22, నవంబర్ 2012, గురువారం

మబ్బులను మరిపించే కేశపాశములు

అబ్బలాలొ! నీ కురులు;
మబ్బులను మరిపించెను ||

ఒప్పుగ మరువం, దవనం ;
ముప్పేటల పరిమళాలు;
తిప్పిన జడ పాయలవీ;
గుప్పుగ కురిసే వానల;
చూపించుము ఎక్కడనో? ||

ఏమరక విరబూసే:
తామర పుష్పాల సౌరు;
కోమలి వదనారవింద- మునకు 
సాటి రాదులే!
సాటి రానెరాదులే!
దిగ దుడుపు ఖచ్చితమే! ||

 మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్

veni guthan,leelaabbalaalo! nii kurulu;
mabbulanu maripiMchenu ||

oppuga maruvaM, davanaM ;
muppETala parimaLAlu;
tippina jaDa paayalavI;
guppuga kurisE vaanala;
chUpiMchumu ekkaDanO? ||

Emaraka virabUsE:
taamara pushpaala sauru;
kOmali vadanaaraviMda
munaku saaTi raanerAdulE! ;
diga duDupu KachchitamE! ||

|||||||||||||||||||||||||||||||||||||||||


రేయి జడలోనికి ఆమె నవ్వుల నగలు


 హంస గమనను నేను ప్రాధేయ పడుతూన్నాను! 
"నీ నవ్వులను కూడా ఈ పూల సజ్జల నిండా నింపుమోయీ!" అని.

చెలి పూలసజ్జతో బయలుదేరినది; 
ఇంకేం!? 
పెను చీకటి కాస్తా "జడలు విప్పుకున్నది"
సఖీ! ఆ తిమిర వేణికి 
తారలనూ, రవి చంద్ర గోళములతో పాటు; 
అదనపు అలంకారములను ఇవ్వు! 

నీ నవ్వులను కూడా 
ఈ పూల సజ్జల నిండా నింపుమోయీ, 
-                          నా హంస గామినీ!
తమస్సు కొప్పులోనికి; 
నీ దరహాస పుష్పముల తురుముమోయీ! 

!!!!! ~ ~ ~ ~ !!!!! ~ ~ ~ ~ ~  !!!!! aaaaa A మ్ 

Ahalya means ‘without deformation’. 


aaaa aaaa aaaaaaaaaaaaaaaa
cheli puulasajjatO bayaludErinadi;
iMkEM!?
penu chiikaTi kaastaa
jaDalu wippukunnadi,
sakhii!
aa timira wENiki taaralanuu,
rawi chaMdra gOLamulatO paaTu;
adanapu alaMkaaramulanu iwwu!

nii nawwulanu kUDaa
ii puula sajjala niMDaa niMpumOyii,
naa haMsa gaaminii!

aaaaaa !1111!A ~ ~ ~ ~ ~ !!!!! ~ ~ ~ ~ ~ ~aaaaaaaaaaa AAAAAA మ్ 111111

vEdicgoddess Photo link

20, నవంబర్ 2012, మంగళవారం

మెరుపు తీగలకు ఉరుకులు


మన అందరికీ పరుగుల పోటీ!
తేల్చుకుందము ఎవరిదొ ధాటీ!
ముక్కోటి తటిల్లతా తతులారా!

ఆ తరుణీ మణి లావణ్యాలతొ
భేటీ అయ్యీ అవగానే
మిమ్ము మీరే మరచుదురేమో!?
లంఘనమ్ములను విడెదరేమో!?

ఆ పై 
ఆమె పద ద్వయికి
అలరే పారాణిగ మారి
అయ్యారే! పాదాక్రాంతులు అయీ
అల్లరి అద్వైతమ్మును
నవీనమ్ముగా వెలయించెదరో, ఏమో!? 
;
హక్కు కోసం కోర్టు కెక్కినవి
అక్షర పల్యంకికలోన ఊరేగేటి హక్కు ;
నవ రసములలోన ఒక్క 'వలపుదేనా? ;
అనుచు సాహితీ ధర్మాసనమును చేరి ;

నవ రసమ్ములలోని ; 
తక్కిన రసములన్ని ఒక చోట చేరినవి;
మీమాంస, చర్చలను
చేసినవి ఎడతెరిపిలేకుండ! 
కూడి
న్యాయమ్ము కొఱకు పోరాడ సాగినవి
ఆ నాటి నుండీ!
ఈ నాటికైనా వాని 
ఆరాటము వగదిగే 
ఆశ కనుచూపు మేరలో అగుపించుతోందా? 
;

squidu Image ( Link for photo)
'''''''''''''''''  
హక్కు కోసం కోర్టు కెక్కినవి

''''''''''''''''''''''