21, ఫిబ్రవరి 2011, సోమవారం

బ్రహ్మకు ముడి సరుకులు లభ్యమైనవి
















ఉత్పల గంధీ! ;
సౌందర్యానికి ముడి పదార్ధము దొరికినది ఇన్ని నాళ్ళకి;
నీ రూపములోన, ఆ విరించికి ;
ఇన్ని యుగాలుగా
చతుర్ముఖుని నిఘంటువులోన ;
చతుర్ముఖుని నిఘంటువులోన ;
ఆలాగుననే ఖాళీగా ఉన్నవి పూరణమ్ములు(Dashes) ;
అన్నింటికినీ అసలు పదార్ధము నేటికి దొరికెను
సరి! సరి! ;
ఆలస్యము ఇంచుక సేయక ,
కాల పురుషుడు ;
పూరించెను ఆ నిరామయములను;
సస్య శ్యామల భరితము సేయుచు,
నీవె హేతువువు ఔతున్నావు మరీ మరీ
సిరి! సిరి! ఓహోహో!ఓ ముద్దుల గుమ్మా! ;

++++++++++++++++++++++++++



























brahmaku muDi sarukulu labhyamainavi
_____________________________________

utpala gaMdhI! ;
sauMdaryaaniki muDi
padArdhamu dorikinadi inni nALLaki;
nI rUpamulOna, aa viriMchiki ;
inni yugaaluga
chaturmuKuni niGaMTuvulOna ;
aalaagunanE unnavi,
KALIgA pUraNammulu(#Dashes#) ;
anniMTikinii asalu padaardhamu dorikenu
sari! sari! ;
aalasyamu iMchuka sEyaka ,
kaala purushuDu ;
pUriMchenu aa niraamayamulanu;
sasya SyAmala Baritamu sEyuchu,
nIve hEtuvuvu,
autunnaavu mari, marii
siri! siri!
OhOhO! O muddula gummaa! ;

+++++++++++++++++++++++++++++++++++

17, ఫిబ్రవరి 2011, గురువారం

జలదరింపు - నూత్న పదము

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

వారిదమ్ముల నుండి జారి పడుతున్నాయి ;

వర్ష బిందువులు”.

నారీ శిరోమణిరో! ;

అవి, నీదు దోసిట చేరి,

ఆణి ముత్యమ్ములై, అవతరిస్తూన్నాయి!

“ధన్యములు ఐతిమని” తలచుచూ,

హర్ష పులకాంకిత గాత్రులౌతూన్నాయి,

జల మౌక్తికములు!
ఆహా! నేటికి / నేడు

“జలదరింపులు” అనెడు కొంగ్రొత్త మాటను,

పద నిఘంటువు నందు చేర్చినాయి;

&&&&&&&&&&&&&&&

vaaridammula nuMDi jaai paDutunnaayi ; varsha biMduvulu”.

naarI SirOmaNirO! ; avi, nIdu dOsiTa chEri,

ANimutyammulai, avataristUnnaayi!

"dhanyamulu aitimani” talachuchU,

harsha pulakaaMkita gaatrulau tUnnaayi,

jala mauktikamulu,

“jaladariMpulu” aneDu koMgrotta maaTanu,

pada niGaMTuvu naMdu chErchinaayi;

మీన నేత్రి - కను దోయి ప్రమిదలు


















కంటి కను సన్నల ప్రమిదలలోన ;
జ్యోతులుగా వెలుగులీనెడు;
కమ్మని అవకాశము దొరికినదిగా మీకు;
ఇక నేమి జంకు?!
ఓ కలలార! ఉరికి రండి!
ఇట..... ;
నా ఎద తలపులెన్నెన్నొ ;
ఒత్తులుగ మీ సేవలో భాగస్వాములవగా ;
చేతులను కట్టుకుని, నిలిచి ఉన్నాయి
ఆ క్రీ నీడలందే
సుంత గమనించండి,
ఓ బంగారు సుస్వప్నమ్ములార!

&&&&&&&&&&&&&&&&&&&&&&&





























machche kMTi kanu sannala pramidalalOna ;
jyOtulugaa velugulIneDu;
kammani avakASamu dorikinadigaa mIku;
ika nEmi jaMku?!
O kalalaara! uriki raMDi!
iTa..... ;
naa eda talapulennenno ;
ottuluga maari,
mI sEvalO Baagasvaamulavagaa ;
chEtulanu kaTTukuni,
nilichi unnaayi aa krI nIDalaMdE
suMta gamaniMchaMDi,
O baMgaaru susvapnammulaara!

అను రాగ సీమా విహారులార!



















ఈ ప్రేమైక భావనా నవ నందన వనిలోన,
నిష్కల్మష ప్రణయ భావ చంద్రికలను తూస్కరించు
ఈలాగు, ఈలాటి కలుపు మొక్కలు ఏల?
ఏరి వేయండి మమతాను రాగ సీమా విహారులార!,
పెను ఓర్మి మీరుగా ఉప్పతిల్ల!

$$$$$$$$$$$$$$$$$$$$$$

I prEmaika BAvanaa nava naMdana vanilOna,
nishkalmasha praNaya BAva chaMdrikalanu tUskariMchu ;
iilaagu IlaaTi kalupu mokkalu Ela?
Eri vEyaMDi mamataanu raaga sImaa vihaarulaara!,
penu Ormi mIrugaa uppaatilla!

24, జనవరి 2011, సోమవారం

ఇంద్ర ధనుసు విహంగము


















పాల సంద్రపు అలల నురుగులు;
తటాలున అందులోన వాలిన(ట్టి)
"హరి విల్లు పిట్ట లాగున"
నా "హృదయ సాగర సామ్రాజ్యంలో ;
అడుగిడినావు,

ఓ తరుణీ! ;
ఈ తరగలు,
ఆటు పోటులను ఎరుగవు;
అలుపు సొలుపులను ఎరుగవు;
లలనా! విశాలంగా పరచుకున్న ;
నీ పక్షముల ఈకల సందిటిలో;
నా మానస అంబుధీ కెరటాల,
తెలి నురుగులను ;
కాస్తంతైనా - పుణికిపుచ్చుకోవమ్మా!

[ ఇంద్ర ధనుసు విహంగము ;
______________ ]






















iMdra dhanusu vihaMgamu ;
________________________

paala saMdrapu ala nurugulu;
taTAluna aMdulOna vaalina(TTi)
"hari villu piTTala laaguna"
naa "hRdaya saagara saamrAjyaMlO ;
aDugiDinaavu,

O taruNI! ;
I taragalu,
ATu pOTulanu erugavu;
alupu solupulanu erugavu;
lalanaa! viSAlaMgaa parachukunna ;
nI pakshamula Ikala saMdiTilO;
naa maanasa aMbudhii keraTAla,
teli nurugulanu ;
kaastaMtainaa - puNikipuchchukOvammaa!

వర వర్ణిని కర అంగుళులు
















కొబ్బరాకుల గుండా
జారుతూన్న వెన్నెలలు; ;
ఉర్వీ తలము పైన
ఆ చక్కని చిక్కని నీడలు;

ఆకులు,
నీ చివురంటి లేత వ్రేళ్ళల్లే
ఉన్నాయని-
నారికేళ తరువునకు
కడు మోదము కలిగేను,
కనుగొనుమా!
వర వర్ణినీ!

&&&&&&&&&&&&&&&&&

16, జనవరి 2011, ఆదివారం

నా భావాలు,చెలికి బానిసలు ;













నా భావాలు,చెలికి బానిసలు
చెలి కడ " చిత్తం" అనడమే
నా భావాల పని!

ఇంతి చిత్తమెరిగినట్టి ;
లోకజ్ఞతా ప్రజ్ఞ వానిదే సుమీ!వానిదే!
బహు ప్రేమ భావాల పందిరిలొ
కల్లోల మానసమ్ములార!
స్వస్థతను పొందండి!

మెరుపుల, వెన్నెలల Stage























నా స్వర్ణ స్వప్నాలు నాట్యాలు చేసేను;
నా కలల నటనలు
శత కోటి సౌదామినులకు
ఆలవాలము ఆయె!
అనవరత నాట్యాలు సాగేటి సీమలకు
నిర్వచన పట్టికలు మీరే కద!!

వెన్నెలల వేదికలారా!/ ర!
మదీయ తరుణి తలపుల కథా కళి –
ఇచట సాగుతూ ఉండును
పులకాంకురమ్ముల తనివి తీరగ
మీరు తరియించుడీ! ;

13, జనవరి 2011, గురువారం

నా మది నర్తన శాల


జలజ లోచనీ! ;
నా మనస్సు ;
వలపు జావళీ పదములకు;
నీ చిరు నగవే;
రాగము, తానము, పల్లవిలు;
నర్తన సేయుము ప్రియ సఖియా!
నా మది నర్తన శాల కదా!
అది- నీదు -
ప్రేమ " భావ భవ వేద “ వేదిత
నాట్య హేలలకు అంకితము!
నాదు -
సుధా స్వప్నముల నైవేద్యములను ,
రతీ దేవికి,మదన దేవునికి
అందించు వేదికయె! కనుగొనుమా !

(వలపు జావళీ పదములు)

Photo at : Devayani

10, జనవరి 2011, సోమవారం

స్వప్నాలకు పునర్జన్మలు


























“వేకువ” లో “మెలకువ” ఉద్భవిస్తుంది! ;
వనరుహ నయనీ!
ప్రతి “రేయి”లో
స్వప్నాలకు పునర్జన్మలు లభిస్తూనే ఉన్నవి :
అప్పటిదాకా జోగుతూన్న నిద్రిత స్వప్నాలు ;
నేత్రాలను విప్పార్చి ; కేరింతలాడ్తూంటాయి:
నీ హేతువుల పుడమిలో
జనిస్తూన్న కారణాన
ఆ కలలన్నీ పావన చరితార్ధములే ఔతూన్నాయి కదా!
ఆ తీపి కలలు అంటూన్నాయి కదా,
తన నిత్య నూతనత్వాన్ని
" ప్రేమ - మరల ప్రేమ లోనే సతతమూ
సంతరించుకుంటూనే ఉంటుంది;
ఈ ఎడ తెగని పౌనః పున్యత
నిరంతరంగా కొన సాగుతూనే ఉన్నప్పటికీ;
ఏ మాత్రమున్నూ విసువు పుట్టించని
దార్శనిక అనుభూతియే కదా అది మరి!!
ఔనా! చెలియా!

6, జనవరి 2011, గురువారం

మమతల శక్తికి అంచనా [ 6 ]


శశాంక శీతల కిరణాలు ;
చలువ రాతి వేదికలను
రజత సింహాసనంగా మార్చాయి ;
మార్తాండ కాంతులు
నా నేత్రాల
ను ప్రమిదలుగా మలిచినవి

ప్రకృతిలోని - చిన్ని చిన్ని వస్తువులే
ఇంతటి శక్తిని కలిగి ఉన్నప్పుడు ;
అత్యద్భుత ప్రేమ భావనలకు గల శక్తిని
అంచనా వేయ గలరా? ఎవరైనా?

+++++++++++++++++++++++++++

SaSAMka SItala kiraNAlu ;
rajata siMhaasanaMgaa maarchaayi ;
chaluva raati vEdikalanu ;
maartaaMDa kAMti ,
naa nEtraalanu ; pramidalugaa malichinavi ;
prakRtilOni - chinni chinni vastuvulE
iMtaTi Saktini kaligi unnappuDu ;
atyadButa prEma BAvanalaku gala Saktini
aMchanaa vEya galaraa? evarainaa?

++++++++++++++++++++++++++++

విశాలాక్షి వాలు చూపుల కతలు [5]































నాలోన నిరతమ్ము ;
ఇందు బింబానన జ్ఞాపకముల కెరటాలు;
ఆ తరంగాల తేలాడు సతతమ్ము ఆ మిల మిలలు ఏమిటో?!

కాంతా మణి క్రీ గంటి చూపులు ఈ జలములందున
కార్తీక దీపాలుగా వెలసెను;

నీలాల నింగిలో తారకలు అగణితములు ;
వెల తెలా బోతూన్న అంబరపు చుక్కల్లు ;
నా భామ దృక్ కాంతులిట తేలాడ కనుగొనెను;

నా హృదయ సరసులందున
చెలి చూపు మిల మిలలు ఉన్నవనీ;
కనుగొనిన కొక్కోటి చుక్కల్లు
మీనాక్షి వీక్షణమ్ముల
జ్యోతులను
‘బ్రతిమాలి, బామాలి ;
తళుకులను చేబదులు తెచ్చుకున్నాయి;

ఆ నాటి నుండి; నక్షత్ర రాసులు;
అంబరమ్మందున స్థిర వాసులైనాయి;
ఆ నాటి నుండి; అవి
సౌందర్య సామ్రాజ్య శాసన కర్తలై ;
మృదు హాసముల విలసిల్లుతునాయి;

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


























ఇన్నిన్ని వింతలను కనుగొనెను చంద్రుడు;
తారకా పతియై తాను దర్పమును కురిపించు;
తారా శశాంకుడు , రాకా సుధా కరుడు
ఉదయించు ప్రతి పొద్దు;
ఔను సుమా! నవ్యమౌ పొడుపు కథ!
ఈ కథల ముడులను విప్పవోయి, ఓ మన్మధుడా!
జాబిల్లి కడ-
బేలగా, తెలబోయి చూసేను మదనుండు;అతనుడు;

మరుని తెలి చూపులే....... ;
కావ్య సరసుల తేలుచూ, విరిసేటి తెలి కువలయాలు (కలువలు);

ప్రణయ అర్చనా కావ్య మాలిక [ 4 ]








“అలుక మానుము!”
అనుచు నిను వేడ బోను....
వేకువకే “భాష్యాలు చెప్పే”
నీ నేత్రాంచలాలోని ,
పొల అలుకల మెలకువలకు
“సహస్ర దళ నళినమ్ములే – దాసోహం!”
అంటూన్న తరుణాలు,

ఆ మధుర క్షణాల కువ కువలు!!
నీ కినుకలు ఒసగిన కానుకలే గదా!










కుముదవల్లీ!
నీ సోగ చూపులు/ల ఎగ
జిమ్ము సెగలలో ;
“ నా శోషణమ్ములు” ;
నిర్వచన పదాళిగా మెలిపి, మలిచి,
కొంగ్రొత్త కార్య భారమ్ముల
ను
నీ భుజముల పైన ఉంచుకొనుము,
భామినీ! ;
అది...
"వలపు అర్చనా కావ్యమందున
‘స్వర్ణాక్షర స్థగితమ్ముగా పూని,పూన్చి
ఒనరించుమో పూర్ణేందు బింబాననా!
వలపు అర్చనా కావ్యమ్ములందున ;
ఇదె ఆన!

సవా లక్ష గొంతెమ్మ కోర్కెలు [ 3 ]























యుగ యుగాలుగా ;
తపసు చేసాను నేను! ;
ముక్కోటి, కొక్కోటి వరముల పట్టిక(list)ను చే(త)దాల్చి!
ముక్కోటి దేవతలు సాక్షాత్కరించారు!

కానీ...
సవా లక్ష గొంతెమ్మ కోర్కెలను ;
వదలి వైచాను, జవ్వనీ!

మనలో మన మాట!
ఇక పైన నాకు ;
అలవి మాలిన అభిలాషలను, కోర్కెలను ,
ఏకరువు పెట్టేటి , అక్కరయె లేదు ;
నీ చిన్ని చిరు నవ్వు , దొరికిందిలే! చెలీ!
అది కదా అతి రహస్యం!!

5, జనవరి 2011, బుధవారం

సుభద్రమే సుదతి [ 2 ]






















నా కంటి పాప –
నిను , అనయమ్ము మోయుచుండును చెలీ!
నే కను రెప్పలను మూసి, కునుకు తీసేటి వేళ ;
నా నిదురమ్మ డోల – నిను
శిశువుగా ఒడి చేర్చు కొనునులే! ;

మారాము చేస్తూ, మరి ఉండనంటూ –
నువు, ఊయెలను దిగి పోయి ;
దోగాడి వెళితేను ;
మోకాళ్ళు, సేతులు, ఒళ్ళు ;
గీసుకుని, బాధించు గాయములు ఔననుచు ;
నాకు అంతు లేనంత భీతి ఆయేను ;

అందుకే, నా రాణి! ;
నా కలల పువు రేకులను నింపి,ఇంతి
పరిచాను దారంట ఒత్తుగా మెత్తగా!
నీ గమనమ్ము ఎప్పుడూ
సుభద్రమే సుదతి!తెలుసుకొనుమా!

అనురాగ భావనలకు గల శక్తిని అంచనా వేయ గలరా?













శశాంక శీతల కిరణాలు
రజత సింహాసనంగా మార్చాయి
చలువ రాతి వేదికలను
మార్తాండ కాంతి
నా నేత్రాలను
ప్రమిదలుగా మలిచింది
ప్రకృతిలోని,
చిన్ని చిన్ని వస్తువులే
ఇంతటి శక్తిని కలిగి ఉన్నప్పుడు
అత్యద్భుత ప్రేమ భావనలకు గల
శక్తిని అంచనా వేయ గలరా? ఎవరైనా?

+++++++++++++++++++++++
SaSAMka SItala kiraNAlu ;
rajata siMhaasanaMgaa maarchaayi ;
chaluva raati vEdikalanu ;
maartaaMDa kAMti ,
naa nEtraalanu ;
pramidalugaa malichiMdi ;
prakRtilOni,
chinni chinni vastuvulE
iMtaTi Saktini kaligi unnappuDu ;
atyadButa prEma BAvanalaku gala Saktini
aMchanaa vEya galaraa? evarainaa?

+++++++++++++++++++++++++++

30, డిసెంబర్ 2010, గురువారం

అను నిముషము శుభ శకునమ్మే



























అనురాగ లోకాల, నా ప్రణయిని
"అడుగిడిన వేళలకు" సుస్వాగతం!
విరబూయు (ఆ )తరుణాలు అవి - చూడగా ;
కిన్నెరల గానాల కొసగినట్టి
శుభ శకునాలు సుమ్మీ!

ఆ వన్నె తరుణాలకెపుడు
కవి కులములు
ఋణ పడి ఉండును,
ఇది సత్యము!!!!!!!

మాట వినని మనస్సు










ప్రేయసీ!
నీ కదలికలు కలువలై
నా కనుల సరసులలొ
విరబూయుచున్నవి;
నా మనసు అట నుండి
సుతరాము మరల నేరదు చెలీ!
నేరమిది - అని ఎంచి
ఏ తీరుగా నన్ను
శిక్షించ దలిచేవొ?
ఒప్పుకొందును చెలీ!
ఏదైననూ.......
అది నాకు ఆమోదమే!
ఆనంద కందళిత హృదయ ఆస్వాద యోగ్యమే.

తనలోన Doubt


















ప్రేమ, మమతల శుక శాబకమ్ములు ప్రియా!
ఈ ఎద గూటిలోన
ఇసుమంత విసువైన లేకుండ
నిరతమూ కూజితమ్ము లిడుచున్నవో ప్రియా!

అనురాగమీలాగున
జన మనమ్ముల
సంచారములు సేయుచూ ఉండుటది ~~~~~
అలరించుటా?
లేక - అలమటిల్లగ జేయుటా??

ప్రమోదానంద అద్వైతము




















ఆ కొండ కోనలలొ ; కానలలొ,
ఎండలలొ, వానలలొ ;
గల గలల జలపాత ఉరుకులు ;
వాగులూ వంకలూ నదులు
జిలిబిలీ కిరణాల(కు) ఒడులు ;

సతతమ్ము పఠియించు
వెలుగు పాఠాలను
రవి చంద్ర బింబములు ;

ప్రణయినీ సౌందర్య కాంతి ప్రతిస్ఫలనలను
నిరతాధ్యయన శీలురై
నాదు నయనమ్ములు!

నాదు నేత్రద్వయి
నేడు,
ప్రమదా వనములందున
ప్రమోదా స్నానములు సేయుచూ
అద్వైతమై ~~~~~~~
ఇట్టె లీనమాయేను తనలోన ఔర!!
ఔర! ఔరా!