29, జూన్ 2016, బుధవారం

పున్నమి ఉవిద

పౌర్ణమి ప్రౌఢ - హంసగమనముల; 
విచ్చేస్తూన్నది గమ్మత్తుగ ; 
కను ఋతుశోభల క్రీగంటన్! || 
;
నిత్య కృత్య విధిని మరువదు తాను! 
ఏమరుపాటుగనైనా : 
మేఘమాలికల 
పళ్ళెరములు తెచ్చింది; 
వరుసలుగా పేర్చింది; 
పేరిమి మెరుపుల జ్యోతులు; 
నిమ్మళముగ వెలిగించెను || 
;
శ్రావణ ఋతు సామ్రాజ్ఞికి ; 
స్వాగత హారతులను 
సున్నితముగ ఒసగింది ;
పున్నమి వనితాలలామ! ||
;
***********************;
;౨౦౧౬   ౨౦౧౬   ౨౦౧౬ ౨౦౧౬   ౨౦౧౬ 
[ఉప; తరం ; October 3]