31, జులై 2012, మంగళవారం

ప్రముఖ శీర్షిక


గులాబీవి నీవు! 
నీ కొనగోటి రేఖనౌతూన్న ;
ఈ "నేను"- 
నీకు రక్షితదళమునైనపుడు 
చకితుడౌతూ కసిగ గాంచే
నీలాంబరమ్మున చండ్ర సూర్యుడు!!!!!!!
నా చేతి నడ్డం పెడతాను, 
'ఎండ వాడలలోన" నిన్ను 
వాడనిస్తానా? కసి గందనిస్తానా!?


photo here, Link (Link)
******************


నీ వీక్షణమ్ములు; 
నవ రసజ్ఞభరితపు దవన, మరువములు; 
నీదు చూపుల కరిగి, కరిగీ- 
ఉవ్వెత్తు వారిధి నయ్యెదన్! 


నెయ్యముతో ఓ జవ్వనీ! 
"అలగ" నన్ను మార్చివేసిన 
నీదు అల్లరల్లరి నవ్వులన్
మునిపంట నొక్కి పెట్టివేసినావు!


ఔరా! సరి క్రొత్త అవిరళగతుల నేర్పి
 నీవే- స్థిర తీరమై పరచుకొమ్ము!
నాదు- తరళ స్పర్శలనందుకొనుచూ;
సైకతమ్ముల సందడి - 
ఎపుడొ ఏమో గాని- చెలియా!
"చిలిపి చెలియలి కట్ట"గా ;
నువు అవతరించిన వైనమే
పెను విచిత్రమ్ము
ప్రణయగ్రంధపు "ప్రముఖ శీర్షికై" నిలిచిపోయెను!  
;

భాగస్వామ్య నిష్పత్తి


"నేను చేయను"; 
"మీమాట వినను!" 
అన్నీ "న"కార సమాధానాలే 
-       -          - ఆకారములు దాల్చి, 
ఎదుట నర్తిస్తున్నాయి. 
సంఘమా! 
ఇది కాలముతోపాటు- నడిచివస్తూన్న 
"పరిణామక్రమపు అడుగుజాడలు" 
అనే నిజమును తెలుసుకుని; 
గుండె నిబ్బరం చేసుకో!
బహుశా- ఛార్లెస్ డార్విన్ - 
ఈ కోణమును- తన పరిశోధనకు ఎంచుకోలేదేమో!    
సమాజ మార్పులకు సైతమూ-
evolution theory వర్తిస్తుందని!


ఊహించే ఊహలు, 
ఊహించని యోచనలూ కూడా - 
వింత వింత స్వరూపాలతో - ప్రభవిస్తాయి, 
ప్రభవిస్తూనే ఉంటాయి, 
ఉద్భవించిన వాటికి- చైతన్య శక్తీ సమకూడి, 
ఊరికే ఒకచోట కాలు నిలువనీయదు కదా!


ఆ ఆట - 
రాస నృత్యమైనా, 
తాండవ నాట్యమైనా- 
కన్నుల ఎదుట- 
చరిత్ర తరువుకు, 
నిరంతరము పల్లవిస్తూనే ఉండే 
కొంగ్రొత్త చివురులే!
;
Artemis! Goddess of the Moon
;  ;
నేస్తమా! 
ప్రభాత కిరణాళిని వెదజల్లుతూ, 
సముల్ల్లాస ఆహ్లాదభరిత నర్తనాలుగా- 
ఆ చరణాల కదలికలను మలచగలుగుతావో.....!?


పోనీ ... 
చండ్ర నిప్పులు ఉమిసే 
మధ్యందిన మార్తాండ రేఖా వలయాలలో- 
మానవతా కువలయ పరిమళ పుష్పాలను,
కమిలిపోయేలా చేస్తావో- 


ఈ మహా నిర్మాణములో, 
నీ భాగస్వామ్యాన్ని గురించి- 
రవ్వంత ఆలోచించు! 

20, జులై 2012, శుక్రవారం

పద లతలు - "అ- ఆ అచ్చులు" 1


 అగ్ర,ఆది, మొదటి,తొలి

1) A) ఆది: ఆద్యంతములు; ఆదినారాయణా!" 
ఆదిశేషుడు, ఆదిమ మానవుడు; ఆదిదంపతులు(= పార్వతీ పరమేశ్వరులు);
"ఆది అనాదియు నీవే దేవా!....." 
               ~~~~~||||||||~~~~~
2) B) మొదటి: మొట్టమొదట: 
         మొదటి సారి: మొట్టమొదటిసారిగా: 
         మొదలూ తుదీ తెలీని: 


3) C) తొలి: తొలిచూపు: తొలి ప్రేమ: 
          తొలుదొలుత/  తొలుదొల్త:
          తొలకరి -> మబ్బులు, చినుకులు, 
          తొలికారుమేఘములు; 
          తొల్లి/తొల్లిటి            
                 ~~~~~||||||||~~~~~                                             


4) D) అగ్ర, అగ్రగామి: అగ్రజుడు: 
             అగ్ర పీఠము:అగ్రాసనమును ఇచ్చి గౌరవించుట; 
             అగ్ర తాంబూలము ఇచ్చి:  
             శిఖరాగ్రము:


                  ~~~~~||||||||~~~~~


5)a) ఆదాయము= రాబడి, సంపాదన;
5) b)               ఆది x అనాది ; 


************************
&&&&&&&&&&&&&&&;


                       ( BY: కాదంబరి )


pada latalu: "a- aa achchulu":- 

aadi: aadyaMtamulu; aadinaaraayaNA!" 
aadiSEshuDu, aadima maanawuDu; 
aadidaMpatulu(= paarwatI paramESwarulu);
"aadi anaadiyu niiwE dEwA!....."

                                ~~~~~||||||||~~~~~

2) B) modaTi: moTTamodaTa: 
modaTi saari: moTTamodaTisaarigaa: 
            modaluu tudii teliini: 

3) C) toli: tolichUpu: t
oli prEma: toludoluta/  toludolta:
tolakari -> mabbulu, chinukulu, 
tolikaarumEGamulu; tolli/tolliTi 

                              ~~~~~||||||||~~~~~ 
4) D) agra, agragaami: agrajuDu: 
agra pIThamu:agraasanamunu ichchi gaurawiMchuTa; 
agra taaMbUlamu ichchi:  
SiKaraagramu: cheTTu modalu; 
vRkshaagramu; agrapUja; 

                               ~~~~~||||||||~~~~~

5) E) aadaayamu= raabaDi, saMpaadana;
aadi  x anaadi ;

**************************************;

పద లతలు (July)

 నందన   "అ- ఆ అచ్చులు":-  నందన