8, మార్చి 2009, ఆదివారం

హారతి


పడతి అడుగు జాడలన్ని
కర్పూరపు ప్రో వులయ్యె!
ఆమె వెడలినంత
లేత ఎండ ఇసుమంత సోక గానే
"మరీచికలు"వెలుగ
'పుడమి పళ్ళేరము నందు
వెలుగు హారతి ' ఏమో?!"
అనుచు బ్రాంతి కలిగె!