27, ఫిబ్రవరి 2011, ఆదివారం

బొమ్మ, బొరుసు, ఆశా ఇరుసుమధు మాధుర్యాలను దూసి పోసిన
కిన్నెరల ఆలాపనా గానాలు;
దివి నుండి జారి వచ్చి;
సుతారంగా దూరి పోయి
నీదు కొంగు బంగారముగా మారి పోయాయి
కోమలీ! కాస్త దయ ఉంచి ;
నీ చెంగు ముడి విప్పవా?
“ పొడుపు కథ నీ నవ్వు “-
కాస్త కరుణించి ,ముడి విప్పవా?

పసిడి నాణెమ్ము అందుంది ;
ఇటు జారి ;
నా హృదయమ్ము పై పడెను;
“ బొమ్మ” పడితేను నాదు భాగ్యమ్ము;
నీ చరణ పద్మాల “ పద్మ రేఖను ఔతాను నేను”
అటు గాక ;
“ బొరుసు ” గా పడితేను;
నిను గూర్చినట్టి భావనా చక్రాల శిథిలాలలోన;
కూరుకు పోయినట్టి ‘
“ఆశా ఇరుసునే ఔతాను తథ్యమిది ,సుమ్మీ!!

&&&&&&&&&&&&&&&&&&&&&bomma, borusu, aaSaa irusu
______________________

madhu maadhuryaalanu dUsi pOsina
kinnerala aalaapanaa gaanaalu;
divi nuMDi jaari vachchi;
sutaaraMgaa dUri pOyi;
nIdu koMgu baMgaaramugaa mAri pOyaayi.
kOmalI! kaasta daya uMchi ;
nI cheMgu muDi vippavaa?
“ poDupu katha nI navvu “-
kaasta karuNiMchi ,muDi vippavaa?

pasiDi naaNemmu aMduMdi ; iTu jaari ;
naa hRdayammu pai paDenu;
“ bomma” paDitEnu ; naadu Baagyammu;
nI charaNa padmaala “ padma rEKanu autaanu nEnu”
aTu gaaka ; “ borusu ” gaa paDitEnu;
ninu gUrchinaTTi BAvanaa chakraala SithilaalalOna;
kUruku pOyinaTTi ‘
“ASA irusunE autaanu tathyamidi, summI!

&&&&&&&&&&&&&&

వెర్రి మాలోకము


స్వప్న పుష్పాల నుండి రాలుతూన్న;
పుప్పొడి రేణువుల జలపాతాల ఉఱవడిలో;
నిరంతర స్నానాల క్రీడాభిషిక్తుడనౌ;
భాగ్య శాలిని కదా! నేను- :

“ఆహా! వెఱ్ఱివాడు వీడనుచూ” ;
వీడక నను గేలి సేయు
ఈ ప్రపంచపు చూపులకు;
నా స్వప్న స్వర్గ లోకపు ద్వార బంధపు
నగిషీ మెరుపులలోని
అతి స్వల్ప శకలమైనా దొరుకునా?
అపరంజి రంజిత అందలములో నెలకొనిన;

విస్తృత భావ కిరణ ద్యుతి వలయపు;
చుట్టు కొలత ఎంతో ;
ఆ లోక దృక్కులకు ఊహలైనా అందదు కదా!
మరి ఈ లోకము
ఒక మాలోకము - అను మాట
సత్యమే కదా! మిత్రమా!
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

Verri maalOkamu
-----------------------

svapna pushpaala nuMDi raalutUnna;
puppoDi rENuvula jalapaataala u~ravaDilO;
niraMtara snaanaala krIDABishiktuDanau;
BAgya SAlini kadA! nEnu- :
“AhA! ve~r~rivaaDu vIDanuchU” ;
vIDaka nanu gEli sEyu
I prapaMchapu chUpulaku;
naa svapna svarga lOkapu dvaara baMdhapu
nagishI merupulalOni
ati svalpa Sakalamainaa dorukunaa?
aparaMji raMjita aMdalamulO nelakonina;
vistRta BAva kiraNa dyuti valayapu;
chuTTu kolata eMtO ;
aa lOka dRkkulaku
Uhalainaa aMdadu kadaa!
mari I lOkamu
oka maalOkamu - anu maaTa
satyamE kadaa! mitramaa!

$$$$$$$$$$$$$$$$$$$$$$$

24, ఫిబ్రవరి 2011, గురువారం

రంగుల తడి
నీ నవ్వులనూ, నీ కన్నులనూ
నీ లాలిత్యాన్నీ, నీ నిర్లక్ష్యాన్నీ
అలవోకగా చిత్రించిన
ఈ కుంచెలకు అంటి ఉన్న "రంగుల తడి" ఎన్నటికీ ఆరదు;
తర తరాలకూ
సహృదయుల వ్రేళ్ళకు చేరి,
మణుల వోలె ఆ వర్ణాలు,
అంగుళీ హేమ హారాలలో
ఈ వన్నెల తూలికల రమ్య హేలలు
అరమరికగా ఉంటూనే ఉంటూన్నాయి, ఇందు బింబాననా!
సదా, సర్వదా
ఈ చిత్ర రచనా హంస తూలికల విన్నాణపు తానాలు -
"ప్రేమ తత్వము"లోని 'అపురూపతా దనమున 'కు
సర్వ కాల నిదర్శనలు, సర్వజ్ఞత్వపు భాష్యములు

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$nI navvulanU, nii kannulanU\
nI laalityaannI\ , nI nirlakshyaannI\
alavOkagA chitriMchina
I kuMchelaku aMTi unna
"raMgula taDi" ennaTikI aaradu\
tara taraalakU\ sahRdayula vrELLaku chEri\
maNula vOle aa varNaalu, aMguLI hEma haaraalalO
I vannela tUlikala ramya hElalu
aramarikagaa uMTUnE uMTuunnaayi,
iMdu biMbaananaa!
sadaa, sarvadaa -
I chitra rachanaa haMsa tUlikala
vinnaaNapu taanaalu -
"prEma tatvamu"lOni 'apurUpataa danamuna 'ku \
sarva kaala nidarSanalu,
sarvaj~natvapu BAshyamulu

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

21, ఫిబ్రవరి 2011, సోమవారం

నా కదలిక విరి తోట సుమా!


నా గొంతుకలో ;
నాకు "నేను"గా పలికే పలుకులు లేవు;
నా పలుకులలో ,
"నేను" "నేను"గా కనబడను;
బహిర్ సత్యమే కదా !

నా గళములోన; విరిసేనవి;
నెలత లాస నవ మల్లెలు;
నా "ప్రతి కదలిక" ;
మంద గమన నడయాడే
విరి తోట సుమా!

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
naa goMtukalO ;
naaku "nEnu"gaa palikE pa
lukulu lEvu;
naa palukulalO ,
"nEnu" "nEnu"gaa kanabaDanu;
bahir satyamE kadaa!
naa gaLamulOna; virisEnavi;
nelata laasa nava mallelu;
naa "prati kadalika" ;
maMda gamana naDayADE
viri tOTa sumA!

పుట్టింటికి బహుమతి దిగి వచ్చిన చంద్ర కిరణముఆకాశము పుట్టిల్లు ::
గగనం నుండి
గాలి తరగల సోపానాల మీదుగా ;
ఒక వెన్నెల కిరణం దిగి వచ్చి;
నీ చరణ నఖములను తాకింది;
పరావర్తనము జేయించిన
కోటి కిరణ రేఖలను
తన పుట్టినింటికి
కానుకలుగా ఇచ్చింది.

$$$$$$$$$$$$$$$$$$$$$$$


puTTiMTiki bahumati -
digi vachchina chaMdra kiraNamu ;
____________________________

aakASamu puTTillu ;;;;;
gaganaM nuMDi
gaali taragala sOpaanaala mIdugaa ;
oka vennela kiraNaM digi vachchi;
nI charaNa nakhamulanu taakiMdi;
paraavartanamu jEyiMchina
kOTi kiraNa rEkhalanu
tana puTTiniMTiki
kaanukalugaa ichchiMdi.

( పుట్టింటికి బహుమతి;
puTTiMTiki bahumati; )

నయనాల నావలు ;


నీ నవ్వులలోని ; మిసిమినీ, నిగ్గునంతటినీ ;
నా కనుల పడవలందెక్కించుకున్నాను;
అనవరతము సాగేటి,
నా ప్రణయ పయనాలు; గని (*1)
ఈసు చెందరో,
సుధలను గ్రోలిన;
ఆ నాక వాసులు సురలైన కూడ!!?
(*1) కని/ గని = చూచి, see

&&&&&&&&&&&&&&&&&&&&&&
nayanaala naavalu
______________
nI navvulalOni ;
misiminii, niggunaMtaTinii ;
naa kanula paDavalaMdekkiMchukunnaanu;
anavaratamu saagETi, naa praNaya payanaalu;
gani, Isu cheMdarO, aa sudhalanu grOlina;
aa naaka vaasulu suralaina kUDa!!?

ఆహ్వానము పలుకు రంగుల కుంచెలు

ఇందీవరాక్షీ! రాకేందు బింబాననా
ఏ వేళనందైన
భావనము నీదేను!
సౌందర్య రాశీ! ఔదార్య భాషిణీ!
ఈ వర్ణ తూలికలు ; ప్రణయనము సేయుట(*1) ;
తమ విధిని ఎప్పుడూ, విసుక్కోవు(*2);
సరి కదా!
" ఇది ఎంతొ ఇంపైన కర్తవ్యమ"నుచునూ
ప్రవరణము (*3) పలుకును
నా ప్రణయ సామ్రాజ్ఞీ!

&&&&&&&&&&&&&

1 ప్రణయనము = రచన ;
2. విసుగు కొనవు ;
3. ప్రవరణము ఆహ్వానము పలుకుట

బ్రహ్మకు ముడి సరుకులు లభ్యమైనవి
ఉత్పల గంధీ! ;
సౌందర్యానికి ముడి పదార్ధము దొరికినది ఇన్ని నాళ్ళకి;
నీ రూపములోన, ఆ విరించికి ;
ఇన్ని యుగాలుగా
చతుర్ముఖుని నిఘంటువులోన ;
చతుర్ముఖుని నిఘంటువులోన ;
ఆలాగుననే ఖాళీగా ఉన్నవి పూరణమ్ములు(Dashes) ;
అన్నింటికినీ అసలు పదార్ధము నేటికి దొరికెను
సరి! సరి! ;
ఆలస్యము ఇంచుక సేయక ,
కాల పురుషుడు ;
పూరించెను ఆ నిరామయములను;
సస్య శ్యామల భరితము సేయుచు,
నీవె హేతువువు ఔతున్నావు మరీ మరీ
సిరి! సిరి! ఓహోహో!ఓ ముద్దుల గుమ్మా! ;

++++++++++++++++++++++++++brahmaku muDi sarukulu labhyamainavi
_____________________________________

utpala gaMdhI! ;
sauMdaryaaniki muDi
padArdhamu dorikinadi inni nALLaki;
nI rUpamulOna, aa viriMchiki ;
inni yugaaluga
chaturmuKuni niGaMTuvulOna ;
aalaagunanE unnavi,
KALIgA pUraNammulu(#Dashes#) ;
anniMTikinii asalu padaardhamu dorikenu
sari! sari! ;
aalasyamu iMchuka sEyaka ,
kaala purushuDu ;
pUriMchenu aa niraamayamulanu;
sasya SyAmala Baritamu sEyuchu,
nIve hEtuvuvu,
autunnaavu mari, marii
siri! siri!
OhOhO! O muddula gummaa! ;

+++++++++++++++++++++++++++++++++++

17, ఫిబ్రవరి 2011, గురువారం

జలదరింపు - నూత్న పదము

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

వారిదమ్ముల నుండి జారి పడుతున్నాయి ;

వర్ష బిందువులు”.

నారీ శిరోమణిరో! ;

అవి, నీదు దోసిట చేరి,

ఆణి ముత్యమ్ములై, అవతరిస్తూన్నాయి!

“ధన్యములు ఐతిమని” తలచుచూ,

హర్ష పులకాంకిత గాత్రులౌతూన్నాయి,

జల మౌక్తికములు!
ఆహా! నేటికి / నేడు

“జలదరింపులు” అనెడు కొంగ్రొత్త మాటను,

పద నిఘంటువు నందు చేర్చినాయి;

&&&&&&&&&&&&&&&

vaaridammula nuMDi jaai paDutunnaayi ; varsha biMduvulu”.

naarI SirOmaNirO! ; avi, nIdu dOsiTa chEri,

ANimutyammulai, avataristUnnaayi!

"dhanyamulu aitimani” talachuchU,

harsha pulakaaMkita gaatrulau tUnnaayi,

jala mauktikamulu,

“jaladariMpulu” aneDu koMgrotta maaTanu,

pada niGaMTuvu naMdu chErchinaayi;

మీన నేత్రి - కను దోయి ప్రమిదలు


కంటి కను సన్నల ప్రమిదలలోన ;
జ్యోతులుగా వెలుగులీనెడు;
కమ్మని అవకాశము దొరికినదిగా మీకు;
ఇక నేమి జంకు?!
ఓ కలలార! ఉరికి రండి!
ఇట..... ;
నా ఎద తలపులెన్నెన్నొ ;
ఒత్తులుగ మీ సేవలో భాగస్వాములవగా ;
చేతులను కట్టుకుని, నిలిచి ఉన్నాయి
ఆ క్రీ నీడలందే
సుంత గమనించండి,
ఓ బంగారు సుస్వప్నమ్ములార!

&&&&&&&&&&&&&&&&&&&&&&&

machche kMTi kanu sannala pramidalalOna ;
jyOtulugaa velugulIneDu;
kammani avakASamu dorikinadigaa mIku;
ika nEmi jaMku?!
O kalalaara! uriki raMDi!
iTa..... ;
naa eda talapulennenno ;
ottuluga maari,
mI sEvalO Baagasvaamulavagaa ;
chEtulanu kaTTukuni,
nilichi unnaayi aa krI nIDalaMdE
suMta gamaniMchaMDi,
O baMgaaru susvapnammulaara!

అను రాగ సీమా విహారులార!ఈ ప్రేమైక భావనా నవ నందన వనిలోన,
నిష్కల్మష ప్రణయ భావ చంద్రికలను తూస్కరించు
ఈలాగు, ఈలాటి కలుపు మొక్కలు ఏల?
ఏరి వేయండి మమతాను రాగ సీమా విహారులార!,
పెను ఓర్మి మీరుగా ఉప్పతిల్ల!

$$$$$$$$$$$$$$$$$$$$$$

I prEmaika BAvanaa nava naMdana vanilOna,
nishkalmasha praNaya BAva chaMdrikalanu tUskariMchu ;
iilaagu IlaaTi kalupu mokkalu Ela?
Eri vEyaMDi mamataanu raaga sImaa vihaarulaara!,
penu Ormi mIrugaa uppaatilla!