హై'కూనలు' లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
హై'కూనలు' లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, జులై 2016, గురువారం

సౌలభ్యత

అద్దమునకేల 
       అంత దర్పమ్ము? 
నా రాణి బింబాన్ని ; 
      తనలోన హత్తుకొనె! - 
;
అందుకే  
       ఆ గీర, 
ఇంతింత అని 
చెప్పరానంతటి గర్వమున్నూ! 
;
;  [కవిత - 2 ]
================, 
;
addamunakEla 
    amta darpammu? 
naa raaNi bimbaanni ; 
        tanalOna hattukone! - 
amdukE  
     aa geera,
 imtimta ani 
chepparaanamtaTi 
 garwamunnuu! 
;
;[kawita - 1] 
************************,
;
కవిత - 2  :-
             సౌలభ్యత ;- 
;
విరహవేదనలందు త్రెళ్ళుమనుచు ; 
కాలమ్ము శాసించె! 
ఎడబాటు కూడ ఒక మేలుకే! 
భగ్న ప్రేమా భావములను నింపిన ; 
బంగారు చషకముగ; 
నా హృదిని మార్చినది! 
అందుకే, 
ఇదిగో చెబుతున్నా!
విరహము, 
    ఎడబాటు ఇత్యాది కూడ ; 
సౌలభ్యవంతములె, 
             ప్రేమికునికి!
 ;
=================;
;kawita -2 :- 
             saulabhyata ;- 
wirahawEdanalamdu treLLumanuchu ; 
kaalammu SAsimche! 
eDabATu kUDa oka mElukE! 
bhagna prEmaa 
bhaawamulanu nimpina ; 
bamgaaru chashakamuga; 
naa hRdini maarchinadi! 
amdukE, idigO chebutunnA!
wirahamu, 
eDabATu ityaadi kUDa ; 
saulabhya wamtamule, 
                     prEmikuniki!
;

=================;

ముఖబింబం

అద్దమున చూచింది నా చెలియ ;
ముడిచింది మోమును బహు కినుకతో;
కలికి వేరొకతె
తనకు పోటీగ వచ్చెనని తలచి!
;
- [ అమరశిల్పిజక్కన -
       నిలువుమా! నిలువుమా! నీలవేణీ! .....  }
;
; - {తనకు పోటీ}
========================,
;
addamuna chuucimdi naa cheliya ;
mOmu muDichimdi kinukatO;
kaliki wErokate
tanaku pOTIga wachchenani talachi!
;
- [ amaraSilpijakkana -
      niluwumA! niluwumA! }
;
*****************************,
; [mukhabimbam ; ముఖబింబం ]

భారం! భారం!

1} హఠయోగం;:-
ఆకాశం ఆతప పత్రం; 
ఇలాతలం పాదపీఠం; 
సూర్యప్రభల శఠగోపం; 
ఆకలిదీ హఠయోగం; 
ఆవలితీరం కానరానిది 
;
- [ఆకలిదీ హఠయోగం; ]
;
***********************,

2} కీర్తిభారం :- 
;
నెమలికి - పింఛం ; 
;        భారం! భారం! ; 
ఉడుతకు 
   భారీ కుచ్చుల తోక ;
;                భారం! భారం! ; 
మృగరాజు వదనమున 
                గుత్తంపు జూలు ;
;                         భారం! భారం! ; 
కరిరాజు తొండం ; 
;            భారం! భారం! ; 
పురుషునికి రమణి ; 
;          భారం! భారం! ; 
ఐనప్పటికీ .............
      ఆ బరువు శోబిల్లు 
      బహు సుందరముగా! 
;
కీర్తికాంత కూడ ; 
         అటువంటిదే! 
భారమని ఎంచక ; 
          మోయడానికి 
బహు హుషారు కలిగిఉంటుంది 
                  మానవజాతి!! 
;
 ===============;
;
aakaaSam aatapa patram; 
ilaatalam paadapITham; 
suuryaprabhala SaTha gOpam ; 
aakalidii haThayOgam; 
aawaliteeram kaanaraanidi 
;
************ 
;
2} keertibhaaram :- 
nemaliki pimCam ; 
BAram! BAram! ; 
uDutaku BArii kuchchula tOka ; 
BAram! BAram!  ; 
mRgaraaju wadanamuna guttampu juulu ; 
BAram! BAram!  ; 
kariraaju tomDam ; 
BAram! BAram!  ; 
;
purushuniki ramaNi ; 
BAram! BAram! ; 
ainappaTikii aa baruwu 
SObillu bahu sumdaramugaa! 
keertikaamta kuuDa ; 
aTuwamTidE! ..............
BAramani emchaka ; 
mOyaDAniki 
bahu hushaaru kaligiumTumdi 
maanawajaati!!

30, మే 2016, సోమవారం

తేనీలు / నానీలు

1] స్విమ్మింగ్ ఫూల్ / 
ఈత కొలను :-
పోటా పోటీలుగా 
ఈత పోటీల భామినులు; 
మీనాక్షుల ఈదులాటలతొ ; 
నిండుగ "కొలను - ఆక్వేరియం "
;
[ శీర్షిక :- తేనీలు ] 
;
౨౦౧౬   ౨౦౧౬   ౨౦౧౬ ౨౦౧౬   ౨౦౧౬ 

2] వెన్నెల పువ్వు పూసింది
చేత పట్టుకునికులుకుతూ 
వ్యాహ్యాళి చేస్తూన్నది
పున్నమి మహరాణి! 
;
౨౦౧౬   ౨౦౧౬   ౨౦౧౬ ౨౦౧౬   ౨౦౧౬ 
;
3] ఏటి అలలపైన; వెన్నెల సింహాసనం; 
విను వీధుల విహరిస్తూ వచ్చిన ;
నీలి నిశీధి అధివసించింది!
;
"రేపటి ఉషస్సులు
తన నేస్తములే కదా!"
అనుచు ఆహ్వానం పలికింది నిశీధి!
;
=================================;
;
1] # swimmimg phuul / iitala pOTIlu :-
pOTA pOTIlugA 
iita pOTIlu ; bhaaminulu; 
meenaakshula IdulaaTalato ; 
nimDuga kolanu aakwEriyam - 
;
[ SIrshika :- tEnIlu / నానీలు (small poems)]

;౨౦౧౬   ౨౦౧౬   ౨౦౧౬ ౨౦౧౬   ౨౦౧౬ 
tEnIlu  / ; [తేనీలు] :-
;
wennela puwwu puusimdi
chEta paTTukuni
kulukutuu wyaahyaaLi chEstuunnadi
punnami raaNi!
punnami maharaaNi!
;
౨౦౧౬   ౨౦౧౬   ౨౦౧౬ ౨౦౧౬   ౨౦౧౬ 
;
3] ‪‎ETi‬ alalapaina; wennela simhaasanam; 
winu weedhula wiharistuu wachchina ;
niili niSIdhi;
adhiwasimchimdi!
;
"rEpaTi ushassulu
tana nEstamulE kadaa!"
anuchu aahwaanam palikimdi niSIdhi!
;
*******************************
;
;తెలుగురత్నమాలిక ;- 5447 = 158 posts, last published ; May 29, 2016
;~ December 31, 2015 ; post ; 

19, మే 2016, గురువారం

సంపంగి కలశం

పరిమళాలకు కలశం 
          'సంపంగి పూవు' ;

కల్లోలిత ఋతువులారా!
    ఈ సంపంగి తావులను
         శిరసు మీద చల్లుకోండి!
  స్థిత ప్రజ్ఞతను, శాంతమ్మును 
              కానుకలుగ గైకొనండి! 
;
************************************,
;
నా డెందంలో జలపాతం నువ్వు ;
    నీ నవ్వులలో పువ్వునయీ జారిపోతూ 
;
************************************,
;
ఆనందబాష్పాల వన్నెలను 
అద్దుకున్నదినాదు మనసు! 
నిరంతరమూ - 
కొంగ్రొత్త చిత్తరువుల కలిమి 
ఈ మనసుకు సొంతం.
;
************************************,
;
ఊహలకు రెక్కలు తొడిగాడు మదనుడు;
వియత్తలాన-
ఊసులన్నీ చేస్తూన్న  విహారములను
వీక్షిస్తూ, మన్మధుడు నిశ్చేష్ఠుడౌతూ
తానే మరొక చిత్రం ఐనాడు!! తరుణీ!
;
===================================,
;
 parimaLAlaku kalaSam 
       'sampamgi puuwu' ;

kallOlita RtuwulaarA!
      ii sampamgi taawulanu
Sirasu meeda challukOMDi!
     sthita praj~natanu, Saamtammunu 
               kaanukaluga gaikonamDi! 
;
************************************,
;
] naa DemdamlO jalapaatam nuwwu ;
    nee nawwulalO puwwunayii jaaripOtuu 
;
************************************,
;
] aanamdabaashpaala wannelanu 
addukunnadinaadu manasu! 
niramtaramuu - 
komgrotta chittaruwula kalimi tana somtam.
;
************************************,
;
] uuhalaku rekkalu toDigADu madanuDu;
wiyattalaana-
uusulannii chEstuunna  wihaaramulanu
weekshistuu, manmadhuDu niSchEshThuDautuu
taanE maroka chitram ainADu!! taruNI!
;
************************************,
;

6, మే 2016, శుక్రవారం

నలుపు కూడా అందమే!

అద్దమ రేతిరిలోన ; 
పున్నమి జాబిలి అద్దం;
రేయి చూచుకుంటూన్నది తన అందం,
మిసిమి నలుపు సైతమూ
అందంలో భాగమే ఓ నేస్తం!
;
****************************,
;
తారామణిదీపాలు వెలుగులీనెను 
మబ్బు చెరగులను పట్టి;
సుతారముగ వీచు గాలి
నిశిరేయిని 
తొంగి చూచి కిసుక్కున నవ్వేను 
;
*****************************,
;
అగణిత భావాల శిల్పములు
నిలుపుచున్న రేయంతా;
ఋతురాణి ఎత్తిపట్టినట్టి కాగడా! 
ఎద ఎదలో అపూర్వమౌ "ఆది అజంతా"!
;
**************************** 
; by ;- ; [సుధాక్షీరం ]

# ===========================;
ఆది అజంతా ;-
addama rEtirilOna ;
punnami jaabili addam;
rEyi chuuchukumTUnnadi tana amdam,
misimi nalupu saitamuu
amdamlO BAgamE O nEstam!
;
****************************,
taaraamaNideepaalu weluguleenenu 
mabbu cheragulanu paTTi;
sutaaramuga weechu gaali
niSirEyini 
tomgi chuuchi kisukkuna nawwEnu 
*****************************,
agaNita bhaawaala Silpamulu
nilupuchunna rEyamtaa;
RturaaNi ettipaTTinaTTi kaagaDA! 
eda edalO apuurwamau "aadi ajamtaa"!
;
****************************
; + by ; - [sudhaaksheeram ; upa, taranga ]

**********************************; 
ఆది అజంతా ;-

15, అక్టోబర్ 2014, బుధవారం

మేఘమల్హార రాగాలు (హై'కూనలు'/ haiku)

శభాష్!
డొక్కశుద్ధి ఉన్న మేఘాలు, 
వల్లిస్తూన్నవి మెరుపుల పద్యాలు,  
అప్పగిస్తూన్నవి పృధ్వీ గురువుకు, 
వర్షధారల వేదమంత్రాలు;
పాడుతూన్నవి మేఘమల్హార రాగాలు;


************************,

Sabhaash!
DokkaSuddhai unna mEghaalu, 
wallistuunnawi merupula padyaalu, 
appagistuunnawi pRdhwii guruwuku, 
warshadhaarala wEdamamtraalu;
paaDutuunnawi mEGamalhaara raagaalu;

************************,

చినుకులు/  haiku/ chinukulu haikuuunalu హైకూనలు; 

Towel designs 













kiru, kireji, kigo ()aijiki)  అనే జపాన్ పదములు, 
హైకూ- అనే (haikai) పద్య ఆవిర్భావానికి మూలములు.  
హైకై- కి వేరేగా బహువచనము లేదు.
నా saree designs కంప్యూటర్ పై వేసాను. 
ఈ cloth designs పై మీ అభిప్రాయాలను చెప్పండి,  
చినుకులు హైకూనలు-   హైకూలు- కి నా  తెలుగు సేత. ; 

(కావ్య కాదంబరికుసుమాంబ గ్రూపు 2014 septembar})

************************************************,,