12, జూన్ 2009, శుక్రవారం

గణిత సూత్రాలు

నేను విద్యార్ధిగా ఉన్న రోజులలో, మొదటిసారి పరిశోధనా పత్రం రాసి ప్రచురణకి పంపినప్పుడు,
సంప్రదాయానుసారంగా,
ఆ పత్రికా సంపాదకుడు
నేను రాసిన పత్రం మరో నలుగురికి పంపి
వాళ్ళ అభిప్రాయాలు అడిగి,
ఆ అభిప్రాయాలు సేకరించి నాకు తిరిగి పంపి,
నా పత్రాన్ని తదనుగుణంగా సవరించి పంపమన్నాడు.

అందులో మూడు అభిప్రాయాలు,
"ఈ పరిశోధనా పత్రం బాగానే ఉంది. ప్రచురణార్హమే!" అని వచ్చేయి.
నాలుగోది మాత్రం నన్ను ఏకెస్తూ వచ్చింది.

నా గురువుగారు నాలుగూ చదివి,
"మొదటి మూడూ మనకి పనికిరానివి, అవి పక్కన పెట్టెయ్;
ఆ నాలుగోది ఘాటుగా ఉందని ఉడుక్కోకు, అదే మనకి ఉపయోగపడుతుంది.
ఆ నాలుగో అభిప్రాయం చదివి
అందులో ఉన్న ఆక్షేపణలన్నిటిని మనస్పూర్తిగా స్వీకరించి,
నా పత్రాన్ని మరమ్మత్తు చెయ్యమని "చెప్పి, నాతో అన్నారు:

"మన పనిని ఆ క్షేపించినవాడే
మన అసలు స్నేహితుడు. ఇది జ్ఞాపకం పెట్టుకో!"
అన్నారు.
(చదవండి!
http://lolakam.blogspot.com/2009_04_01_archive.html )