11, నవంబర్ 2015, బుధవారం

వేయి కన్నులు సరిపోవునా !?

రేయి పొలమునందున
పైరు పంట బాగున్నది ||
జాలమేల? రావోయీ !
చందమామా! ||
చుక్క పూత, పువ్వులు;
మిల మిలల ఆటలు; 
చూడ వేయి కన్నులు
సరిపోవునా!? ||  || 
చుక్కల్ల కళకళలతొ 
            - నీదు ఆటలు;  
చూడ వేయి కన్నులు
సరిపోవునా!? ||       

===================, 

reyi polamunamduna ; 
pairu pamta baagunnadi; 
jaalamela raawoyi chamdamaamaa! || 

chamdamaamaa! chamdamaamaa! ||

chukka puuta, puwwulu;
mimila milala aaTalu;
chUDa wEyi kannulu
saripOwunaa!? ||  

chukkalla kaLakaLalato niidu aaTalu;
chUDa wEyi kannulu
saripOwunaa!? || 

***********************;
Wishing everyone 
a whole lot of love, light and happiness Diwali! 

Happy Diwali ! 


ఋతురాగాలు - సూర్య చంద్రుల పయనాలు ;-

రే చుక్కలతో చెట్టపట్టాలేసుకుని,  
చంద్రుడు నిమ్మళంగా మసక తీరాలకు వెళ్తున్నాడు , 

వేగుచుక్క పొడిచింది. 
వేగులవాని వలె ;, 
ప్రాగ్దిశా నాయకుడు చరచర వచ్చేసాడు,  

సప్తాశ్వ రధాన్ని సిద్ధం చేసినట్టి.  
సారధి అనూరుడు వీల వేసాడు

ధరా వలయాన్ని చుట్టేస్తూ ; 
గాలికి లల్లాయిపాటల ఇంద్రధనుస్సులను, 
అందించే తాపత్రయాలతో; 
సప్తాశ్వాలు జూలును విదిలిస్తూ పరుగులిడుతుంటే, 
కళ్ళాలను సవరించాడు రధసారధి. 

ఫగ్గాలను తానందుకుంటూ 
చిరునవ్వుల దరువులతో ఋతురాగాలు కొనసాగగా, 
ప్రయాణాన్ని ఆరంభించాడు తొలిపొద్దు సూరీడు 

[కవిత – కుసుమ] 

===================================, 

[kawita – kusuma] :- 

rEchukkalatO cheTTapaTTAlEsukuni,  
chamdruDu nimmaLamgaa masaka tiiraalaku weLtunnaaDu , 
wEguchukka poDichimdi. 

wEgulawaani wale ;
praagdiSA naayakuDu 
charachara wachchEsaaDu,  
saptaaSwa radhaanni siddham chEsinaTTi. 
Saaradhi anuuruDu wiila wEsaaDu, 

dharaa walayaanni chuTTEstuu ; 
gaaliki lallaayipaaTala imdradhanussulanu, 
amdimchE taapatrayaalatO; 
saptaaSwaalu juulunu widilistuu paruguliDutumTE, 
kaLLAlanu sawarimchaaDu radhasaaradhi. 

Paggaalanu taanamdukumTU 
chirunawwula daruwulatO Rturaagaalu konasaagagaa, 
prayaaNAnni aarambhimchADu tolipoddu suuriiDu 

************************      
Rtu raagaalu - suurya chamdrula payanaalu =

[సూర్య చంద్రుల పయనాలు]  భావుక 
;