20, జనవరి 2016, బుధవారం

చిరుగాలి బుడతడు

సంగీతమంటే 
ఏ మాత్రమూ గిట్టదు వానికి; 
ఆ చిరుగాలి బుడతడు  
నేడు బహు అచ్చెరువులో 
మునిగి ఓలలాడుతున్నాడు  
భూమిపై తారాడు నీదు కతమున 
చూడు ,చూడుము! జగన్ మోహినీ!     

మరి – నీదు ప్రతి కదలిక, 
ముగ్ధమనోహరంపు సొంపులే ఔతూన్న 
   చందముల భణితి మహిమయే ఇది కదా! 
నీలవేణీ! నీదు నిడుపాటి కుంతలములు 
వీణాతంత్రులై మలచుచున్నది 
సృష్టిలోని ప్రతి అంశమును! ;  

నీదు కురులపై అడుగడుగున ; 
తన ప్రతి అడుగు 
సంగీతనాదముగ మారుతూన్నట్టి ;   
కొంగ్రొత్త గారడీ కనుగొనుచు; 
బుడుతనికి తెగ సంభ్రమం, విభ్రమం! 
=======================,

samgiitamamTE 
E maatramuu giTTadu waaniki; 
aa chiru gaali buDataDu  
A chirugaali buDutaDu ; 
nEDu bahu achcheruwulO 
munigi OlalADutunnADu ; 
bhUmipai taraaDu nii katamuna ; 
jagan mOhinii! chuuDu ,chuuDu! ; 
mari – niidu prati kadalika, 
mugdha manOharampu sompulE autuunna chamdamula bhaNiti mahimayE idi kadA! ;

niilawENI! nIdu kumtalamula weeNAtamtralanu ; aasaraagaa gaikonnadi gaali: samgiitanaadamuluga prati aDugu maarutuunnaTTi ; 
komgrotta gaaraDI kanugonuchu; 
buDutaniki tega sam bhramam, wibhramam! 

***************,


 మబ్బులు  వచ్చెను  

కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 64084 pageviews - 1040 posts, -on Jan 19, 2016 -
అఖిలవనిత
Pageview chart 34546 pageviews - 829 posts, - Jan 18, 2016
తెలుగురత్నమాలిక 

Pageview chart 5149 pageviews - 147 posts, last published on Nov 11, 2015