23, సెప్టెంబర్ 2011, శుక్రవారం

సతతము సతమతమే!

పల్లవి:-

సతతం సతతం; సతమతమవడం  
రోదసిలో సంచార జీవకోటికీ 

నిత్య జీవనమ్మాయెను
సత్యమిది! పడతీ!
సత్యం! సత్యం! సత్యం!  || 


చంద్రవదన! ఇందుమతీ!
నీ- చెలువములను చూడగానే/నె 
చంద్రకళలకు కలవరమంట!- 
హెచ్చులు  తగ్గులు - తగ్గులు హెచ్చులు 
అందుకెనంట! - సతతం ||


పదారు రోజులు పాపం! 
ఒకటే తన పని అంట!- 
బారు బారు  కిరణాళికి - 
పదును పెట్టుకొను సతతం
విసుగు లేని పని అంట!  ||

నీ కురుల జాలి, కరుణలకై 
తపసు చేయు గగనము - సతతము- 
నీ జాలిని పొందుటె గగనమాయెను-
ఔరా! నీ మాయ?! ||


@@@@@@@@@@@@@@


chaMdrakaLalaku kalavaramaMTa!- 

hechchu taggulu aMdukenaMTa! - ||


padaaru rOjulu paapaM! okaTE pani aMTa!- 
vennela baaru  kiraNALiki satataM- 
padunu peTTukonu pani aMTa!  ||


nI kurula nIlimala- raMgulanu—
aruvuga gaikone aMbaramu- 
niSigaa taanu- kaalamulO, 
sagabhaagamunu gaikonenu- 
nI kESaanugraha, 
karuNalakOsaM- t
apasu chEsinadi – 
gaganamu satatamu- 
nI jaalini poMduTe 
gaganamaayenu- 
auraa! nI maaya?! ||


@@@@@@@@@@@@@@
;

సింగరాయ బుల్లోడు


Raiding horse


టక్కు టిక్కు టెక్కులాడి- 
టుక్కు టెక్కు నడకలాడి- 
నడకలన్ని నాట్యాలై- 
పెక్కు నిక్కులాయె, పిల్లకు, 
నిక్కువమిది, మన్మధుడా! ||

డప్పు, డిప్ప, డెక్క వాజి- 
చుప్పనాతి రౌతు వీడు/ తాను/ 
డొప్ప డోలు తీర్థాలలొ- 
డుబుంగు డంగు తేలవోయి ||

ఆమె:- 
టాపు లేచిపోద్దిరోయి- 
తిక్క తిక్క మాటలను-
తుప్పు తుప్పున ఊస్తే – 
జాపత్రీ పిలగాడా! __
అతడు:-
టెంపరింత తగునా, 
ఓ మగనాలా!- 
తెంపరితనమేలనీకు? __
డాబుసరీ బుల్లెమ్మా!- 
జాబిలికీ కిక్కిచ్చే- 
ఓ హో బిలమా! కాంచనమా! ||

దంభారీ తనము చాలు!- 
గుంభనాలింగనములను –
 ఉపాహారమీయి చాలు! 
అదే నాకు పదివేలు ||

చంబేలీ పరిమళాల- 
సంబరాల బేలా!- 
ఈ, సింగరాయ బుల్లోడు- 
నిరంతరం నీ ఖైదీ! ||

@@@@@@@@@@@@@@@@@ 

Takku Tikku TekkulADi- 
Tukku Tekku naDakalADi- 
naDakalanni nATyaalai- 
pekku nikkulaaye, 
pillaku, 
nikkuvamidi, manmadhuDA! ||

Dappu, Dippa, Dekka vAji- 
chuppanaati rautu vIDu/ taanu/ Ime- 
Doppa DOlu tIrthaalalo- 
DubuMgu DaMgu tElavOyi ||

aame:- 
TApu lEchipOddirOyi- 
tikka tikka mATalanu- 
tuppu tuppuna UstE – 
jaapatrii pilagaaDA! __
ataDu:-
TeMpariMta tagunaa, 
O maganaalaa!- 
teMparitanamElaniiku? __
DAbusarii bullemmaa!- 
jaabilikii kikkichchE- 
O bilamaa! kaaMchanamaa! ||
;  

కిలికించితాల రొక్కము

గడి వేసిన తలుపులు- 
ముడివేసిన తలపులు- 
తడి తపనల ఒత్తిడి- 
మడి ఒడిలో చిత్తడి- ||మడిగెలపయి- పసుపులు- 
విడి కుంకుమ బొట్టులు-  
జీరాడే కుచ్చిళ్ళకు –
చిడిముడిగా వన్నెలు ||


మక్కువ కుదిరిందనీ – 
మల్లిక తెలిపేను వనికి- 
రొక్కము కిలికించితాలు-  
చక్కని మన్మధ రాణికి ||


@@@@@@@@@@@@@


ga Di vEsina talupulu- muDivEsina talapulu- 
taDi tapanala ottiDi- maDi oDilO chittaDi- ||


maDigelapayi- pasupulu- viDi kuMkuma boTTulu-  
jIraaDE kuchchiLLaku –chiDimuDigaa vanniyalu ||


makkuva kudiriMdanI – mallika telipEnu vaniki- 
rokkamu kilikiMchitaalu- chakkani manmadha rANiki ||
;

బులిపించే డ్యూటీ -1


at the door of MoonLight
బులిపించడమే డ్యూటీ- నీ       
కప్పగించినది ఎవరో?
జిలిబిలిగా ఆటలా?
మా ప్రేమ జంటలన్నిటితో?
చాలు చాలు చాలునోయి! ||                                       
                                       
చిలకరించుచున్నవి- 
మొయిలు తునక పన్నీర్లు- 
తనివితీర జామ పండు-
జలక్రీడల సయ్యాటలు- 
చిలక రాజు రుచి చూడగ- 
పండుకేమొ మజా మజా ||                                                    
                                                                                
కావాలని ఓరగా- 
తలుపు తెరచిఉంచితిని- 
వాలనీయి దోర దోర- 
వెన్నెలల కిరణాలను- 
నీలాంబుద రాశి వెనుక- 
నక్కి ఉన్న జాబిల్లీ! ||


 @@@@@@@@@@@@@

bulipiMchaDamE DyUTI- nii
kappagiMchinadi evarO?
jilibiligaa ATalaa?
maa prEma jaMTalanniTitO?
chaalu chaalu chaalunOyi! ||

 chilakariMchuchunnavi- moyilu tunaka pannIrlu-
tanivitiira jaama paMDu-jalakrIDala sayyaaTalu-
chilaka raaju ruchi chUDaga- paMDukEmo majaa majaaa ||

kaavaalani Oragaa- talupu terachiuMchitini-
vaalanIyi dOra dOra- vennalala kiraNAlanu-
nIlaaMbuda rASi venuka- nakki unna jAbillI! ||

;