21, మే 2011, శనివారం

కలల తోరణాలు






















 ఉప్పాట ఆడే పిల్లలలాగా;
 చిన్న చిన్న భావాలను ;                                           గుప్పిళ్ళతో  జమురుకొంటున్నాను; 
రాగాలను పిడికిళ్ళతో పొదువుకొంటున్నాను;
స్వప్నాలను దోసిళ్ళతో పట్టుకుంటున్నాను;  
నా అంగుళులకు పెనవేసుకున్న స్వప్నాలన్నీ;
ప్రణయ సామ్రాజ్య సింహద్వారానికి;
సౌదామినీ   తోరణాలు దేవీ! 
&&&&&&&&&&&&&&&&& 
uppaaTa ADE pillalalaagaa;
mRdu suma daLa BAvaalanu
guppiLLatO  jamurukoMTunnaanu;
raagaalanu
piDikiLLatO poduvukoMTunnaanu;
swapnaalanu dOsiLLatO
paTTukuMTunnaanu;
naa aMguLulaku
penavEsukunna swapnaalannI;
praNaya saamraajya siMhadvaaraaniki;
saudaaminI   tOraNAlu dEvI!
 
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

8, మే 2011, ఆదివారం

వెండ్రుకలతో కొలతలు























       మన్మథుడు- 
తిమిర సీమల వైశాల్యాన్ని -
కొలవ అశక్తుడు ఐనాడు;
యుక్తిగా......
నీ నీలి కురులను -

కొలబద్దలుగా గైకొన్నాడు; -

మదన కార్యము- 

విజయవంతమైనది! -


భర్త అడుగుజాడలలోనే నడిచింది రతీ దేవి!-

ఆవలి గట్టున ఉన్నాడు తన నాధుడు!-

ఈవలి తీరం నుండి-

చెలియా!-

నీ క్రీగంటి చూపుల నావను -
                        
         గైకొన్నది-
అవతలి ఒడ్డుకు -
సునాయాసంగా చేరుతుంది ఆమె!

సంశయ మింక లేదు.

     
           వెండ్రుకలతో కొలతలు

@@@@@@@@@@@@@@@@@
       

veMDrukalatO kolatalu;


manmathuDu timira siimala vaiSAlyaannikolava aSaktuDu ainaaDu;yuktigaa......nI nIli kurulanu kolabaddalugaa gaikonnaaDu; bharta aDugu jaaDalalOnE naDichiMdi ratI dEvi!aavali gaTTuna unnaaDu tana naadhuDu!Ivali tIraM nuMDi,cheliyaa!nI krIgaMTi chUpula naavanu gaikonnadi,avatali oDDukusunaayaasaMgaa chErutuMdi aame!saMSaya miMka lEdu.
@@@@@@@@@@@@@@@@@

17, ఏప్రిల్ 2011, ఆదివారం

నిరంతర కృతజ్ఞతాంజలి


నీ కాటుక కన్నుల సీమలలో; నే వెన్నెలనై పచరించుదును;నా ఊహల కలువల కానుకలు ; విరబూసే చోటిది, ఓ పడతీ!ఈ భాగ్యము నీ వర దానము కాక ; వేరెన్నటికీ కానె కాదు;అందుకె జవ్వని! ఈ దాసుడు నీకొసగును కై మోడ్పులును,సదా సదా. 

                   (ఇది నిరంతర కృతజ్ఞతాంజలి )  

           &&&&&&&&&&&&&&&&&&

nI kaaTuka kannula siimalalO; nE vennelanai pachariMchudunu;naa Uhala kaluvala kaanukalu ; virabUsE chOTidi, O paDatI!I BAgyamu nI vara daanamu kaaka ; vErennaTikI kaanE kaadu;aMduke javvani! I daasuDu nIkosagunukai mODpulanu,sadaa sadaa.

idi niraMtara kRtaj~nataaMjali   ;;;;;

28, మార్చి 2011, సోమవారం

మన్మథుని ప్రాణాయామములు





















;;;;;;;;
సతమతమౌతున్నాడదే!
సీమంతిని!కలభాషిణి!
నీదు, కనుబొమ్మల;
ఒదిగి పోయి, మన్మథుడు;
;;;;;;;;;
ప్రాణయామములు
నియమము తప్పకను;
మన్మధుడు వంగి,
చేయు ఆసనములు;
యోగి ఆయె నోహో!
తానచటనే వసియింపగ!

@@@@@@@@@@@@






satamatamautunnaaDadE!
sImaMtini!kalaBAshiNi!
nIdu, kanubommala;
odigipOyi, manmathuDu;
;;;;;;;;
praaNayaamamulu
niyamamu tappakanu;
manmadhuDu vaMgi,
chEyu aasanamulu;
yOgi aaye nOhO!
taanachaTanE vasiyiMpaga!
(manmadhuni praaNaayaamamulu )

@@@@@@@@@@@@@@@@@@@

కోమలి సొగసులు



















;;;;;;;;
అబ్బలాలొ! నీ కురులు;
మబ్బులను మరిపించెను ||

ఒప్పుగ మరువం, దవనం ;
ముప్పేటల పరిమళాలు;
తిప్పిన జడ పాయలవీ;
గుప్పుగ కురిసే వానల;
చూపించుము ఎక్కడనో? ||

ఏమరక విరబూసే:
తామర పుష్పాల సౌరు;
కోమలి వదనారవింద
మునకు సాటి రానెరాదులే!
దిగ దుడుపు ఖచ్చితమే! ||

@@@@@@@@@@@@@@

abbalaalo! nii kurulu;
mabbulanu maripiMchenu ||

oppuga maruvaM, davanaM ;
muppETala parimaLAlu;
tippina jaDa paayalavI;
guppuga kurisE vaanala;
chUpiMchumu ekkaDanO? ||

Emaraka virabUsE:
taamara pushpaala sauru;
kOmali vadanaaraviMda
munaku saaTi raanerAdulE! ;
diga duDupu KachchitamE! ||

|||||||||||||||||||||||||||||||||||||||||


Eye brows భృకుటి
















నయనమ్ముల పైన అదియె!
నీలాల హరి విల్లు!
కసురుకునీ, విసురుకుని
తూస్కరించు చున్నావు ||
;;;;;;
మదనుడు వంగిన యోగిగ;
సదమలమౌ కనుబొమ్మల;
కుదురుగ తానొదిగిపోయె;
నీ - గదమాయింపుల భృకుటిని! ||

నీ - కను బొమ్మల చిరు ముడి
కనక సింహాసనమే!
ప్రణయ దేవి కూర్చున్న
పట్టమహిషియే పొలతీ! ||

{{{{{{{{{{{{{{}}}}}}}}}}}}}}}}}}}}}

జడ పాయల సౌరభాలు ;



















;;;;;
అబ్బలాలొ! నీ కురులు;
మబ్బులను మరిపించెను ||

ఒప్పుగ మరువం, దవనం ;
ముప్పేటల పరిమళాలు;
తిప్పిన జడ పాయలవీ;
కుప్పలుగా కురిసే వానల
ఎక్కడున్నవీ చూపు? ||

ఏమరక విరబూసే:
తామర పుష్పాల సౌరు;
కోమలి వదనారవింద
మునకు సాటి రాదు కదా!
దిగ దుడుపు ఖచ్చితమే! ||

6, మార్చి 2011, ఆదివారం

ప్రభాత రేఖలు - మేఘ జడకుచ్చులు























తొలి ప్రభాత సువర్ణ రేఖా ధారలన్నిటినీ;
ఓర్పుతో తీర్చి దువ్వి, దిద్ది,
ప్రజ్ఞతో జడ కుచ్చులుగ ;
చేసినది నాదు చెలియ;
ఓహోహో! మేఘమా! ; రావమ్మ!
పసిడి పువు రేకుల చుట్టుకొను వేడుక
చేసుకుందువుగాని,
ఎలమి నా కుందనపు బొమ్మ భుజముపైన;
"పల్లకిలో పెళ్ళి కూతురు వోలె
విలసిల్లు విలాసములన్ని నీవేలే!

&&&&&&&&&&&&&&&&&&&&

praBAta kaaMti rEKalu - mEGamunaku jaDakuchchulu
_________________________________________












toli praBAta suvarNa rEKA dhaaralanniTinii;
OrputO tIrchi duvvi, diddi,
praj~natO jaDa kuchchuluga ;
chEsinadi naadu cheliya;
OhOhO! mEGamaa! ; raavamma!
pasiDi puvu rEkula chuTTukonu vEDuka
chEsukuMduvugaani,
elami naa kuMdanapu bomma Bujamupaina;
"pallakilO peLLi kUturu vOle
vilasillu vilaasamulanni nIvElE!

చురుకు దనముల మిళాయించిన తులిపి దనములు













వేణువుపై నాట్యమాడేను;
ఆమె చివురు వ్రేళులు;
"ఆటల వేళ ఐనది" అనుకొని,
చిలిపి గాలి బాలలు ;
లోన దూరి, రాగాల
స్నానాల,
అనురాగాల ఈదులాటల ;
క్రీడించుచున్నారు;
ఎంచ తరమా?
వారి చురుకు దనముల
మిళాయించిన తులిపి దనముల విలువలను,

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
&&&&










churuku danamula miLaayiMchina tul
ipi danamulu
_____________________________________
vENuvupai naaTyamADEnu;
aame chivuru vrELulu;
"aaTala vELa ainadi" anukoni,
chilipi gaali bAlalu ;
lOna dUri, raagaala snaanaala,
anuraagaala IdulaaTala ;
krIDiMchuchunnaaru;
eMcha taramaa?
vaari churuku danamula
miLaayiMchina tulipi danamula viluvalanu .

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

మృదు వేణు గానములు, గాలికి గిలిగింతలు


ఒక మురళిని చేకొని ;
గిరి - శిఖరాగ్రమును చేరి;
ఒక పెను శిలపై జేరగిలి;
మ్రోగించు చున్నది, చెలి;
మృదు వేణు గానములా
అవి?
గాలికి పెట్టుచున్న
పెట్టెడు ( Box); గిలిగింతలు గాని;

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

mRdu vENu gaanamulu, gaaliki giligiMtalu
__________________________________











oka muraLini chEkoni ;
giri - SiKaraagramunu chEri;
oka penu Silapai jEragili;
mrOgiMchu chunnadi, cheli;
mRdu vENu gaanamulaa avi?,
gaaliki peTTuchunna ;
peTTeDu (# Box#); giligiMtalu gaani;

( see Link ; NIce ART )

4, మార్చి 2011, శుక్రవారం

ఢమరు ధ్వనికి టీచర్లు










మేఘాల గూళ్ళలో (కులాలయములలో) ;
మెరుపుల పక్షి కూనలు;
ఆ శాబకములు, కువ కువ లాడుతాయేమో! -
అనుకున్నాను;కానీ, అదేమిటో గానీ .........
డమ డమా మార్మ్రోగుతున్నాయి ;
పరమేశుని ఢమరు ధ్వనికి ,
ఈ అంబర ధ్వనులు,
పరమ గురువులు కాబోలును, క్రిష్ణ వేణీ!

27, ఫిబ్రవరి 2011, ఆదివారం

బొమ్మ, బొరుసు, ఆశా ఇరుసు























మధు మాధుర్యాలను దూసి పోసిన
కిన్నెరల ఆలాపనా గానాలు;
దివి నుండి జారి వచ్చి;
సుతారంగా దూరి పోయి
నీదు కొంగు బంగారముగా మారి పోయాయి
కోమలీ! కాస్త దయ ఉంచి ;
నీ చెంగు ముడి విప్పవా?
“ పొడుపు కథ నీ నవ్వు “-
కాస్త కరుణించి ,ముడి విప్పవా?

పసిడి నాణెమ్ము అందుంది ;
ఇటు జారి ;
నా హృదయమ్ము పై పడెను;
“ బొమ్మ” పడితేను నాదు భాగ్యమ్ము;
నీ చరణ పద్మాల “ పద్మ రేఖను ఔతాను నేను”
అటు గాక ;
“ బొరుసు ” గా పడితేను;
నిను గూర్చినట్టి భావనా చక్రాల శిథిలాలలోన;
కూరుకు పోయినట్టి ‘
“ఆశా ఇరుసునే ఔతాను తథ్యమిది ,సుమ్మీ!!

&&&&&&&&&&&&&&&&&&&&&











bomma, borusu, aaSaa irusu
______________________

madhu maadhuryaalanu dUsi pOsina
kinnerala aalaapanaa gaanaalu;
divi nuMDi jaari vachchi;
sutaaraMgaa dUri pOyi;
nIdu koMgu baMgaaramugaa mAri pOyaayi.
kOmalI! kaasta daya uMchi ;
nI cheMgu muDi vippavaa?
“ poDupu katha nI navvu “-
kaasta karuNiMchi ,muDi vippavaa?

pasiDi naaNemmu aMduMdi ; iTu jaari ;
naa hRdayammu pai paDenu;
“ bomma” paDitEnu ; naadu Baagyammu;
nI charaNa padmaala “ padma rEKanu autaanu nEnu”
aTu gaaka ; “ borusu ” gaa paDitEnu;
ninu gUrchinaTTi BAvanaa chakraala SithilaalalOna;
kUruku pOyinaTTi ‘
“ASA irusunE autaanu tathyamidi, summI!

&&&&&&&&&&&&&&

వెర్రి మాలోకము














స్వప్న పుష్పాల నుండి రాలుతూన్న;
పుప్పొడి రేణువుల జలపాతాల ఉఱవడిలో;
నిరంతర స్నానాల క్రీడాభిషిక్తుడనౌ;
భాగ్య శాలిని కదా! నేను- :

“ఆహా! వెఱ్ఱివాడు వీడనుచూ” ;
వీడక నను గేలి సేయు
ఈ ప్రపంచపు చూపులకు;
నా స్వప్న స్వర్గ లోకపు ద్వార బంధపు
నగిషీ మెరుపులలోని
అతి స్వల్ప శకలమైనా దొరుకునా?
అపరంజి రంజిత అందలములో నెలకొనిన;

విస్తృత భావ కిరణ ద్యుతి వలయపు;
చుట్టు కొలత ఎంతో ;
ఆ లోక దృక్కులకు ఊహలైనా అందదు కదా!
మరి ఈ లోకము
ఒక మాలోకము - అను మాట
సత్యమే కదా! మిత్రమా!
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

























Verri maalOkamu
-----------------------

svapna pushpaala nuMDi raalutUnna;
puppoDi rENuvula jalapaataala u~ravaDilO;
niraMtara snaanaala krIDABishiktuDanau;
BAgya SAlini kadA! nEnu- :
“AhA! ve~r~rivaaDu vIDanuchU” ;
vIDaka nanu gEli sEyu
I prapaMchapu chUpulaku;
naa svapna svarga lOkapu dvaara baMdhapu
nagishI merupulalOni
ati svalpa Sakalamainaa dorukunaa?
aparaMji raMjita aMdalamulO nelakonina;
vistRta BAva kiraNa dyuti valayapu;
chuTTu kolata eMtO ;
aa lOka dRkkulaku
Uhalainaa aMdadu kadaa!
mari I lOkamu
oka maalOkamu - anu maaTa
satyamE kadaa! mitramaa!

$$$$$$$$$$$$$$$$$$$$$$$

24, ఫిబ్రవరి 2011, గురువారం

రంగుల తడి
















నీ నవ్వులనూ, నీ కన్నులనూ
నీ లాలిత్యాన్నీ, నీ నిర్లక్ష్యాన్నీ
అలవోకగా చిత్రించిన
ఈ కుంచెలకు అంటి ఉన్న "రంగుల తడి" ఎన్నటికీ ఆరదు;
తర తరాలకూ
సహృదయుల వ్రేళ్ళకు చేరి,
మణుల వోలె ఆ వర్ణాలు,
అంగుళీ హేమ హారాలలో
ఈ వన్నెల తూలికల రమ్య హేలలు
అరమరికగా ఉంటూనే ఉంటూన్నాయి, ఇందు బింబాననా!
సదా, సర్వదా
ఈ చిత్ర రచనా హంస తూలికల విన్నాణపు తానాలు -
"ప్రేమ తత్వము"లోని 'అపురూపతా దనమున 'కు
సర్వ కాల నిదర్శనలు, సర్వజ్ఞత్వపు భాష్యములు

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$



















nI navvulanU, nii kannulanU\
nI laalityaannI\ , nI nirlakshyaannI\
alavOkagA chitriMchina
I kuMchelaku aMTi unna
"raMgula taDi" ennaTikI aaradu\
tara taraalakU\ sahRdayula vrELLaku chEri\
maNula vOle aa varNaalu, aMguLI hEma haaraalalO
I vannela tUlikala ramya hElalu
aramarikagaa uMTUnE uMTuunnaayi,
iMdu biMbaananaa!
sadaa, sarvadaa -
I chitra rachanaa haMsa tUlikala
vinnaaNapu taanaalu -
"prEma tatvamu"lOni 'apurUpataa danamuna 'ku \
sarva kaala nidarSanalu,
sarvaj~natvapu BAshyamulu

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

21, ఫిబ్రవరి 2011, సోమవారం

నా కదలిక విరి తోట సుమా!














నా గొంతుకలో ;
నాకు "నేను"గా పలికే పలుకులు లేవు;
నా పలుకులలో ,
"నేను" "నేను"గా కనబడను;
బహిర్ సత్యమే కదా !

నా గళములోన; విరిసేనవి;
నెలత లాస నవ మల్లెలు;
నా "ప్రతి కదలిక" ;
మంద గమన నడయాడే
విరి తోట సుమా!

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$




















naa goMtukalO ;
naaku "nEnu"gaa palikE pa
lukulu lEvu;
naa palukulalO ,
"nEnu" "nEnu"gaa kanabaDanu;
bahir satyamE kadaa!
naa gaLamulOna; virisEnavi;
nelata laasa nava mallelu;
naa "prati kadalika" ;
maMda gamana naDayADE
viri tOTa sumA!

పుట్టింటికి బహుమతి దిగి వచ్చిన చంద్ర కిరణము



















ఆకాశము పుట్టిల్లు ::
గగనం నుండి
గాలి తరగల సోపానాల మీదుగా ;
ఒక వెన్నెల కిరణం దిగి వచ్చి;
నీ చరణ నఖములను తాకింది;
పరావర్తనము జేయించిన
కోటి కిరణ రేఖలను
తన పుట్టినింటికి
కానుకలుగా ఇచ్చింది.

$$$$$$$$$$$$$$$$$$$$$$$


puTTiMTiki bahumati -
digi vachchina chaMdra kiraNamu ;
____________________________

aakASamu puTTillu ;;;;;
gaganaM nuMDi
gaali taragala sOpaanaala mIdugaa ;
oka vennela kiraNaM digi vachchi;
nI charaNa nakhamulanu taakiMdi;
paraavartanamu jEyiMchina
kOTi kiraNa rEkhalanu
tana puTTiniMTiki
kaanukalugaa ichchiMdi.

( పుట్టింటికి బహుమతి;
puTTiMTiki bahumati; )