పాట కవిత లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పాట కవిత లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, అక్టోబర్ 2016, సోమవారం

బిందు బాలల క్రీడలు

అంబరం ఘనమైనది ;  
తరు పత్రము జారు క్రీడలను ; 
అంబరము నేర్పుతుంది 
హిమ తుషారమ్ములకు ; 
;
ఈ బిందు బాలల ఆటలు ; 
కడు నేత్ర పర్వమ్ములు కదా   
                    మన మానవులకు!  
;
@@@@@@@@@@@@@
;
కవిత - 4   ;
;
@@@@@@@@@@@@@@@@@

అరుణోదయ దృశ్య తేజస్సు

కొండకొమ్ము పైన 
దేవాలయము;
;
పర్వత శిఖర దేవళము ; 
ఇలాతలమునకు మణిమకుటమ్ము! ; 
;
ప్రాక్ దిశార్ణవ ప్రభాత ప్రభల 
           వర్ణ రంజితం ; 
ఆ గిరి కోవెలకు రత్న కిరీటం!

;
@@@@@@@@@@@@@
;
కవిత - 3  ;
;
@@@@@@@@@@@@@@@@@

Blue sky ఘనతలు

నీలాంబర ఘనతలు ; -
నీలాంబరి రాగములను ; 
పూబాలల కొరకు కూర్చుతోన్నది, 
           విశ్వ జనని మన నీలాంబరమ్ము! 
;
మనసారా మనమంతా పొగడుదము!
పృధ్వీ సౌమ్యతను  ; 
పచ్చని పైరుల తివాచీలను ; 
పరచి ఇచ్చెడి ప్రజ్ఞామయి తను కనుక!
ఈ పుడమి సౌజన్యతను కీర్తించుదాము!

@@@@@@@@@@@@@
;
కవిత - 2 
;
@@@@@@@@@@@@@@@@@
 

18, మే 2016, బుధవారం

నేడు వింత జరిగెను!

తటాకమ్ముల చిరు తరగలు ; 
తటాలున  నేర్చినవి ; 
ఆటపాట లెన్నెన్నో! 
ఎటుల, ఎటుల? తెలుపండీ!
 ఇటుల - 
           ~  నేడు వింత జరిగెను!    ||  
;
తరంగములు మృదురాగిణి
 + లయ్యినవీ ఓహోహో!  
తరగ తంత్రు పయిన 
గాలి మృదు స్పర్శలు పాటలయీ - 
హొయలు లొలకబోసేను! 
           ~  నేడు వింత జరిగెను!    ||  
;
తరగమడత తారళ్యత ; 
వెన్నెలను పిలిచేను ; 
తీరమ్ముల సైకతముల
అనురాగపు చలనమ్ములు -  
లక్ష హంస తూలికలై ; 
నవ చిత్రమ్ములను తీర్చి వేసెను! ||
;
ప్రకృతిలో - అణువు అణువు ; 
ప్రణయ పాన్పు ఆయెను! 
           ~  నేడు వింత జరిగెను!    || 
;
చిలుక వాహనుడు మదనుడు ; 
శుకము వీడి తురగమెక్కె! 
'ఛల్ ఛల్!' అంటూ : 
బాగ హల్ చల్ చేస్తుండెను! 
           ~  నేడు వింత జరిగెను!    ||  
;
నవ్య ప్రేమజంటలకు ; 
మోహనమౌ మోహ-రంగమందున ; 
కదన రంగమును ఏర్పరచెను అతనుడు;
           ~  నేడు వింత జరిగెను!    || 
;
సమ్మోహనకరముగాను గుంభనముగ నవ్వేను 
పతి నగవుల పారిజాత సుమములన్ని
కూర్చి దండలల్లి
తన గళమున ధరియించీ
అల్లిబిల్లి మేల్మి ఆటలాడేను;
           ~  నేడు వింత జరిగెను!    || 

****************************\****,

11, నవంబర్ 2015, బుధవారం

వేయి కన్నులు సరిపోవునా !?

రేయి పొలమునందున
పైరు పంట బాగున్నది ||
జాలమేల? రావోయీ !
చందమామా! ||
చుక్క పూత, పువ్వులు;
మిల మిలల ఆటలు; 
చూడ వేయి కన్నులు
సరిపోవునా!? ||  || 
చుక్కల్ల కళకళలతొ 
            - నీదు ఆటలు;  
చూడ వేయి కన్నులు
సరిపోవునా!? ||       

===================, 

reyi polamunamduna ; 
pairu pamta baagunnadi; 
jaalamela raawoyi chamdamaamaa! || 

chamdamaamaa! chamdamaamaa! ||

chukka puuta, puwwulu;
mimila milala aaTalu;
chUDa wEyi kannulu
saripOwunaa!? ||  

chukkalla kaLakaLalato niidu aaTalu;
chUDa wEyi kannulu
saripOwunaa!? || 

***********************;
Wishing everyone 
a whole lot of love, light and happiness Diwali! 

Happy Diwali !