19, ఆగస్టు 2015, బుధవారం

మనసు తోట

ఎరుపువన్నెల వొలుకుచున్నవి;
ఇందువదన బింబాధరములు ;
గీతమ్ముల ఆలాపనలు సాగుచూ ఉన్నవి;
పాటలాధర, చెలియ వంపు తిరిగి యున్న పెదవుల ;
తమ్ములముల రాగార్ణవ సౌరభమధువులు ;
గీంతమ్ముల ఆలాపనలు సాగుచూ ఉన్నవి;
;
తరుణీమణి! నీదు తాంబూలవిడియపు జల్లులు;
నాదు మానసోద్యానవనముల తొణికిసలాడేను;
వియ్యమందేను తమాల పల్లవములు;
నాదు స్వప్నసంఘాల తోడ;
గీతమ్ముల ఆలాపనలు సాగుచూ ఉన్నవి;
;
ఇట, ఉభయసంధ్యల అరుణార్ణవములు;
పగలుకు, రేయికి; అభేదములాయెను;
శత్రులకైనా మైత్రిని కూర్చెడు చమత్కారము;

అందులకే -
నీదు హస్తమున తమాలవిడియాలకు,
నాదు ఎడద తోటను;
విడిదిగా ; అంకితమొసగితిని;
తృణీకరించకుము; జవ్వనీ!
=================

18, ఆగస్టు 2015, మంగళవారం

విమలకాంతి

కారుమబ్బులు దట్టముగ పట్టినప్పుడు కూడ ; 
సహస్రదళ నళినమ్ములు వికసించెను ;
కటికచీకటి అమావాస్య నిశిని కూడ ; 
ఇటుల కువలయాదులు విరిసినవి;
నళిననేత్రీ! నా కోమలీ!
విప్పారిన నీదు నగవులందలి విమలకాంతి చేత ; 
పద్మములు వడలలేదు ;
నీదు వీక్షణముల నునులేత కాంతి వలన ; 
కలువపూవులు కసిగందలేదు;

భానుని సఖియలకును .........
చంద్రుని ప్రేయసిలకును
పగలు, రాత్రిల పట్టింపులు లేకపోయె!

దినకరునికి, 
శశాంకునికిని
పట్టరానంత ఉక్రోషం
కలిగినదీ ....... అంటే
కలగదా మరి! -
వారి క్రోధములను 
తప్పుబట్ట లేము కదా!!!!!!

************************
 So many many 














(విమలకాంతి)
[views ;- 4655 ; కుసుమాంబ[1955]
FB:- ఉపశమన  తరంగాలు ]
'

14, ఆగస్టు 2015, శుక్రవారం

ప్రాగ్దిశను నవ ఉషస్సు

ఉజ్వలమౌ పతాకము;
మన త్రివర్ణపతాకమ్ము 
అగణితమౌ  తేజస్సులు 
దశదిశలా పెంచును  || 

విషణ్ణతలు మరుగవగా;- 
        కనుమరుగు అయ్యేలా;  
వెన్నెలను కురియును    
పున్నమివెన్నెలను కురియును  ॥       
    
మువ్వన్నెల మన జెండా
  చేవ్రాలు చేసెను
అదిగో! అటు వెలిసెను
   ప్రాగ్దిశను నవ ఉషస్సు    ||   

**************************************************************

తెలుగురత్నమాలిక  (teluguratnamaalika ) 
Pageview chart 4627 pageviews - 134 posts, last published on Aug 11, 2015 


11, ఆగస్టు 2015, మంగళవారం

మమతల తీరుతెన్నులు

అబ్బురముల
వలపు తీరులెపుడు కడు ఆశ్చర్యార్ధకములను
మన బాటల పరచుచుండునౌరా!

అనంతమౌ సాగరమున ;
అగణితమౌ కెరటమ్ముల  
లవణజలములందు కూడ;
ధృతి వీడదు స్వాతిచిప్ప;

ఆణిముత్తెమ్ములకు  
ఊయెలగా తానై
అగాధమౌ నీళ్ళలోన 
వసియించును 
స్వాతి ముత్తెపుచిప్ప!

ఈ మమతల తీరుతెన్నులు 
ఎపుడు అబ్బురములు కదా!
ఎన్నెన్ని అగచాట్ల పాలైన గాని,
అనురాగపు తీపిదనము 
కడకు లభ్యమగును కదా!

యోచించి చూడ బ్రతుకు చిత్రం కదా!
మన బాటల పరచుచుండునౌరా!!!!!!
;

9, ఆగస్టు 2015, ఆదివారం

వలపు తీరుతెన్నులు

అమల విమల భావములకు; 
అవధి నెరుగని మమకారపు ఊహలకును;
అవనిలోన కనుగొనగా; 
ఆలంబనమౌతున్నది 
"ప్రేమ స్పర్శయే"  సుమీ! 

రమణీమణి దృక్కులందు, 
అధరమ్ముల, కపోలముల దర్పణముల ;  
కరువుదీర ప్రతిఫలించు -
తన బింబమ్ముల వీక్షించుచు పరవశించు 
'వలపు తలపు తత్వమ్ముల అబ్బురమ్ముల'
గమనించండీ! 
తెలిసిన ఆ చిత్రమ్ముల 
ఓలలాడండి నిరవధికంగా!  

[వలపు తీరుతెన్నులు]

్్్్్్్్్్్్్్్్్

amala wimala bhaawamulaku; 
awadhi nerugani mamakaarapu uuhalakunu;
awanilOna kanugonagaa; 
aalambanamautunnadi 
"prEma sparSayE"  sumii! 

ramaNImaNi dRkkulamdu, 
adharammula, kapOlammula darpaNamula ;  
karuwudiira pratiphalimchu 
tana bimbammula; 
wiikshimchuchu parawaSimchu; 
walapu talapu tatwammula 
abburamula gamanimchamDI! 

్్్్్్్్్్్్్్్్్

అంబరానికి తెగ అసూయ

అంబరానికి తెగ అసూయ చెలీ! 
నీదు కపోలముల దర్పణముల చూచి, 
ఎంతొ ఈర్ష్య పడి ఆ అంబరము;
"అంత మిసిమి నిగ్గుల అద్దముగ; 
నేను కూడ అవ్వాలని"
తలచింది, సరే!
తలచినదే తడవుగా ; 
చతుర్ముఖుని గూర్చి, 
చిరకాలతపస్సు చేయడం
మొదలెట్టింది;
ఆరంభం అదె పాపం! 
తుది ఎరుగని ఆచరణగ, 
మారిందీ ఆ తపస్సు!
ఒంటికాలి మీద నిలిచి,
నాటినుండి నేటి దాక
పాపమటులె నిలిచి నిలిచి, 
నిలిచి నిలిచి,నిలిచీ ,........
తాను వంగిపోయె నో సఖీ!
{మధుర కవితలు - 1 - కుసుమాంబ }
Kusuma Piduri‎భావుక ; July 22 at 11:40pm ·
      (భావుక; in Face Book } 
==========================

 అంబరానికి తెగ అసూయ 

‪#‎ambaraaniki‬ tega asuuya:-
ambaraaniki tega asuuya chelii! 
niidu kapOlamula darpaNamula chuuchi, 
emto Irshya paDi aa ambaramu;
amta misimi niggula addamuga; 
nEnu kuuDa awwaalani;
talachimdi, sarE! 
talachinadE taDawugA ; 
chaturmukhuni guurchi,
chirakaalatapassu chEyaDam
modaleTTimdi; 
aarambham ade paapam! ; 
tudi erugani aacharaNaga,
maarimdii aa tapassu! 
omTikaali miida nilichi, 
naaTinumDi nETi daaka; 
paapamaTule nilichi nilichi, 
taanu wamgipOye nO saKI!
{madhura kawitalu - 1 - 
kusumaamba}

; #(BAwuka} 

*****************************

వలపు ఇతిహాసమునకు ఆశ్వాసములు 


యుగాలు మారినా, తరాలు మారినా 
మారని అంశం ఒకటున్నది, 
అని ఇప్పుడు తెలుసుకొంటిని; 
ప్రేమప్రభలు ప్రతిభావంతమైనవి, 
నీ చూపులు, నీ నవ్వులు, 
నీ పలుకులు, నీ కులుకులు ;
వలపు ఇతిహాసమునకు ఆశ్వాసములు;
ప్రణయ గీతం ప్రబంధమై ; 
భాసించుచున్న ఆ హేతువును; 
నే కనుగొంటిని చెలీ!  

వలపు విరుల దండలు
వెదజల్లే పరిమళాలు 
యుగయుగాలైనా మాయనివీ, 
మారనివీ అని! 
  
[వడ్డాది పాపయ్య బొమ్మ స్ఫూర్తి]

==========================



#yugaalu maarinaa, 
taraalu maarinaa 
maarani amSam okaTunnadi, 
ani ippuDu telusukomTini; 
prEmaprabhalu pratiBAwamtamainawi, 
nii chuupulu, nii nawwulu, 
nii palukulu, nii kulukulu ;
walapu itihaasamunaku aaSwaasamulu;
praNaya giitam prabamdhamai ; 
bhaasimchuchunna aa hEtuwunu; 
nE kanugomTini chelI!  

walapu wirula damDalu
wedajallE parimaLAlu 
yugayugaalainaa maayaniwii, 
maaraniwii ani! 

'''''''''''''''''''''''''''''''''''''
[భావుక ; fb - today ]

6, ఆగస్టు 2015, గురువారం

మదనుని టార్చ్ లైటు

పరిణతి చెందెను మదనుని మేధస్సు
ఎంతో తెలివిగ  కరదీపికను సంపాదించెను  

ఈ నాటికి
కోమలి నవ్వుల కర్పూర దీపికను   
చేకొని ముందుకు సాగె మన్మధుడు
ఇకపై అతనుడు ఓటమి ఎరుగడు    

**********************************
               [మదనుని టార్చ్ లైటు]

**********************************

LINK 1 - అర్జెంటీనాలో "హస్తినాపురము" ... మరో 9 వెన్నెల వెలుగులు 

**********************************

LINK 2 - కోణమానిని తెలుగు ప్రపంచం 
అర్జెంటీనాలో "హస్తినాపురము" - *అర్జెంటీనాలో "హస్తినాపురము" ఉన్నది, తెలుసా!? * *
(అర్జెంటీనమ్ అనే ధాతువు యొక్క లాటిన్ నేమ్ మూలముగా ఒక దేశమునకు పేరు వచ్చింది, 

**********************************

LINK 3 -

Telugu Ratna Malika
Pageview chart 4584 pageviews - 130 posts, last published on Jul 31, 2015  

31, జులై 2015, శుక్రవారం

దంత రోచిస్సులు

వెన్నెలలకు ఆటపట్టు అయిన 
చెలియ మోమును గని;
చుక్కలన్ని దిగివచ్చెను;

తన - పలువరసలొ మిలమిలల
వరుసలై స్థిరపడినవి 
{దంత రోచిస్సు}  

=======================

damta rochissu :- 

wennelalaku aaటpaTTu ayina 
cheliya mOmunu gani;
chukkalanni digiwachchenu;

tana - paluwarasalo milamilala
warusaలై sthirapaDinawi  

**************************************

30, జులై 2015, గురువారం

వాక్కుల నోములు

యుగయుగాలుగా, ఎలనాగ ; 
ఒక మహోద్గ్రంధము; 

నేను తనకు అనుబంధము;
తరతరాలుగా తరుణీమణి - 
ప్రధాన వాచకము; 
నేను తనకి ఉపవాచకము;
ప్రణయకలహాల ఆత్మబాంధవి!!!  

తాను ఆకాశవాణి; నేనేమో ; 
ధరణీఫలకమున పరచుకుంటూనే ఉండే 
అచ్ - హల్ - కలబోతల వాక్కుల;
నిరంతర దీక్షాకంకణబద్ధుడిని;
విధేయుడిని! 
నాదు ప్రణయకలహాల ఆత్మబాంధవికి!!! 

=============================

waakkula nOmulu :- 

yugaయుగాలుgaa, elanaaga ; 
oka mahOdgramdhamu; 
nEnu tanaku anubamdhamu;
taraతరాలుgaa taruNImaNi; 
pradhaana waachakamu; 
nEnu tanaki upawaachakamu;
praNayakalahaala aatmabaamdhawi; 

taanu aakASawaaNi; 
nEnEmO -
dharaNIphalakamuna 
parachukumTUnE umDE 
ach - hal - kalabOtala waakkula;
niramtara diikshaakamkaNabaddhuDini;
widhEyuDini!
naadu praNayakalahaala aatmabaamdhawiki!!!!!!!   


*************************** 

ఓ చెలీ! నా నెచ్చెలీ!

యుగాలు మారినా, తరాలు మారినా 
మారని అంశం ఒకటున్నది - అని 
ఇప్పుడు తెలుసుకొంటిని -

ప్రణయ గీతం ప్రబంధమై ; 
భాసించుచున్న ఆ హేతువును; 
నే కనుగొంటిని పద్మదళ నయనీ!

ప్రేమప్రభలు ప్రతిభావంతమైనవి, 
 నీ చూపులు, నీ నవ్వులు, 
నీ పలుకులు, నీ కులుకులు ;

వలపు ఇతిహాసమునకు ఆశ్వాసములు;
అని కనుగొన్నాను లలిత లావణ్య  విలాసినీ!  
సుమగాత్రీ! ఓ చెలీ!  నా నెచ్చెలీ!
      
==========================

#yugaalu maarinaa, taraalu maarinaa 
maarani amSam okaTunnadi, ani -
ippuDu telusukomTini  -

praNaya giitam prabamdhamai ; 
bhaasimchuchunna aa hEtuwunu; 
nE kanugomTini chelI! 

prEmaprabhalu pratiBAwamtamainawi, 
 nii chuupulu, nii nawwulu, 
nii palukulu, nii kulukulu ;
walapu itihaasamunaku aaSwaasamulu;
ani కనుgonnaanu lalita laawaNya  wilaasinii!  
nE kanugomTini chelI! నా nechchelii !  

**************************
                   [ -  ఆటిన్ కవితలు   ]

Telugu Ratna Malika
Pageview chart 4524 pageviews - 127 posts, last published on Jun 22, 2015 

22, జూన్ 2015, సోమవారం

హారంలో దారం

ఎన్నో ఊహలకు ఊయెల ఈ నా చిట్టిమనసు  
ఎన్నెన్నో దృశ్యాలకు డోలలు నా కళ్ళు
జవ్వనీ! 
అటు ఊహలూ, ఇటు దృశ్యాలూ
'నీవు ' అనే వర్ణాలతో; రాగరంజితమై 
ఆవిష్కృతమౌతూన్న దృశ్యం మాత్రం నిత్యనూతనం!  
అది - ఆచంద్రతారార్కం అజరామరం ఔతూన్న
గతకాల, వర్తమాన, భవిష్యత్; 
త్రికాలముల మణిపూసలనుండి; 
ఎడతెగక తిరుగుతూ పట్టి ఉంచుతున్న బంగారు దారము.

@@@@@@@@@@@@@@@@@@@@ 
 
(ఆటిన్ కవితలు - 1)
 రచన - కాదంబరి పిడూరి 

 lamp stands 


#*************************************, # 
 అఖిలవనిత
Pageview chart 31538 pageviews - 786 posts, last published on Jun 16, 2015
Create new postGo to post listView blog
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 58908 pageviews - 1017 posts, last published on May 2, 2015 - 7 followers
Create new postGo to post listView blog [59269] 
Telugu Ratna Malika
Pageview chart 4403 pageviews - 126 posts, last published on Jan 14, 2015 

14, జనవరి 2015, బుధవారం

శుభగీత PONGAL దీవెనలు

ధాన్య లక్ష్మీ శోభ; గృహములకు కళకళలు; 
అందరికి మోదములు; ఆకాంక్ష తళతళలు || 

శ్రీవిష్ణుదేవేరి కురిపించు ఊసులను;
కుశలము నుడువుచూ  విచ్చేసెను ధరకు;            
పౌషమాసపు కొంగు ముడిలోన
భద్రముగ తెచ్చేను బంగారములనెల్ల ||

ముంగిట్లొ కోలములు, రంగవల్లికలు
ఈ జగతి ఎల్లెడల వన్నె శోభల్లు  
ఉత్తరాయణ వేళ ; పదునాల్గు భువనములు
మోహనాకృతి దాల్చు మంచి శుభఘడియలు ||     

               హ్యాపీ పొంగల్ !!!!! Happy PONGAL!!!!!!!
  హ్యాపీ పొంగల్ !!!!! Happy PONGAL 

30, నవంబర్ 2014, ఆదివారం

వాసంతి - ఋతు చాందిని

వసంతరాణి;
వసంతరాణీ! చూపుల గీతలు గీసేను;
నవ్వుల లిపిని నేర్చుకోమని;
వక్కాణమును ఇచ్చినది;

పూవై విరిసిన ఆహ్లాదం;
అచ్చులు, హల్లుల పూలసజ్జ అది;  ;
గుణింతములకు బోధిని ఐనది;
పచ్చదనమ్ముల ఊసుల నిచ్చెను;
పుప్పొడి ఊహల వెదజల్లినది;

కావ్య కులాయములెన్నో కట్టగ;
నుడువుల ఆకుల గుబురులాయెను;
ప్రబంధమ్ముల 'పట్టు-కొమ్మ అయి
జానపదమ్ముల ఇంపుగ చేరిన;
పల్లెపాటల ముల్లె ఐనది;
సామెతలకు, లోకోక్తులకు
     తనుచక్కని నీడనొసగెను;
పాటలు, ఆటలు, చాటువులయ్యెను!
అయ్యారే!
లలితగీతముల, కృతి, కీర్తనలకు
లావణి, నటనల, నర్తనములకు - భవనము నిలిపెను,
భువికి మోహనము, రాగ గమకము;
వాసంతహేలవీ,
ఓ మహరాణీ! నా హృత్ సామ్రాజ్ఞీ!
*************************,
{వాసంతి ఋతు చాందిని}:
*************************,
 shandiliars Designs














konamanini image- in TAMIL 

















{వివిధ భాషల వింతలు:-}:

16, నవంబర్ 2014, ఆదివారం

చుబుకమున నొక్కు & Kannada lipi

క్రీగంటిచూపుల గగనమ్ములు; కోరేనిదేమో 
కనుబొమల గొడుగులను; 
                  ఎంత వింత!?

చుబుకమున ఒక నొక్కు;
రెండు నెలవంకలను 
సృష్టించె, జాణతనమౌర!

ఒక్క - విదియచంద్రుని తోటి 
                ఉన్న ఆకాశము;
డెందమెంతగ నిండె ఈసుతోటి; 

***************************,

 wanita Designs 













రత్న వనిత డిజైన్స్ :
***************************,
#kriigamTichuupula gaganammulu; kOrEnidEmO 
kanubomala goDugulanu; emta wimta!?

chubukamuna oka nokku;
remDu nelawamkalanu 
sRshTimche, jaaNatanamaura!

okka - widiyachamdruni tOTi unna aakaaSamu;
Demdamemtaga nimDe iisutOTi; 
#
***************************,
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||

గూగుల్ ట్రాన్స్ లేట్ ఉపకరణముతో-
నా బ్లాగు - అఖిలవనిత -
ఈ లింకు లో ఇట్లాగ కనిపిస్తుంది. 
సరదాగా వీక్షణాలు:-
Kannada language అనువాద దృశ్యము ఇది!

***************************,
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||

ಬುಧವಾರ, ಅಕ್ಟೋಬರ್ 29, 2014
ఈబుక్ నా బాల గీతికలు
ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ ಬುಕ್ 
ಒಂದು ಸಂಕಲನವಾಗಿದೆ 
NewAvakaya.com ನನ್ನ ಕೊಡುಗೆಗಳನ್ನು.  

ఈబుక్ నా బాల గీతికలు (ఈ లింక్ మీద క్లిక్ చేయండి)
ಪೋಸ್ಟ್ ಮಾಡಿದವರು ಅನಿಲ್ Piduri ನಲ್ಲಿ 5:55 PM  
ಪ್ರತಿಕ್ರಿಯೆಗಳು:
1 ಕಾಮೆಂಟ್:

telugusarma 9:15 ಕ್ಕೆ ನವೆಂಬರ್ 14, 2014
https://translate.google.com/translate?sl=en&tl=kn&js=y&prev=_t&hl=te&ie=UTF-8&u=http%3A%2F%2Fakhilavanitha.blogspot.com%2F&edit-text= 

ಕನ್ನಡ ಬ್ಲಾಗ್ 'akhilavanitha' ನೋಡಿ scipt
- ಉತ್ತರಿಸಿ

|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
***************************,
Telugu Ratna Malika
Pageview chart 3820 pageviews - 122 posts, last published on Nov 5, 2014
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 54212 pageviews - 1000 posts, last published on Nov 5, 2014 - 
అఖిలవనిత
Pageview chart 28529 pageviews - 740 posts, last published on Nov 5, 2014

 కాదంబరి కుసుమాంబ : కావ్య కాదంబరి బొమ్మలు ; 

5, నవంబర్ 2014, బుధవారం

జాతీయపక్షి peacock (song)

హరిబోధిని దేవోత్థని; 
ఉత్థాన ఏకాదశి, ప్రబోధిని ; ఆహ్లాద వ్రత రాజ్ఞి ||

విశిష్టమైనది, సొగసులను ఎడదలకు; 
స్పర్శింప జేయగల; హర్షముల ఆచరణ||
కార్తీకమాసము చల్లని గాలులు; 
శుక్ల పక్షమునందు; 
శుభ కేకి నృత్యాల; శోభల పండుగ ||

మణికంఠ వాహనము వనమయూరీ!
శ్రీకృష్ణుడు చూడ, శిఖిపింఛమౌళియే! 
మన జాతీయపక్షికి జేజేలు పలుకులు ||   

ఆహ్లాద వ్రత రాజ్ఞి - ఉత్థాన ఏకాదశి
హరిబోధిని - దేవోత్థని;  ప్రబోధిని ;
ఆహ్లాద వ్రత రాజ్ఞి - ఉత్థాన ఏకాదశి
ఉత్థాన ఏకాదశి, ఉత్థాన ఏకాదశి!

******************************,

ఆహ్లాద వ్రత రాజ్ఞి 
 
ఈబుక్ నా బాల గీతికలు
Please download eBook 
which is a compilation 
of my contributions in NewAvakaya.com. 

24, అక్టోబర్ 2014, శుక్రవారం

మెరిసే పేజీలు

ఆమని వచ్చే వేళకు; 
బుల్ బుల్ పిట్ట తెచ్చిన 
'పాటల లోలాకులను' తగిలించుకున్న 
శ్రవణేంద్రియాలు  
మిసిమికాంతులతో  హుషారుగా;  
మెరుస్తూ తూగాడుతూంటాయి

ప్రతి బుల్లి సంఘటన, 
ఆనందపూర్ణతకు ఆహ్వానం పలుకుతుంది.  

పునః పునః వడబోతల జీవితానుభవాలతో; 
బ్రతుకుపుస్తకం; 
సరికొత్త పేజీలను ఫైలుకి చేర్చుకుంటూ; 
సొబగుల డైరీ ఐ; 
మనకు అందుతూంటుంది. 

**************************,
[Dairy Books}

curtains designs  













నా బ్లాగులను:-
1. అఖిలవనిత ; 2. అఖిలావని; 3. కోణమానిని- ను చూసి,
నేను కంప్యూటర్ స్క్రీన్ పై వేసిన paintimgs పై 
మీ అభిప్రాయాలను  ఆహ్వానిస్తూ
దీపావళి శుభాకాంక్షలు;  

21, అక్టోబర్ 2014, మంగళవారం

సరదా దీపావళి

మతాబాలకు వెలుగులు నేర్పి,
ఆషామాషీ కబుర్లతోటి; 
నేడే పండుగ దీపావళి   ||
,
చుక్కల తళుకుల; 
లోకాభిరామాయణం; 
మక్కువ బాలల బాతాఖానీ! ||
,
టెన్షనులన్నిటి విడనాడి; 
ఇంటాబైటా కాంతిప్రభలు; 
చెప్పాలా మరి,ఇది దీపావళి||
,
దీపావళీ! దీపావళీ!  
welcome welcome Diwali!
Happy Happy diwali! 
wishing you all 
Happy diwali!  Happy diwali! ||

Happy prasperus diwali  

15, అక్టోబర్ 2014, బుధవారం

మేఘమల్హార రాగాలు (హై'కూనలు'/ haiku)

శభాష్!
డొక్కశుద్ధి ఉన్న మేఘాలు, 
వల్లిస్తూన్నవి మెరుపుల పద్యాలు,  
అప్పగిస్తూన్నవి పృధ్వీ గురువుకు, 
వర్షధారల వేదమంత్రాలు;
పాడుతూన్నవి మేఘమల్హార రాగాలు;


************************,

Sabhaash!
DokkaSuddhai unna mEghaalu, 
wallistuunnawi merupula padyaalu, 
appagistuunnawi pRdhwii guruwuku, 
warshadhaarala wEdamamtraalu;
paaDutuunnawi mEGamalhaara raagaalu;

************************,

చినుకులు/  haiku/ chinukulu haikuuunalu హైకూనలు; 

Towel designs 













kiru, kireji, kigo ()aijiki)  అనే జపాన్ పదములు, 
హైకూ- అనే (haikai) పద్య ఆవిర్భావానికి మూలములు.  
హైకై- కి వేరేగా బహువచనము లేదు.
నా saree designs కంప్యూటర్ పై వేసాను. 
ఈ cloth designs పై మీ అభిప్రాయాలను చెప్పండి,  
చినుకులు హైకూనలు-   హైకూలు- కి నా  తెలుగు సేత. ; 

(కావ్య కాదంబరికుసుమాంబ గ్రూపు 2014 septembar})

************************************************,,


Chandana thorough toys

Chandana thorough toys

Teccenamma moon thorough Chandana
Chandana thorough touched the toys
they evvarivamma? Evvarivamma they? ; || Moon ||                           

friends scoff, brother goki          
ponnacettu hidden perch Krishna         
Krishna podarillalona nakkinakki navveti                                             
tanivitira jabiliki eagerness to see; || Moon ||   
                          
"leapfrog manalantu" mischievous Krishna's mother, 
the officials pointed tarjanini yasodamma                     
repallela gopemmala kongulandu dobuci       
atalada jabilliki fellow eagerness; || Moon ||   
                      
Yamuna waves nestalato, idulatalo clever           
nilinili keratalalo kaliyuni on the platform   
of Krishna Rasa tandavamadeti nilamohana                                 
tanivitira jabilliki eagerness to see; || Moon ||

********************************, 
Member Categories - child, Web magazine, newaavakaaya (LINK) 
Written by kusuma kumari; Tuesday, 07 October 2014 10:03; Hits: 122
*****************************************,

curtain DESIGNS 

;అఖిలవనిత
Pageview chart 28167 pageviews - 732 posts, last published on Oct 10, 2014
Telugu Ratna Malika
Pageview chart 3755 pageviews - 117 posts, last published on Oct 1, 2014
కోణమానిని తెలుగు ప్రపంచం

1, అక్టోబర్ 2014, బుధవారం

పున్నమి నోములు

వెన్నెల పురి విప్పి ఆడుతూన్న 
మరాళము చందమామ;
ఎన్ని సార్లు ఆ పగిదిని
అమావాస్య పొదల వెనుక 
దాగుంటావ్ చందురుడా!   

ఎప్పటికప్పుడు మళ్ళీ, 
ఇట్లాగ పున్నమి సొగసుల నెమలిలా ;
మాకోసం వస్తుంటే, 
మళ్ళీ మళ్ళీ చెప్పాలా!? 
అనవరతం -
నీ "ఆగమనం - నోముల"పున్నమలే!
ఇంత వింత వ్రతములను 
కనిపెట్టిన నీకు 
మా ఎడతెరిపి లేని ధన్యవాదాలోయీ! 

         - కాదంబరికుసుమాంబ  





















అనవరతం నీ ఆగమనం
పున్నమి నోములు ;