24, నవంబర్ 2010, బుధవారం

వింటికి నారి






















ఇక్షు దండ ధనుర్ధారి, మదనుడు నేడు చెలియ!
" నీదు ముత్యాల పలు వరుసలను
తనదు వింటికి నారి – గా’ గైకొన్నాడు;
భళిర! బహు గడుసు వాడు - వాడు!

మరల ఆట్టె శ్రమ లేకుండ –
“నీదు మందహాసమ్ములనె –
విరి తూపులుగ పొంది
పొందికగ శర సంధానముల నేర్చి,
ప్రావీణ్యమును సాధించినాడు,
చూడుమీ చోద్యమ్ములను ప్రమద!

++++++++++++++++++++++

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి