cloth designs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
cloth designs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, జనవరి 2015, బుధవారం

శుభగీత PONGAL దీవెనలు

ధాన్య లక్ష్మీ శోభ; గృహములకు కళకళలు; 
అందరికి మోదములు; ఆకాంక్ష తళతళలు || 

శ్రీవిష్ణుదేవేరి కురిపించు ఊసులను;
కుశలము నుడువుచూ  విచ్చేసెను ధరకు;            
పౌషమాసపు కొంగు ముడిలోన
భద్రముగ తెచ్చేను బంగారములనెల్ల ||

ముంగిట్లొ కోలములు, రంగవల్లికలు
ఈ జగతి ఎల్లెడల వన్నె శోభల్లు  
ఉత్తరాయణ వేళ ; పదునాల్గు భువనములు
మోహనాకృతి దాల్చు మంచి శుభఘడియలు ||     

               హ్యాపీ పొంగల్ !!!!! Happy PONGAL!!!!!!!
  హ్యాపీ పొంగల్ !!!!! Happy PONGAL 

24, అక్టోబర్ 2014, శుక్రవారం

మెరిసే పేజీలు

ఆమని వచ్చే వేళకు; 
బుల్ బుల్ పిట్ట తెచ్చిన 
'పాటల లోలాకులను' తగిలించుకున్న 
శ్రవణేంద్రియాలు  
మిసిమికాంతులతో  హుషారుగా;  
మెరుస్తూ తూగాడుతూంటాయి

ప్రతి బుల్లి సంఘటన, 
ఆనందపూర్ణతకు ఆహ్వానం పలుకుతుంది.  

పునః పునః వడబోతల జీవితానుభవాలతో; 
బ్రతుకుపుస్తకం; 
సరికొత్త పేజీలను ఫైలుకి చేర్చుకుంటూ; 
సొబగుల డైరీ ఐ; 
మనకు అందుతూంటుంది. 

**************************,
[Dairy Books}

curtains designs  













నా బ్లాగులను:-
1. అఖిలవనిత ; 2. అఖిలావని; 3. కోణమానిని- ను చూసి,
నేను కంప్యూటర్ స్క్రీన్ పై వేసిన paintimgs పై 
మీ అభిప్రాయాలను  ఆహ్వానిస్తూ
దీపావళి శుభాకాంక్షలు;  

21, అక్టోబర్ 2014, మంగళవారం

సరదా దీపావళి

మతాబాలకు వెలుగులు నేర్పి,
ఆషామాషీ కబుర్లతోటి; 
నేడే పండుగ దీపావళి   ||
,
చుక్కల తళుకుల; 
లోకాభిరామాయణం; 
మక్కువ బాలల బాతాఖానీ! ||
,
టెన్షనులన్నిటి విడనాడి; 
ఇంటాబైటా కాంతిప్రభలు; 
చెప్పాలా మరి,ఇది దీపావళి||
,
దీపావళీ! దీపావళీ!  
welcome welcome Diwali!
Happy Happy diwali! 
wishing you all 
Happy diwali!  Happy diwali! ||

Happy prasperus diwali