27, మార్చి 2016, ఆదివారం

ప్రణయ పద సంపదలు

జనుల మనసులలోన ; ప్రేమ భావతత్వమ్ములు 
ప్రేమ భావతత్వమ్ములిటుల సంచారములు సేయుచూ ఉండుటది ; 
అలరించుటా? లేక - అలమటిల్లగ జేయుటా??  ప్రియా!     
;
అనురాగమీలాగునస్తస్తమానం ; 
ఎద వీణ తీగలను
ప్రస్తరించుచు చిరుకంపనమ్ముల వణికించుటేల?
;
ఇటువంటి చేష్ఠలు ; 
ప్రణయ పద సంపదల పేటికలొ
పదిలమౌ పెన్నిధులు విలువైనవే కదా!  

********************************,