మధు మాధుర్యాలను దూసి పోసినకిన్నెరల ఆలాపనా గానాలు;దివి నుండి జారి వచ్చి;సుతారంగా దూరి పోయినీదు కొంగు బంగారముగా మారి పోయాయికోమలీ! కాస్త దయ ఉంచి ;నీ చెంగు ముడి విప్పవా?“ పొడుపు కథ నీ నవ్వు “-కాస్త కరుణించి ,ముడి విప్పవా?పసిడి నాణెమ్ము అందుంది ;ఇటు జారి ;నా హృదయమ్ము పై పడెను;“ బొమ్మ” పడితేను నాదు భాగ్యమ్ము;నీ చరణ పద్మాల “ పద్మ రేఖను ఔతాను నేను”అటు గాక ;“ బొరుసు ” గా పడితేను;నిను గూర్చినట్టి భావనా చక్రాల శిథిలాలలోన;కూరుకు పోయినట్టి ‘“ఆశా ఇరుసునే ఔతాను తథ్యమిది ,సుమ్మీ!!&&&&&&&&&&&&&&&&&&&&&bomma, borusu, aaSaa irusu______________________madhu maadhuryaalanu dUsi pOsinakinnerala aalaapanaa gaanaalu;divi nuMDi jaari vachchi;sutaaraMgaa dUri pOyi;nIdu koMgu baMgaaramugaa mAri pOyaayi.kOmalI! kaasta daya uMchi ;nI cheMgu muDi vippavaa?“ poDupu katha nI navvu “-kaasta karuNiMchi ,muDi vippavaa?pasiDi naaNemmu aMduMdi ; iTu jaari ;naa hRdayammu pai paDenu;“ bomma” paDitEnu ; naadu Baagyammu;nI charaNa padmaala “ padma rEKanu autaanu nEnu”aTu gaaka ; “ borusu ” gaa paDitEnu;ninu gUrchinaTTi BAvanaa chakraala SithilaalalOna;kUruku pOyinaTTi ‘“ASA irusunE autaanu tathyamidi, summI!&&&&&&&&&&&&&&
తెలుగు మాటలపై మమకారం ; కొన్ని కవిత్వాలు,వ్యాసాలు,జోక్సు, కంప్యూటరు తెరపైన వేసిన బొమ్మలు,పెయింటింగ్సు....... వగైరా,వగైరా.....
27, ఫిబ్రవరి 2011, ఆదివారం
బొమ్మ, బొరుసు, ఆశా ఇరుసు
వెర్రి మాలోకము
స్వప్న పుష్పాల నుండి రాలుతూన్న;పుప్పొడి రేణువుల జలపాతాల ఉఱవడిలో;నిరంతర స్నానాల క్రీడాభిషిక్తుడనౌ;భాగ్య శాలిని కదా! నేను- :“ఆహా! వెఱ్ఱివాడు వీడనుచూ” ;వీడక నను గేలి సేయుఈ ప్రపంచపు చూపులకు;నా స్వప్న స్వర్గ లోకపు ద్వార బంధపునగిషీ మెరుపులలోనిఅతి స్వల్ప శకలమైనా దొరుకునా?అపరంజి రంజిత అందలములో నెలకొనిన;విస్తృత భావ కిరణ ద్యుతి వలయపు;చుట్టు కొలత ఎంతో ;ఆ లోక దృక్కులకు ఊహలైనా అందదు కదా!మరి ఈ లోకముఒక మాలోకము - అను మాటసత్యమే కదా! మిత్రమా!$$$$$$$$$$$$$$$$$$$$$$$$$Verri maalOkamu-----------------------svapna pushpaala nuMDi raalutUnna;puppoDi rENuvula jalapaataala u~ravaDilO;niraMtara snaanaala krIDABishiktuDanau;BAgya SAlini kadA! nEnu- :“AhA! ve~r~rivaaDu vIDanuchU” ;vIDaka nanu gEli sEyuI prapaMchapu chUpulaku;naa svapna svarga lOkapu dvaara baMdhapunagishI merupulalOniati svalpa Sakalamainaa dorukunaa?aparaMji raMjita aMdalamulO nelakonina;vistRta BAva kiraNa dyuti valayapu;chuTTu kolata eMtO ;aa lOka dRkkulakuUhalainaa aMdadu kadaa!mari I lOkamuoka maalOkamu - anu maaTasatyamE kadaa! mitramaa!$$$$$$$$$$$$$$$$$$$$$$$
24, ఫిబ్రవరి 2011, గురువారం
రంగుల తడి

నీ నవ్వులనూ, నీ కన్నులనూనీ లాలిత్యాన్నీ, నీ నిర్లక్ష్యాన్నీఅలవోకగా చిత్రించినఈ కుంచెలకు అంటి ఉన్న "రంగుల తడి" ఎన్నటికీ ఆరదు;తర తరాలకూసహృదయుల వ్రేళ్ళకు చేరి,మణుల వోలె ఆ వర్ణాలు,అంగుళీ హేమ హారాలలోఈ వన్నెల తూలికల రమ్య హేలలుఅరమరికగా ఉంటూనే ఉంటూన్నాయి, ఇందు బింబాననా!సదా, సర్వదాఈ చిత్ర రచనా హంస తూలికల విన్నాణపు తానాలు -"ప్రేమ తత్వము"లోని 'అపురూపతా దనమున 'కుసర్వ కాల నిదర్శనలు, సర్వజ్ఞత్వపు భాష్యములు$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$nI navvulanU, nii kannulanU\nI laalityaannI\ , nI nirlakshyaannI\alavOkagA chitriMchinaI kuMchelaku aMTi unna"raMgula taDi" ennaTikI aaradu\tara taraalakU\ sahRdayula vrELLaku chEri\maNula vOle aa varNaalu, aMguLI hEma haaraalalOI vannela tUlikala ramya hElaluaramarikagaa uMTUnE uMTuunnaayi,iMdu biMbaananaa!sadaa, sarvadaa -I chitra rachanaa haMsa tUlikalavinnaaNapu taanaalu -"prEma tatvamu"lOni 'apurUpataa danamuna 'ku \sarva kaala nidarSanalu,sarvaj~natvapu BAshyamulu$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
21, ఫిబ్రవరి 2011, సోమవారం
నా కదలిక విరి తోట సుమా!
నా గొంతుకలో ;నాకు "నేను"గా పలికే పలుకులు లేవు;నా పలుకులలో ,"నేను" "నేను"గా కనబడను;బహిర్ సత్యమే కదా !నా గళములోన; విరిసేనవి;నెలత లాస నవ మల్లెలు;నా "ప్రతి కదలిక" ;మంద గమన నడయాడేవిరి తోట సుమా!$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$naa goMtukalO ;naaku "nEnu"gaa palikE palukulu lEvu;naa palukulalO ,"nEnu" "nEnu"gaa kanabaDanu;bahir satyamE kadaa!naa gaLamulOna; virisEnavi;nelata laasa nava mallelu;naa "prati kadalika" ;maMda gamana naDayADEviri tOTa sumA!
పుట్టింటికి బహుమతి దిగి వచ్చిన చంద్ర కిరణము

ఆకాశము పుట్టిల్లు ::గగనం నుండిగాలి తరగల సోపానాల మీదుగా ;ఒక వెన్నెల కిరణం దిగి వచ్చి;నీ చరణ నఖములను తాకింది;పరావర్తనము జేయించినకోటి కిరణ రేఖలనుతన పుట్టినింటికికానుకలుగా ఇచ్చింది.$$$$$$$$$$$$$$$$$$$$$$$puTTiMTiki bahumati -
digi vachchina chaMdra kiraNamu ;____________________________aakASamu puTTillu ;;;;;gaganaM nuMDigaali taragala sOpaanaala mIdugaa ;oka vennela kiraNaM digi vachchi;nI charaNa nakhamulanu taakiMdi;paraavartanamu jEyiMchinakOTi kiraNa rEkhalanutana puTTiniMTikikaanukalugaa ichchiMdi.( పుట్టింటికి బహుమతి;puTTiMTiki bahumati; )
నయనాల నావలు ;
నీ నవ్వులలోని ; మిసిమినీ, నిగ్గునంతటినీ ;నా కనుల పడవలందెక్కించుకున్నాను;అనవరతము సాగేటి,నా ప్రణయ పయనాలు; గని (*1)ఈసు చెందరో,సుధలను గ్రోలిన;ఆ నాక వాసులు సురలైన కూడ!!?(*1) కని/ గని = చూచి, see&&&&&&&&&&&&&&&&&&&&&&nayanaala naavalu______________nI navvulalOni ;misiminii, niggunaMtaTinii ;naa kanula paDavalaMdekkiMchukunnaanu;anavaratamu saagETi, naa praNaya payanaalu;gani, Isu cheMdarO, aa sudhalanu grOlina;aa naaka vaasulu suralaina kUDa!!?
ఆహ్వానము పలుకు రంగుల కుంచెలు

ఇందీవరాక్షీ! రాకేందు బింబాననాఏ వేళనందైనభావనము నీదేను!సౌందర్య రాశీ! ఔదార్య భాషిణీ!ఈ వర్ణ తూలికలు ; ప్రణయనము సేయుట(*1) ;తమ విధిని ఎప్పుడూ, విసుక్కోవు(*2);సరి కదా!" ఇది ఎంతొ ఇంపైన కర్తవ్యమ"నుచునూప్రవరణము (*3) పలుకునునా ప్రణయ సామ్రాజ్ఞీ!&&&&&&&&&&&&&1 ప్రణయనము = రచన ;2. విసుగు కొనవు ;3. ప్రవరణము ఆహ్వానము పలుకుట
బ్రహ్మకు ముడి సరుకులు లభ్యమైనవి

ఉత్పల గంధీ! ;సౌందర్యానికి ముడి పదార్ధము దొరికినది ఇన్ని నాళ్ళకి;నీ రూపములోన, ఆ విరించికి ;ఇన్ని యుగాలుగాచతుర్ముఖుని నిఘంటువులోన ;చతుర్ముఖుని నిఘంటువులోన ;ఆలాగుననే ఖాళీగా ఉన్నవి పూరణమ్ములు(Dashes) ;అన్నింటికినీ అసలు పదార్ధము నేటికి దొరికెనుసరి! సరి! ;ఆలస్యము ఇంచుక సేయక ,కాల పురుషుడు ;పూరించెను ఆ నిరామయములను;సస్య శ్యామల భరితము సేయుచు,నీవె హేతువువు ఔతున్నావు మరీ మరీసిరి! సిరి! ఓహోహో!ఓ ముద్దుల గుమ్మా! ;++++++++++++++++++++++++++brahmaku muDi sarukulu labhyamainavi_____________________________________utpala gaMdhI! ;sauMdaryaaniki muDipadArdhamu dorikinadi inni nALLaki;nI rUpamulOna, aa viriMchiki ;inni yugaalugachaturmuKuni niGaMTuvulOna ;aalaagunanE unnavi,KALIgA pUraNammulu(#Dashes#) ;anniMTikinii asalu padaardhamu dorikenusari! sari! ;aalasyamu iMchuka sEyaka ,kaala purushuDu ;pUriMchenu aa niraamayamulanu;sasya SyAmala Baritamu sEyuchu,nIve hEtuvuvu,autunnaavu mari, mariisiri! siri!OhOhO! O muddula gummaa! ;+++++++++++++++++++++++++++++++++++
17, ఫిబ్రవరి 2011, గురువారం
జలదరింపు - నూత్న పదము
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
వారిదమ్ముల నుండి జారి పడుతున్నాయి ;
వర్ష బిందువులు”.
నారీ శిరోమణిరో! ;
అవి, నీదు దోసిట చేరి,
ఆణి ముత్యమ్ములై, అవతరిస్తూన్నాయి!
“ధన్యములు ఐతిమని” తలచుచూ,
హర్ష పులకాంకిత గాత్రులౌతూన్నాయి,
ఆ జల మౌక్తికములు!
ఆహా! నేటికి / నేడు“జలదరింపులు” అనెడు కొంగ్రొత్త మాటను,
పద నిఘంటువు నందు చేర్చినాయి;
&&&&&&&&&&&&&&&
vaaridammula nuMDi jaai paDutunnaayi ; varsha biMduvulu”.
naarI SirOmaNirO! ; avi, nIdu dOsiTa chEri,
ANimutyammulai, avataristUnnaayi!
"dhanyamulu aitimani” talachuchU,
harsha pulakaaMkita gaatrulau tUnnaayi,
jala mauktikamulu,
“jaladariMpulu” aneDu koMgrotta maaTanu,
pada niGaMTuvu naMdu chErchinaayi;
మీన నేత్రి - కను దోయి ప్రమిదలు
కంటి కను సన్నల ప్రమిదలలోన ;జ్యోతులుగా వెలుగులీనెడు;కమ్మని అవకాశము దొరికినదిగా మీకు;ఇక నేమి జంకు?!ఓ కలలార! ఉరికి రండి!ఇట..... ;నా ఎద తలపులెన్నెన్నొ ;ఒత్తులుగ మీ సేవలో భాగస్వాములవగా ;చేతులను కట్టుకుని, నిలిచి ఉన్నాయిఆ క్రీ నీడలందేసుంత గమనించండి,ఓ బంగారు సుస్వప్నమ్ములార!&&&&&&&&&&&&&&&&&&&&&&&machche kMTi kanu sannala pramidalalOna ;jyOtulugaa velugulIneDu;kammani avakASamu dorikinadigaa mIku;ika nEmi jaMku?!O kalalaara! uriki raMDi!iTa..... ;naa eda talapulennenno ;ottuluga maari,mI sEvalO Baagasvaamulavagaa ;chEtulanu kaTTukuni,nilichi unnaayi aa krI nIDalaMdEsuMta gamaniMchaMDi,O baMgaaru susvapnammulaara!
అను రాగ సీమా విహారులార!
ఈ ప్రేమైక భావనా నవ నందన వనిలోన,నిష్కల్మష ప్రణయ భావ చంద్రికలను తూస్కరించుఈలాగు, ఈలాటి కలుపు మొక్కలు ఏల?ఏరి వేయండి మమతాను రాగ సీమా విహారులార!,పెను ఓర్మి మీరుగా ఉప్పతిల్ల!$$$$$$$$$$$$$$$$$$$$$$I prEmaika BAvanaa nava naMdana vanilOna,nishkalmasha praNaya BAva chaMdrikalanu tUskariMchu ;iilaagu IlaaTi kalupu mokkalu Ela?Eri vEyaMDi mamataanu raaga sImaa vihaarulaara!,penu Ormi mIrugaa uppaatilla!
24, జనవరి 2011, సోమవారం
ఇంద్ర ధనుసు విహంగము
పాల సంద్రపు అలల నురుగులు;తటాలున అందులోన వాలిన(ట్టి)"హరి విల్లు పిట్ట లాగున"నా "హృదయ సాగర సామ్రాజ్యంలో ;అడుగిడినావు,ఓ తరుణీ! ;ఈ తరగలు,ఆటు పోటులను ఎరుగవు;అలుపు సొలుపులను ఎరుగవు;లలనా! విశాలంగా పరచుకున్న ;నీ పక్షముల ఈకల సందిటిలో;నా మానస అంబుధీ కెరటాల,తెలి నురుగులను ;కాస్తంతైనా - పుణికిపుచ్చుకోవమ్మా![ ఇంద్ర ధనుసు విహంగము ;______________ ]iMdra dhanusu vihaMgamu ;________________________paala saMdrapu ala nurugulu;taTAluna aMdulOna vaalina(TTi)"hari villu piTTala laaguna"naa "hRdaya saagara saamrAjyaMlO ;aDugiDinaavu,O taruNI! ;I taragalu,ATu pOTulanu erugavu;alupu solupulanu erugavu;lalanaa! viSAlaMgaa parachukunna ;nI pakshamula Ikala saMdiTilO;naa maanasa aMbudhii keraTAla,teli nurugulanu ;kaastaMtainaa - puNikipuchchukOvammaa!
వర వర్ణిని కర అంగుళులు
16, జనవరి 2011, ఆదివారం
నా భావాలు,చెలికి బానిసలు ;
మెరుపుల, వెన్నెలల Stage
13, జనవరి 2011, గురువారం
నా మది నర్తన శాల
జలజ లోచనీ! ;నా మనస్సు ;వలపు జావళీ పదములకు;నీ చిరు నగవే;రాగము, తానము, పల్లవిలు;నర్తన సేయుము ప్రియ సఖియా!నా మది నర్తన శాల కదా!అది- నీదు -ప్రేమ " భావ భవ వేద “ వేదితనాట్య హేలలకు అంకితము!నాదు -సుధా స్వప్నముల నైవేద్యములను ,రతీ దేవికి,మదన దేవునికిఅందించు వేదికయె! కనుగొనుమా !(వలపు జావళీ పదములు)Photo at : Devayani
10, జనవరి 2011, సోమవారం
స్వప్నాలకు పునర్జన్మలు
“వేకువ” లో “మెలకువ” ఉద్భవిస్తుంది! ;వనరుహ నయనీ!ప్రతి “రేయి”లోస్వప్నాలకు పునర్జన్మలు లభిస్తూనే ఉన్నవి :అప్పటిదాకా జోగుతూన్న నిద్రిత స్వప్నాలు ;నేత్రాలను విప్పార్చి ; కేరింతలాడ్తూంటాయి:నీ హేతువుల పుడమిలోజనిస్తూన్న కారణానఆ కలలన్నీ పావన చరితార్ధములే ఔతూన్నాయి కదా!ఆ తీపి కలలు అంటూన్నాయి కదా,తన నిత్య నూతనత్వాన్ని" ప్రేమ - మరల ప్రేమ లోనే సతతమూసంతరించుకుంటూనే ఉంటుంది;ఈ ఎడ తెగని పౌనః పున్యతనిరంతరంగా కొన సాగుతూనే ఉన్నప్పటికీ;ఏ మాత్రమున్నూ విసువు పుట్టించనిదార్శనిక అనుభూతియే కదా అది మరి!!ఔనా! చెలియా!
6, జనవరి 2011, గురువారం
మమతల శక్తికి అంచనా [ 6 ]
శశాంక శీతల కిరణాలు ;చలువ రాతి వేదికలనురజత సింహాసనంగా మార్చాయి ;మార్తాండ కాంతులునా నేత్రాలను ప్రమిదలుగా మలిచినవిప్రకృతిలోని - చిన్ని చిన్ని వస్తువులేఇంతటి శక్తిని కలిగి ఉన్నప్పుడు ;అత్యద్భుత ప్రేమ భావనలకు గల శక్తినిఅంచనా వేయ గలరా? ఎవరైనా?+++++++++++++++++++++++++++SaSAMka SItala kiraNAlu ;rajata siMhaasanaMgaa maarchaayi ;chaluva raati vEdikalanu ;maartaaMDa kAMti ,naa nEtraalanu ; pramidalugaa malichinavi ;prakRtilOni - chinni chinni vastuvulEiMtaTi Saktini kaligi unnappuDu ;atyadButa prEma BAvanalaku gala SaktiniaMchanaa vEya galaraa? evarainaa?++++++++++++++++++++++++++++
విశాలాక్షి వాలు చూపుల కతలు [5]
నాలోన నిరతమ్ము ;ఇందు బింబానన జ్ఞాపకముల కెరటాలు;ఆ తరంగాల తేలాడు సతతమ్ము ఆ మిల మిలలు ఏమిటో?!కాంతా మణి క్రీ గంటి చూపులు ఈ జలములందునకార్తీక దీపాలుగా వెలసెను;నీలాల నింగిలో తారకలు అగణితములు ;వెల తెలా బోతూన్న అంబరపు చుక్కల్లు ;నా భామ దృక్ కాంతులిట తేలాడ కనుగొనెను;నా హృదయ సరసులందునచెలి చూపు మిల మిలలు ఉన్నవనీ;కనుగొనిన కొక్కోటి చుక్కల్లుమీనాక్షి వీక్షణమ్ములజ్యోతులను‘బ్రతిమాలి, బామాలి ;తళుకులను చేబదులు తెచ్చుకున్నాయి;ఆ నాటి నుండి; నక్షత్ర రాసులు;అంబరమ్మందున స్థిర వాసులైనాయి;ఆ నాటి నుండి; అవిసౌందర్య సామ్రాజ్య శాసన కర్తలై ;మృదు హాసముల విలసిల్లుతునాయి;&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&ఇన్నిన్ని వింతలను కనుగొనెను చంద్రుడు;తారకా పతియై తాను దర్పమును కురిపించు;తారా శశాంకుడు , రాకా సుధా కరుడుఉదయించు ప్రతి పొద్దు;ఔను సుమా! నవ్యమౌ పొడుపు కథ!ఈ కథల ముడులను విప్పవోయి, ఓ మన్మధుడా!జాబిల్లి కడ-బేలగా, తెలబోయి చూసేను మదనుండు;అతనుడు;మరుని తెలి చూపులే....... ;కావ్య సరసుల తేలుచూ, విరిసేటి తెలి కువలయాలు (కలువలు);
ప్రణయ అర్చనా కావ్య మాలిక [ 4 ]
“అలుక మానుము!”అనుచు నిను వేడ బోను....వేకువకే “భాష్యాలు చెప్పే”నీ నేత్రాంచలాలోని ,పొల అలుకల మెలకువలకు“సహస్ర దళ నళినమ్ములే – దాసోహం!”అంటూన్న తరుణాలు,ఆ మధుర క్షణాల కువ కువలు!!నీ కినుకలు ఒసగిన కానుకలే గదా!కుముదవల్లీ!నీ సోగ చూపులు/ల ఎగజిమ్ము సెగలలో ;“ నా శోషణమ్ములు” ;నిర్వచన పదాళిగా మెలిపి, మలిచి,కొంగ్రొత్త కార్య భారమ్ములనునీ భుజముల పైన ఉంచుకొనుము,భామినీ! ;అది..."వలపు అర్చనా కావ్యమందున‘స్వర్ణాక్షర స్థగితమ్ముగా పూని,పూన్చిఒనరించుమో పూర్ణేందు బింబాననా!వలపు అర్చనా కావ్యమ్ములందున ;ఇదె ఆన!
సవా లక్ష గొంతెమ్మ కోర్కెలు [ 3 ]
యుగ యుగాలుగా ;తపసు చేసాను నేను! ;ముక్కోటి, కొక్కోటి వరముల పట్టిక(list)ను చే(త)దాల్చి!ముక్కోటి దేవతలు సాక్షాత్కరించారు!కానీ...సవా లక్ష గొంతెమ్మ కోర్కెలను ;వదలి వైచాను, జవ్వనీ!మనలో మన మాట!ఇక పైన నాకు ;అలవి మాలిన అభిలాషలను, కోర్కెలను ,ఏకరువు పెట్టేటి , అక్కరయె లేదు ;నీ చిన్ని చిరు నవ్వు , దొరికిందిలే! చెలీ!అది కదా అతి రహస్యం!!
5, జనవరి 2011, బుధవారం
సుభద్రమే సుదతి [ 2 ]

నా కంటి పాప –నిను , అనయమ్ము మోయుచుండును చెలీ!నే కను రెప్పలను మూసి, కునుకు తీసేటి వేళ ;నా నిదురమ్మ డోల – నినుశిశువుగా ఒడి చేర్చు కొనునులే! ;మారాము చేస్తూ, మరి ఉండనంటూ –నువు, ఊయెలను దిగి పోయి ;దోగాడి వెళితేను ;మోకాళ్ళు, సేతులు, ఒళ్ళు ;గీసుకుని, బాధించు గాయములు ఔననుచు ;నాకు అంతు లేనంత భీతి ఆయేను ;అందుకే, నా రాణి! ;నా కలల పువు రేకులను నింపి,ఇంతిపరిచాను దారంట ఒత్తుగా మెత్తగా!నీ గమనమ్ము ఎప్పుడూసుభద్రమే సుదతి!తెలుసుకొనుమా!
అనురాగ భావనలకు గల శక్తిని అంచనా వేయ గలరా?

శశాంక శీతల కిరణాలురజత సింహాసనంగా మార్చాయిచలువ రాతి వేదికలనుమార్తాండ కాంతినా నేత్రాలనుప్రమిదలుగా మలిచిందిప్రకృతిలోని,చిన్ని చిన్ని వస్తువులేఇంతటి శక్తిని కలిగి ఉన్నప్పుడుఅత్యద్భుత ప్రేమ భావనలకు గలశక్తిని అంచనా వేయ గలరా? ఎవరైనా?+++++++++++++++++++++++
SaSAMka SItala kiraNAlu ;rajata siMhaasanaMgaa maarchaayi ;chaluva raati vEdikalanu ;maartaaMDa kAMti ,naa nEtraalanu ;pramidalugaa malichiMdi ;prakRtilOni,chinni chinni vastuvulEiMtaTi Saktini kaligi unnappuDu ;atyadButa prEma BAvanalaku gala SaktiniaMchanaa vEya galaraa? evarainaa?+++++++++++++++++++++++++++
30, డిసెంబర్ 2010, గురువారం
అను నిముషము శుభ శకునమ్మే
మాట వినని మనస్సు
తనలోన Doubt
ప్రమోదానంద అద్వైతము
ఆ కొండ కోనలలొ ; కానలలొ,ఎండలలొ, వానలలొ ;గల గలల జలపాత ఉరుకులు ;వాగులూ వంకలూ నదులుజిలిబిలీ కిరణాల(కు) ఒడులు ;సతతమ్ము పఠియించువెలుగు పాఠాలనురవి చంద్ర బింబములు ;ప్రణయినీ సౌందర్య కాంతి ప్రతిస్ఫలనలనునిరతాధ్యయన శీలురైనాదు నయనమ్ములు!నాదు నేత్రద్వయినేడు,ప్రమదా వనములందునప్రమోదా స్నానములు సేయుచూఅద్వైతమై ~~~~~~~ఇట్టె లీనమాయేను తనలోన ఔర!!ఔర! ఔరా!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)





