డిసెంబర్ 2010, బుధవారం

వేయి కనులు చాలవులే వనిత సౌరు కాంచగా!


సురేంద్రునికి
ఏకలవ్య శిష్యరికం చేసెదను
ఏవైనా తప్పిదములు
చేయు దారి కనుగొందును

సహస్రాక్షునిగ నేను
వరము వంటి శాపమును
పొంద గోరుతున్నాను;

ఔను కదా! అదే మరి
వేమరు వక్కాణములు!
వేయి కనులు చాలవులే
వనిత సౌరు కాంచగా!

@@@@@@@@@@@@@@@

surEMdruniki
Ekalavya SishyarikaM chEsedanu
Evainaa tappidamulu chEyu
daari kanugoMdunu
sahasraakshuniga nEnu
varamu vaMTI SApamunu
poMda gOrutunnaanu;
aunu kadaa! adE mari
vEmaru vakkaaNamulu!
vEyi kanulu chaalavulE
vanita sauru kaaMchagaa!

( picture art ; busani varma )

14, డిసెంబర్ 2010, మంగళవారం

కలలకు నిద్రాభంగము


పరచిన" వెన్నెల పడకల" పైన
పవ్వళించినవి నా కలలు;

మెరుపుల రాణీ!
నీ దరహాస స్పర్శకే
నాదు కలలకు మెలకువ వచ్చెను;

ఓ నా సౌదామినీ!
ఇక నేనేమి సేయగలను!?
నిస్సహాయుడను.

నా స్వప్నములను సేదదీర్చేటి
బృహద్ భాద్యత
నీ భుజములపైనే ఉంచితిని ,
"శరణు! దేహి" అని.

$$$$$$$$$$$$$$$$$$$$
$$$$$$$$

parachina vennela paDakalapai
pavvaLiMchinavi naa kalalu;
merupula rANI!
nI darahaasa sparSakE
naa svapnammulaku
melakuva vachchenu;
O naa saudaaminI!
ika nEnEmi sEyagalanu!?
nissahaayuDanu.
naa svapnammulanu
sEdadIrchETi
bRhad BAdyata
nI BujamulapainE uMchiti ,
SaraNu! dEhi ani;

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

12, డిసెంబర్ 2010, ఆదివారం

కలల పూల బాటలు


నా కన్నులకూ
నీ కదలికలకూ నడుమ
ఋజు మార్గముగా
చిత్ర చిత్ర పటలీ స్వప్న పుష్ప సమూహమ్ములను
పరచి ఉంచినాను నవలా మణీ!

ఆ వారధిపైన
నిన్ను గూర్చిన మృదుతర ఊహలకు తప్ప
అన్య విషయ గమనమ్ములకు
ప్రవేశము నిషిద్ధము పడతీ!

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

naa kannulakuu
nI kadalikalakuu
Rju maargamugaa
chitra chitra paTalI pushpa samUhammulanu
naDuma , parachi uMchinaanu navalaa maNI!

aa vaaradhipaina
ninnu gUrchina mRdu tara Uhalaku tappa
anya vishaya gamanammulaku
pravESamu nishiddhamu