ఉండ్రాళ్ళ గణపతీ! దండాలు స్వామీ!
వేనోళ్ళ పొగడుదుము, మనసారా నిన్నే! ||
;
దంతమును ఘంటముగ చేసుకొన్నావు
ఘడియలో “జయమ్” రాసి పెట్టావు
విలాసముగ తొండమును ఊపుతూ నవ్వేవు ||
;
“మహా భారతము” గొప్ప ఇతిహాసము
లోకములకు అందుట నీ చేతి చలువయే!
అని మురిసె వ్యాస ముని; ఔరా! నీ మహిమలు ||
***************************************;