నా ప్రియ భామ
నడయాడు ప్రతి జాడ
ఆనంద సీమలకు
ఎత్తి పట్టిన గొడుగు ;
ఋతు రాణి చేసేను పర్యవేక్షణలు
“కొలను/ సరసును విడిచి
అన్ని తామరలు ధరణి పయి
నిట్లుఎటుల మొలిచేనని?”
అచ్చెరువు నందినది నారి!“
అవి నీ అడుగు జాడలె! చెలియ!
పుడమి ఇపుడుపద్మాకరమ్మాయె!
అంతె సుమ్మీ!”
**********************
తెలుగు మాటలపై మమకారం ; కొన్ని కవిత్వాలు,వ్యాసాలు,జోక్సు, కంప్యూటరు తెరపైన వేసిన బొమ్మలు,పెయింటింగ్సు....... వగైరా,వగైరా.....
28, నవంబర్ 2010, ఆదివారం
భూమి నేడు సరసు ఆయెను
26, నవంబర్ 2010, శుక్రవారం
ఈ జీవితం నీకే సొంతం

ఒక్క సారిగా ఎగురుతూన్నకలల విహంగాలతోనా నిద్రా విను వీధి క్రిక్కిరిసి పోయిందికిల కిలా రావాల సందడిలోఏవేవో ఊసులు వెల్లువెత్తుతున్నాయితారకల మిల మిలల మధ్యనింగి నుంచి నేలకుసుతి మెత్తగా జారుతూన్నపొగ మంచుల తెలి వలపు తెరలుఅందాలకు నెలవులైకను విందు చేస్తూన్నాయిప్రేయసీ!నీ క్రీ గంటి చుపుల కులాలయంలో చిక్కుకున్ననా హృదయమొక బంగారు పిచ్చుకఅందుకేదరహాసినీ!ఈ జీవితం నీకే సొంతం.*****************************published -ఆంధ్ర భూమి, monthlyApril 2008
24, నవంబర్ 2010, బుధవారం
వింటికి నారి
21, డిసెంబర్ 2009, సోమవారం
తిరుప్పుల్లాని - దర్భశయనము
12, జూన్ 2009, శుక్రవారం
గణిత సూత్రాలు
సంప్రదాయానుసారంగా,
ఆ పత్రికా సంపాదకుడు
నేను రాసిన పత్రం మరో నలుగురికి పంపి
వాళ్ళ అభిప్రాయాలు అడిగి,
ఆ అభిప్రాయాలు సేకరించి నాకు తిరిగి పంపి,
నా పత్రాన్ని తదనుగుణంగా సవరించి పంపమన్నాడు.
అందులో మూడు అభిప్రాయాలు,
"ఈ పరిశోధనా పత్రం బాగానే ఉంది. ప్రచురణార్హమే!" అని వచ్చేయి.
నాలుగోది మాత్రం నన్ను ఏకెస్తూ వచ్చింది.
నా గురువుగారు నాలుగూ చదివి,
"మొదటి మూడూ మనకి పనికిరానివి, అవి పక్కన పెట్టెయ్;
ఆ నాలుగోది ఘాటుగా ఉందని ఉడుక్కోకు, అదే మనకి ఉపయోగపడుతుంది.
ఆ నాలుగో అభిప్రాయం చదివి
అందులో ఉన్న ఆక్షేపణలన్నిటిని మనస్పూర్తిగా స్వీకరించి,
నా పత్రాన్ని మరమ్మత్తు చెయ్యమని "చెప్పి, నాతో అన్నారు:
"మన పనిని ఆ క్షేపించినవాడే
మన అసలు స్నేహితుడు. ఇది జ్ఞాపకం పెట్టుకో!"
అన్నారు.
(చదవండి!
http://lolakam.blogspot.com/2009_04_01_archive.html )
7, మే 2009, గురువారం
ప్రణవ నాద మహిమ
కీర్తనలు నెల కొనాలి!
మననము చేయుము,ప్రణవ నాదమును
23, ఏప్రిల్ 2009, గురువారం
వయోజన విద్య
తేనీలు
22, ఏప్రిల్ 2009, బుధవారం
నందమూరు (ఉంగుటూరు)
విశ్వనాథ సత్యనారాయణ తెలుగు వారికి గర్వ కారణమైన పండితుడు;చిత్రంగా అనేక విమర్శలకు, ప్రశంసలను పొందిన మహా కవి. గాంధీజి ఉద్బోధించిన "సహాయ నిరాకరణోద్యమము"లో పాల్గొని ,తన ఉద్యోగాన్ని వదులుకున్న "మాతృ దేశ స్వాతంత్ర్యాభిలాషి ఈయన"అని చాలా మందికి తెలియదు. ఈయన తల్లి దండ్రులు పార్వతమ్మ, శోభనాద్రి. కృష్ణా జిల్లా నందమూరులో ( అనగా నేటి ఉంగుటూరు మండలము ) ,1895లో సెప్టెంబరు 10వ తేదీన (మన్మథ నామ సంవత్సరములో, భాద్రపద బహుళ షష్టి రోజు) శ్రీ విశ్వనాథ సత్యనారాయణ జన్మించారు. తండ్రి శోభానాద్రి భక్తాగ్ర గణ్యుడు. సాధారణముగా ,తల్లి దండ్రులు 'తమ పిల్లలలోని పండిత్య ,లలిత కళాది ,విజ్ఞాన అంశాదులలో గల ప్రజ్ఞను వారి బాల్యములోనే గుర్తించ లేరు కానీ శోభనాద్రి, తన కుమరుడు 'భవిష్యత్తులో మంచి పాండిత్యమును ఆర్జిస్తాడని" గుర్తించారు. . కనుకనే " తన పుత్రుడు వ్రాయ బోవు వ్రాయ బోవు మహా కావ్య కృతిని ఈశ్వరునికే అంకితము చేసెను." శోభనాద్రి భవిష్యత్తును అవగాహన చేసుకోగల మహా ద్రష్ట " అని ఈ సంఘటన వలన తేట తెల్లమగుచున్నది. శ్రీ మద్రామాయణ కల్ప వృక్షమును " తన తండ్రి కోరిక ననుసరించి" ,"నీహార రుక్ శ్రీ మంతంబయి పొల్చు, మహా తేజో మూర్తి యగు విశ్వేశ్వరునకే " అంకితము చేసెను. శోభనాద్రి కర్మ యోగి ఐన పరమ భక్త శిఖా మణి. నందమూరులో పరమేశుని నిలిపి, నిష్కామముగా గడిపిన ధన్యుడు , మహోన్నత జీవన పథగామి శోభనాద్రి . |
Views (27) |
నాయని జలతరంగిణి
నాయని సుబ్బారావు గారు హైదరాబాద్లో ఒక ఇంట్లో అద్దెకి ఉన్నారు. ఆ ఇంటి యజమానురాలి పేరు "దమయంతి ప్రతి రోజు మాదిరిగానే రోజూ, మున్సిపాలిటీ పంపు ద్వారా నీళ్ళు వచ్చినప్పుడే, అందరూ నీళ్ళను పట్టుకో వాల్సి వచ్చేది. యధా ప్రకారం బిందెలతో, కడవలతో అక్కడి పోర్షన్లలో నివసించే వాళ్ళు జల యజ్ఞ సాధన కొరకై వచ్చి ఉన్నారు. ఎవరి వంతు వచ్చినప్పుడు వాళ్ళు మంచి నీళ్ళు పట్టు కుంటున్నారు. ఇంతలో నెమ్మదిగా owner దమయంతి వస్తూంటే, అందరూ ఆమెను పలకరించారు. నాయని అన్నారిలాగ, చమత్కారంగా "నల్లా మహారాజు కోసరం దమయంతి వస్తున్నారు." పంపు, కొళాయి, కుళాయి, నల్లా ఇత్యాది పర్యాయ పదాలలో, ఆ జల వాహకమును తెలంగాణా జిల్లాలలో "నల్లా"అని అంటారు.
|
Baala
నిధి
ఓమ్ నమః శివాయ! అచ్చులతో అద్దకాలు సరిగంచులు నేసి మేము ఇస్తాము చదువన్నది 'నిధి మూట' గైకొనరా ఓరన్నా! 1)మంచె పైన రైతన్న ! పలక పట్టుకున్నాన్న వడిసెల ఒక చేత బలపం ఒక చేత వడి వడిగా విద్యలన్ని నేర్చి తీరుతానంటూ ప్రతిన పట్టి,తన ఒట్టుకు "శ్రీ కారం"చుట్టాడు// 2)అజ్ఞానం తిమిరాలను తూర్పార బట్టాడు తప్పొప్పుల తప్ప తాలు గాలి కెగిరి పోతాయి ఉల్లాసం నింగి కెగయ విజ్ఞానం ధాన్య రాశి గొని పోవును ఇంటికి // |
Pramukhula Haasyam
మాటలకు పిసినారి
మధునాపంతుల సత్యనారాయణ ఆంధ్ర సాహిత్య రంగములో ఎనలేని కృషి చేసిన వ్యక్తి. తెలుగు సారస్వత సేవ ఆయనకు గుర్తింపునుతెచ్చింది. 1993 మార్చ్ 5వతేదీన ఆంధ్ర దేశ రాజధాని "భాగ్య నగరము"లో ఆయన సంస్మరణ సభ జరిగినది. చిక్కడ పల్లి లైబ్రరీలో ఆ రోజు జరిగిన "శ్రీ మధునాపంతుల సంస్మరణ సభ"లో మధునా పంతుల రచనల విన్నాణము గురించి వక్తల ఉపన్యాసాలు కొనసాగుతున్నాయి. డాక్టర్ సి.నారాయణ రెడ్డి ఇలా అన్నారు "మధునాపంతులుగారు పదాల దగ్గర పరమ లోభి. ఆయన రాసిన పద్యాలలోనుండి, ఈ మాటని ఇక్కడ అనవసరంగా వేసారుఅంటూ తీసి వేయడానికి, ఏరి వేద్దామంటే ఏ ఒక్క పదము కూడా డాక్టర్ సి.నారాయణ రెడ్డి ఇలా అన్నారు "మధునాపంతులుగారు పదాల దగ్గర పరమ లోభి. ఆయన రాసిన పద్యాలలోనుండి, ఈ మాటని ఇక్కడ అనవసరంగా వేసారుఅంటూ తీసి వేయడానికి, ఏరి వేద్దామంటే ఏ ఒక్క పదము కూడా దొరకదు". " |
పాపిటిబిళ్ళలు
ఘుమ్మని భువి గుబాళించె.// మెరుపు దార హారాలు దేవ కన్యకల చేతుల పొరపాటున జారినవో?! వర్ష బిందు రత్న మణులు జల జల జల రాలిన విటు.// గడ్డి పూల తలల పైన పాపిటి బిళ్ళలు ఐనవి బుల్లి వర్ష బిందువులు. గంతులేస్తు, చిందులేస్తు పిల్లలు ఫక్కున నవ్విరి. |
టపా(ట) కాయలు
వేటూరి సుందర రామ్మూర్తి సినీ రంగంలో "పాటల రచయిత"గా కాలూని, లబ్ధ ప్రతిష్ఠులు అయ్యారు. గీత రచయితగా అనేక అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా వేటూరికి రా సాగాయి. "మనసు కవి"గా సుప్రసిద్ధులు ఐన ఆత్రేయ గారికి అవకాశాలు సన్నగిల్లాయి. ''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''' దీపావళి పండుగ వస్తూన్నది. అంతటా హడావుడి సందడిగా ఉన్నది. మార్కెట్టులో ఆ ఇద్దరు ఒకరికొకరు ఎదురయ్యారు. పరస్పరమూ పలకరించుకున్నారు.ఆత్రేయ కావలసిన బాణసంచా కొనేసి, నిండు సంచీతో ఇంటిముఖం పట్టారు. "టపా కాయలు కొనేసారా?" స్నేహ పూర్వకముగా అడిగారు వేటూరి సుందర రామ్మూర్తి. "నా 'పాట కాయ'లన్నీ మీకే వస్తున్నాయి గదా! అందుకే ఊరికే ఖాళీగా ఉండట మెందుకు లెమ్మని, ఇదిగోండి!ఇలాగ 'టపా కాయలు' తెస్తున్నాను." అన్నారు ఆత్రేయ స్నేహ పూర్వకంగానే , సంభాషణలలోనూ పదముల అలికిడిని కలిగిస్తూ . |
Views (6) | Post Your Commen |
వందనమిదే!
నిలిచిన తొలకరుల మబ్బులకు అభివాదము! అభివాదము! // పాడేటి పికములకు చివురులను ఒసగిన మామిడి తరువులకు,//అభి// పాడి పంటల అలరారేటి పల్లెల తొణికేటి మమత లన్నిటికిని //అభి// మా పల్లె జనములకు చదువులను ప్రేమతో నేర్పేటి గురువులకు అభివాదము! అభివాదము // |
కొత్త అంజనం
పల్లవి: వేణు వినోదం మృదు భావ విహారం |
1) ఈలల గీతం
ఈ లలనల హాసము
సుమధుర శబ్దములాయినవి
సంగీతమునకు చిరు నామాలు
కోరస్:
ఇల్లూ వాకిలి,పల్లె పట్ణములు
రేవులు,వనములు,కోవెలలు
కళల వలయముల హరివిల్లులయేను
2)గళముల సౌరుగ జానపదాలు,
ప్రతి అడుగు జాడలును
చిందిన సొగసుల పల్లె పదాలను
3)ఇందిందివియే ఇవియే
అరువది నాలుగు కళలకు నెలవులు
Baala
పెళ్ళిపెద్ద
(answer)::: ఘీంకరిస్తూ అడవికి పోతా! (ప్రశ్న) ::: అడవికి పోయి అటేమి చేస్తావ్? ( answer )::: పద్మావతినీ భయ పెడతాను శ్రీనివాసులుతొ దోస్తీ కట్టి సాష్టాంగం!దండ ప్రణామం! అమ్మకు,అయ్యకు కళ్యాణం అంగ రంగ వైభోగంగా జరిపించేస్తా! నా వీపు పైన అంబారి కట్టి వధూ వరులను కూర్చుండ బెట్టి ఊరేగిస్తా ముల్లోకములు. |
