30, మే 2016, సోమవారం

తేనీలు / నానీలు

1] స్విమ్మింగ్ ఫూల్ / 
ఈత కొలను :-
పోటా పోటీలుగా 
ఈత పోటీల భామినులు; 
మీనాక్షుల ఈదులాటలతొ ; 
నిండుగ "కొలను - ఆక్వేరియం "
;
[ శీర్షిక :- తేనీలు ] 
;
౨౦౧౬   ౨౦౧౬   ౨౦౧౬ ౨౦౧౬   ౨౦౧౬ 

2] వెన్నెల పువ్వు పూసింది
చేత పట్టుకునికులుకుతూ 
వ్యాహ్యాళి చేస్తూన్నది
పున్నమి మహరాణి! 
;
౨౦౧౬   ౨౦౧౬   ౨౦౧౬ ౨౦౧౬   ౨౦౧౬ 
;
3] ఏటి అలలపైన; వెన్నెల సింహాసనం; 
విను వీధుల విహరిస్తూ వచ్చిన ;
నీలి నిశీధి అధివసించింది!
;
"రేపటి ఉషస్సులు
తన నేస్తములే కదా!"
అనుచు ఆహ్వానం పలికింది నిశీధి!
;
=================================;
;
1] # swimmimg phuul / iitala pOTIlu :-
pOTA pOTIlugA 
iita pOTIlu ; bhaaminulu; 
meenaakshula IdulaaTalato ; 
nimDuga kolanu aakwEriyam - 
;
[ SIrshika :- tEnIlu / నానీలు (small poems)]

;౨౦౧౬   ౨౦౧౬   ౨౦౧౬ ౨౦౧౬   ౨౦౧౬ 
tEnIlu  / ; [తేనీలు] :-
;
wennela puwwu puusimdi
chEta paTTukuni
kulukutuu wyaahyaaLi chEstuunnadi
punnami raaNi!
punnami maharaaNi!
;
౨౦౧౬   ౨౦౧౬   ౨౦౧౬ ౨౦౧౬   ౨౦౧౬ 
;
3] ‪‎ETi‬ alalapaina; wennela simhaasanam; 
winu weedhula wiharistuu wachchina ;
niili niSIdhi;
adhiwasimchimdi!
;
"rEpaTi ushassulu
tana nEstamulE kadaa!"
anuchu aahwaanam palikimdi niSIdhi!
;
*******************************
;
;తెలుగురత్నమాలిక ;- 5447 = 158 posts, last published ; May 29, 2016
;~ December 31, 2015 ; post ; 

29, మే 2016, ఆదివారం

లోకాభిరామాయణం

చుక్కల తళుకుల  బాతాఖానీ! ; 
చెలి సొగసులతో ఆషామాషీ ;
కబురులందున భాగస్వాములు ;
తారామణులు;
;
కాంతిప్రభల లోకాభిరామాయణం; 
చుక్కల తళుకుల బాతాఖానీల హడావుడి
రేయి గగనమ్మున నిండిన సందడి! 
;
==============================,
;
chukkala taLukula baataaKAnii!
cheli sogasulatO aashaamaashii ;
kaburulamduna bhaagaswaamulu ;
taaraamaNulu;
;
chukkala taLukula baataaKAniila haDAwuDi
rEyi gaganammuna nimDina samdaDi! 
;
************************************,
ఒక proverb :-
;
"రసో వై సః||"

విస్తృతినౌతూ ... , విస్మృతినౌతూ...

బింబాధరి చుంబనమ్ములిడు వేళలలో   
అనురాగ లోకమున విస్తృతినౌతూ ;
ఉంటిని తరుణిలొ లీనమయీ!
;
అంబుజాక్షి తిరస్కృతికి గురి ఐన వేళలలో
నిషృతి ఏమిటొ - బోధపడక 
ఇటు
విస్మృతినౌతూ........... ! 
;
=============================,
;
bimbaadhari chumbanammuliDu wELalalO   
అనురాగ లోకమున విస్తృతినౌతూ ;
umTini taruNilo leenamayii!
;
ambujaakshi tiraskRtiki guri aina wELalalO
nishRti EmiTo - bOdhapaDaka iTu
wismRtinautuu........... ! 
;
**********************************,   

మౌని - మౌనము

ప్రేమిక ధాత్రిని ; 
       స్థిరపడ్డాను ఇట్లాగ! ... 
తను నిర్లక్ష్యిస్తే ; 
       మౌనము నౌతూ ...
మౌనిగ - లోగిట ముడుచుకునీ .........!
;
సఖి నను లాలిస్తే ....
       తన కెమ్మోవిని 
          తేనెల ఊటను అయ్యీ ..... !               
;
--------- [ ప్రేమిక ధాత్రి ]
;
================================,
mauni - maunamu 
prEmika dhaatrini ; 
sthirapaDDAnu iTlaaga! ... 
tanu nirlakshyistE ; 
maunamu nautuu ...
mauniga lOgiTa 
muDuchukunee .........!
sakhi nanu laalistE ....
tana kemmOwini tEnela uuTanu ayyii .....!
;
*************************,

తెలుగురత్నమాలిక - 5420 pageviews - 155 posts, last published on May 19, 2016 -

19, మే 2016, గురువారం

సంపంగి కలశం

పరిమళాలకు కలశం 
          'సంపంగి పూవు' ;

కల్లోలిత ఋతువులారా!
    ఈ సంపంగి తావులను
         శిరసు మీద చల్లుకోండి!
  స్థిత ప్రజ్ఞతను, శాంతమ్మును 
              కానుకలుగ గైకొనండి! 
;
************************************,
;
నా డెందంలో జలపాతం నువ్వు ;
    నీ నవ్వులలో పువ్వునయీ జారిపోతూ 
;
************************************,
;
ఆనందబాష్పాల వన్నెలను 
అద్దుకున్నదినాదు మనసు! 
నిరంతరమూ - 
కొంగ్రొత్త చిత్తరువుల కలిమి 
ఈ మనసుకు సొంతం.
;
************************************,
;
ఊహలకు రెక్కలు తొడిగాడు మదనుడు;
వియత్తలాన-
ఊసులన్నీ చేస్తూన్న  విహారములను
వీక్షిస్తూ, మన్మధుడు నిశ్చేష్ఠుడౌతూ
తానే మరొక చిత్రం ఐనాడు!! తరుణీ!
;
===================================,
;
 parimaLAlaku kalaSam 
       'sampamgi puuwu' ;

kallOlita RtuwulaarA!
      ii sampamgi taawulanu
Sirasu meeda challukOMDi!
     sthita praj~natanu, Saamtammunu 
               kaanukaluga gaikonamDi! 
;
************************************,
;
] naa DemdamlO jalapaatam nuwwu ;
    nee nawwulalO puwwunayii jaaripOtuu 
;
************************************,
;
] aanamdabaashpaala wannelanu 
addukunnadinaadu manasu! 
niramtaramuu - 
komgrotta chittaruwula kalimi tana somtam.
;
************************************,
;
] uuhalaku rekkalu toDigADu madanuDu;
wiyattalaana-
uusulannii chEstuunna  wihaaramulanu
weekshistuu, manmadhuDu niSchEshThuDautuu
taanE maroka chitram ainADu!! taruNI!
;
************************************,
;

అద్దం, mirror works

దారమునై నిలిచాను నీ మ్రోల ; మానినీ! 
నీ నగవు శీతల ముత్తెములనిటు   
నిటు గ్రుమ్మరించు! ; 
మిసమిసమసలడేటి;  
ముత్యాల సరము నౌతాను! - 
;
--------- [ కవిత 1 ]  ;

******************************,
;
గాలి స్తంభించగా ; 
ముచ్చెమటలే నిండె తన తనువు నిండా!
తులతూచుచున్నది మలయమారుతము ; 
మేఘాల సిబ్బెల తులలోన హర్షముతొ ; 
ఆమె స్వేదంపు అత్తరులను, సురభిళ పన్నీరులను!    
;
------------ [ కవిత 2 ] :

******************************,

స్వప్నాల అద్దం భళ్ళున పగిలింది; బెరుకేల? 
ఏరుతాను ఆ ముక్కలు;
మేల్మి కుట్టు పనితనంతో
కొత్త కవితా వస్త్రాన్ని చేస్తాను;
నీకు ఇస్తాను, అందుకో నా ప్రాణసఖీ! 
;
--------- [ కవిత 3 ]  ;
       ------- [ అద్దం డిజైన్లు ; ] 

******************************,
================================,
;******************************,

daaramunai nilichaanu nee mrOla ; 
maaninii! nee nagawu SItala muttemulaniTu   
niTu grummarimchu! ;
misamisamasalaDETi;  
mutyaala sarau nautaanu!
;
******************************,
;
gaali stambhimchagaa ; 
muchchemaTalE nimDe tana tanuwu nimDA!
tulatuuchuchunnadi malayamaarutamu ; 
mEGaala sibbela tulalOna harshamuto ; 
aame swEdampu attarulanu, 
suraBiLa panniirulanu!
;
******************************,
;
swapnaala addam BaLLuna pagilimdi; berukEla?   
geetaamjali sinimaa, Erutaanu aa mukkalu;
mElmi kuTTu panitanamtO
kotta kawitaa wastraanni chEstaanu;
niiku istaanu, amdukO naa prANasaKI! 

--------- [ addam Dejainlu ] ; 

******************************, 

18, మే 2016, బుధవారం

నేడు వింత జరిగెను!

తటాకమ్ముల చిరు తరగలు ; 
తటాలున  నేర్చినవి ; 
ఆటపాట లెన్నెన్నో! 
ఎటుల, ఎటుల? తెలుపండీ!
 ఇటుల - 
           ~  నేడు వింత జరిగెను!    ||  
;
తరంగములు మృదురాగిణి
 + లయ్యినవీ ఓహోహో!  
తరగ తంత్రు పయిన 
గాలి మృదు స్పర్శలు పాటలయీ - 
హొయలు లొలకబోసేను! 
           ~  నేడు వింత జరిగెను!    ||  
;
తరగమడత తారళ్యత ; 
వెన్నెలను పిలిచేను ; 
తీరమ్ముల సైకతముల
అనురాగపు చలనమ్ములు -  
లక్ష హంస తూలికలై ; 
నవ చిత్రమ్ములను తీర్చి వేసెను! ||
;
ప్రకృతిలో - అణువు అణువు ; 
ప్రణయ పాన్పు ఆయెను! 
           ~  నేడు వింత జరిగెను!    || 
;
చిలుక వాహనుడు మదనుడు ; 
శుకము వీడి తురగమెక్కె! 
'ఛల్ ఛల్!' అంటూ : 
బాగ హల్ చల్ చేస్తుండెను! 
           ~  నేడు వింత జరిగెను!    ||  
;
నవ్య ప్రేమజంటలకు ; 
మోహనమౌ మోహ-రంగమందున ; 
కదన రంగమును ఏర్పరచెను అతనుడు;
           ~  నేడు వింత జరిగెను!    || 
;
సమ్మోహనకరముగాను గుంభనముగ నవ్వేను 
పతి నగవుల పారిజాత సుమములన్ని
కూర్చి దండలల్లి
తన గళమున ధరియించీ
అల్లిబిల్లి మేల్మి ఆటలాడేను;
           ~  నేడు వింత జరిగెను!    || 

****************************\****,

6, మే 2016, శుక్రవారం

నా progress card - 1

post - 1 ]
Saturday, March 7, 2009
ఒప్పుల కుప్పలు - 1 ( పల్లవి) ;-  మోదమో -తన మాటయో? 
నాట్యమో-తన నడకయో? ఏమి వయ్యారం! ఏమి సింగారం! //

*****************************

post - 2 ]
Saturday, March 7, 2009
ఆమని కులుకొక్కటి - 2
అవనికి దిగి వచ్చినది ఆమని కులుకొక్కటి! 

స-రి-గ-మ-అని పాడినది ; విరి మాలిక సౌరభం !  // 

*****************************

post - 3  ]
Saturday, March 7, 2009
ఈ లీల వెన్నెల హేల  ;-
వేళ కాని వేళ ఇది ;  జాబిలి వెన్నెల హేల ;  

ఈ లీలగ సిరి వెన్నెల ; పగలు, రేల పండుగ?

*****************************

post - 4 ] 
Saturday, March 7, 2009
చిరు ప్రశంస - (౧) ;-  పూవుల దొన్నెల (గిన్నెల ) లోన

చల్లని వెన్నెల గంధము లివిగో! ;  కలువ మిథారీ !

*****************************

post - 5 ] ;- 
Saturday, March 7, 2009
కాటుక కోటలు ;- చిమ్మ చీకటుల ; పెట్టని కోటల;
కోటి జ్యోతులను వెలిగించే శక్తి సంపన్నవు,
నీవట సుదతీ! !!?
వాస్తవమేనా? ఓ విశాల నేత్రీ!
"కామిని అక్షుల మిల మిల కాంతులు ;  
కాటుక కోటల (లోన) వెలసిన వెనుక
నమ్మిక కలిగెను,ఇది నిజమే!"నని.


*****************************


▼ ▼ ▼ ▼ ఫిబ్రవరి ▼ ▼ ▼  ఫిబ్రవరి  ▼ ▼ ▼ February 

Tuesday, February 24, 2009

పోస్ట్ టెస్ట్ 


 ▼ ▼ ▼  మార్చి ▼ ▼ ▼  March (15) ▼ ▼ ▼ 
చంద్ర హాస (1965)
ఆణి ముత్యము

శ్రావణ మేఘములారా!

Tuesday, March 10, 2009
ఆణి ముత్యము ;  (పల్లె పిల్ల పాట)

1)సత్తెంగా ఆ ముత్తెం ;  మత్తెక్కించేను నిత్యం 
  కోర సూపు సూసేను   ;  కోటి తూపు లిసిరేను              
     "కోలు!కోలు! కోలంటూను;    కోలాటం ఆడేను   //   

▼  March (15)

చంద్ర హాస (1965)
ఆణి ముత్యము
శ్రావణ మేఘములారా!
శ్రావణ మేఘములారా!
వ్రత దీక్ష -(౪)
హరి విల్లులు (౩)
కాటుక కోటలు
చిరు ప్రశంస - (౧)
ఈ లీల వెన్నెల హేల
ఆమని కులుకొక్కటి - 2
ఒప్పుల కుప్పలు - 1
పరిచయం
పరిచయం
పరిచయం

ఇది నీను రాసిన తెలుగు పోస్ట్

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

2009 ▼  February (23)  #[అఖిలవనిత.blog]  
కార్తీక దీపాలు
అంజలిదే గొనుమా !
ఓ మోహన మురళీ !!!
అల్లిబిల్లి దండలు
పాహి మోహన కృష్ణ!
గైకొనుమా హారతి! పద్మావతి
వెన్నెల కోలాటం
చిత్రపటం
ఏడు వారాల పేర్లు
తేనె మధురిమలు
కొండ గుర్తులు
పదండి ముందుకు !
గొబ్బి దేవుళ్ళు
రామ లాలి... మేఘశ్యామ లాలి
పడమటి సంధ్యా రాగం 
రామ లాలి... మేఘశ్యామ లాలి
శంపా లత సామ్రాజ్ఞి
మురిపాల కన్నయ్య
కమ్మని స్వప్నాలకు భరోసా
చిలక వంకర ముక్కు
బాలకృష్ణుని పాల అడుగులు
పాల వెన్నెల శిల్పాలు
సందేహాలు  
;
 Labels ;-  in ;- తెలుగురత్నమాలిక blog ;-

నా First పోస్ట్&list,  ఆటిన్ కవితలు, ఓంకారం, 
కవిత, చిత్రసీమ, చినుకులు, హై'కూనలు'
తేనె కవితలు, నచ్చిన సంగతులు, 
నైస్ ఐత, పద లతలు, పద'నస'లు, 
పాట కవిత, మధు కవిత, మురళీ రవళి, 
రత్న వనిత డిజైన్స్, వివిధ భాషల వింతలు, 
శుభగీతదీవెనలు, అనువాదదృశ్యము,
cloth designs, english same, 
idi chittu vrAta prathi 

నా progress card - 1 ;-
 నా మొదటి పోస్టు " #అఖిలవనిత.blog లో :-   

నలుపు కూడా అందమే!

అద్దమ రేతిరిలోన ; 
పున్నమి జాబిలి అద్దం;
రేయి చూచుకుంటూన్నది తన అందం,
మిసిమి నలుపు సైతమూ
అందంలో భాగమే ఓ నేస్తం!
;
****************************,
;
తారామణిదీపాలు వెలుగులీనెను 
మబ్బు చెరగులను పట్టి;
సుతారముగ వీచు గాలి
నిశిరేయిని 
తొంగి చూచి కిసుక్కున నవ్వేను 
;
*****************************,
;
అగణిత భావాల శిల్పములు
నిలుపుచున్న రేయంతా;
ఋతురాణి ఎత్తిపట్టినట్టి కాగడా! 
ఎద ఎదలో అపూర్వమౌ "ఆది అజంతా"!
;
**************************** 
; by ;- ; [సుధాక్షీరం ]

# ===========================;
ఆది అజంతా ;-
addama rEtirilOna ;
punnami jaabili addam;
rEyi chuuchukumTUnnadi tana amdam,
misimi nalupu saitamuu
amdamlO BAgamE O nEstam!
;
****************************,
taaraamaNideepaalu weluguleenenu 
mabbu cheragulanu paTTi;
sutaaramuga weechu gaali
niSirEyini 
tomgi chuuchi kisukkuna nawwEnu 
*****************************,
agaNita bhaawaala Silpamulu
nilupuchunna rEyamtaa;
RturaaNi ettipaTTinaTTi kaagaDA! 
eda edalO apuurwamau "aadi ajamtaa"!
;
****************************
; + by ; - [sudhaaksheeram ; upa, taranga ]

**********************************; 
ఆది అజంతా ;-

నా మొదటి పోస్టు & మాణిక్య వీణ

నా మొదటి పోస్టు " #అఖిలవనిత.blog లో ;-

 శ్రావణ మేఘమ్ములార!
వర్షించే మబ్బులారా! 
కుప్పతెప్పలౌతూన్నవి 
జలబిందు ధారలు!
;  
మీ హృదయ కుహరముల  
ఆ అశ్రురాశులను దాచుకోండి!

నా కన్నుదోయిలోన 
ఆ బాష్పములకు 
ఉప్పతిల్లుచు పొరల 
జన్మ నిచ్చెదను!    
'పునర్జన్మ 'నొసగెదను, 
           దిగులు వలదు, వలదింక!
             ఓ నీరదములార!
************************************,

             [ Tuesday, March 10, 2009
                      శ్రావణ మేఘములారా! ]
************************************,
;
                  అవ్యక్తం!

కలనూపుర రవళిమ అవ్యక్తం!
ఉదయారుణిమ ప్రాగ్ దిశ నవ్యక్తం!
చెలి పెదవిని హాసం అవ్యక్తం! 
మృదువీణగ మారెను నా హృదయం!

==================================,
;
                awyaktam!

kalanuupura rawaLima awyaktam!
udayaaruNima praag diSa nawyaktam!
cheli pedawini haasam awyaktam! 
mRduweeNaga maarenu naa hRdayam!
;