31, జులై 2015, శుక్రవారం

దంత రోచిస్సులు

వెన్నెలలకు ఆటపట్టు అయిన 
చెలియ మోమును గని;
చుక్కలన్ని దిగివచ్చెను;

తన - పలువరసలొ మిలమిలల
వరుసలై స్థిరపడినవి 
{దంత రోచిస్సు}  

=======================

damta rochissu :- 

wennelalaku aaటpaTTu ayina 
cheliya mOmunu gani;
chukkalanni digiwachchenu;

tana - paluwarasalo milamilala
warusaలై sthirapaDinawi  

**************************************

30, జులై 2015, గురువారం

వాక్కుల నోములు

యుగయుగాలుగా, ఎలనాగ ; 
ఒక మహోద్గ్రంధము; 

నేను తనకు అనుబంధము;
తరతరాలుగా తరుణీమణి - 
ప్రధాన వాచకము; 
నేను తనకి ఉపవాచకము;
ప్రణయకలహాల ఆత్మబాంధవి!!!  

తాను ఆకాశవాణి; నేనేమో ; 
ధరణీఫలకమున పరచుకుంటూనే ఉండే 
అచ్ - హల్ - కలబోతల వాక్కుల;
నిరంతర దీక్షాకంకణబద్ధుడిని;
విధేయుడిని! 
నాదు ప్రణయకలహాల ఆత్మబాంధవికి!!! 

=============================

waakkula nOmulu :- 

yugaయుగాలుgaa, elanaaga ; 
oka mahOdgramdhamu; 
nEnu tanaku anubamdhamu;
taraతరాలుgaa taruNImaNi; 
pradhaana waachakamu; 
nEnu tanaki upawaachakamu;
praNayakalahaala aatmabaamdhawi; 

taanu aakASawaaNi; 
nEnEmO -
dharaNIphalakamuna 
parachukumTUnE umDE 
ach - hal - kalabOtala waakkula;
niramtara diikshaakamkaNabaddhuDini;
widhEyuDini!
naadu praNayakalahaala aatmabaamdhawiki!!!!!!!   


*************************** 

ఓ చెలీ! నా నెచ్చెలీ!

యుగాలు మారినా, తరాలు మారినా 
మారని అంశం ఒకటున్నది - అని 
ఇప్పుడు తెలుసుకొంటిని -

ప్రణయ గీతం ప్రబంధమై ; 
భాసించుచున్న ఆ హేతువును; 
నే కనుగొంటిని పద్మదళ నయనీ!

ప్రేమప్రభలు ప్రతిభావంతమైనవి, 
 నీ చూపులు, నీ నవ్వులు, 
నీ పలుకులు, నీ కులుకులు ;

వలపు ఇతిహాసమునకు ఆశ్వాసములు;
అని కనుగొన్నాను లలిత లావణ్య  విలాసినీ!  
సుమగాత్రీ! ఓ చెలీ!  నా నెచ్చెలీ!
      
==========================

#yugaalu maarinaa, taraalu maarinaa 
maarani amSam okaTunnadi, ani -
ippuDu telusukomTini  -

praNaya giitam prabamdhamai ; 
bhaasimchuchunna aa hEtuwunu; 
nE kanugomTini chelI! 

prEmaprabhalu pratiBAwamtamainawi, 
 nii chuupulu, nii nawwulu, 
nii palukulu, nii kulukulu ;
walapu itihaasamunaku aaSwaasamulu;
ani కనుgonnaanu lalita laawaNya  wilaasinii!  
nE kanugomTini chelI! నా nechchelii !  

**************************
                   [ -  ఆటిన్ కవితలు   ]

Telugu Ratna Malika
Pageview chart 4524 pageviews - 127 posts, last published on Jun 22, 2015