12, మే 2013, ఆదివారం

కొంగు నీరదము


పైట చెంగు విసిరేస్తే
నీలిమేఘమయ్యింది;
పన్నీటికి చిత్రంగా
చక్కని గొడుగయ్యింది||
;
అంచు అంచు లెంబడే-
ఆ చిత్రపు మెరుపులు
సరిగ మిసిమి బారులై
నా కన్నుల ముఖ ద్వారపు
తోరణాలు ఐనాయి
బంగారు తోరణాలు ఐనాయి  ||

తొలకరి పులకింతలు
ఔరా! ఆ జలదరింపు
అత్తర్ల బిందు సోనలై
ధారలుగా భువిని చేరి
భామ - కురులుగా తోచెను
సత్యభామా సిగ పాయలుగా తోచేను||
;
తూగాటల ఊయెలలై
జయభేరిని కోలలు ఐ  
పైరు చెక్కిలిని చేరి
పచ్చదనం "తాళమేయ"
గానాలు సేయగా
సన్నాయి గానాలు సేయగా ||    

[రచన:- కాదంబరి]
 కొంగు  మేఘము ఛత్రము గా ఐన వేళ
(నీరదము [గజల్: (1): ])

**********************

17, ఏప్రిల్ 2013, బుధవారం

చీలిన గాలి రాగమైనది!


ఎంతసేపు ఎంతసేపు ఎదురుచూపులూ?
వెదురుతోపు లందందున;
చీలు గాలిగా;
సోలు గానమై||
;
ఎద నిండా; ఆరాటం;
ఏదోదే సందేహం?
వాని రాకడలపైన;
ఆ రాకపోక నిలకడలపయి …….||
;
(చెలులు): -
సంశయాలు, శంకలను విసిరివేయుమా!
నీలిమబ్బు తుకిడీలు తుకిడీలు నింగిలోన
అవిగో! అవిగవిగో!
అవిగో! అవిగవిగో!   ||
;
గగనాల పరుచుకున్న నీలివర్ణమా!
క్రిష్ణు మేని వర్ణమా!
నీరదముల నేస్తమై చెట్టపట్టలేసుకుని;
మా వేదన, ఆతృతలను
గ్రుమ్మరించి, కన్నయ్యకు
అక్షరక్షరము జలధిగ 
వివరించి తెలుపండీ!||

***************************************;
మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్
;
emtasEpu2 eduruchuupuluu?
wedurutOpu lamdamduna; chiilu gaaligaa; sOlu gaanamai||
;
eda nimDA; aaraaTam; EdOdE samdEham?
waani raakaDala; nilakaDalapai/na …….||
chelulu: - saMsayaalu, Samkalanu wisiriwEyumaa:
niilimabbu tukiDIlu; tukiDIlu; nimgilOna; awigO! awigawigO! ||
;
gaganaala paruchukunna nIliwarNamaa!
krishNu mEni warNamaa! nIradamula nEstamai;
cheTTapaTTalEsukuni; maa wEdana, aatRtalanu;
grummarimchi, kannayyaku;
aksharaksharamu jaladhiga; wiwarimchi telupamDI!||
;
;
 Konamanini vies: 00051782