8, మే 2011, ఆదివారం

వెండ్రుకలతో కొలతలు























       మన్మథుడు- 
తిమిర సీమల వైశాల్యాన్ని -
కొలవ అశక్తుడు ఐనాడు;
యుక్తిగా......
నీ నీలి కురులను -

కొలబద్దలుగా గైకొన్నాడు; -

మదన కార్యము- 

విజయవంతమైనది! -


భర్త అడుగుజాడలలోనే నడిచింది రతీ దేవి!-

ఆవలి గట్టున ఉన్నాడు తన నాధుడు!-

ఈవలి తీరం నుండి-

చెలియా!-

నీ క్రీగంటి చూపుల నావను -
                        
         గైకొన్నది-
అవతలి ఒడ్డుకు -
సునాయాసంగా చేరుతుంది ఆమె!

సంశయ మింక లేదు.

     
           వెండ్రుకలతో కొలతలు

@@@@@@@@@@@@@@@@@
       

veMDrukalatO kolatalu;


manmathuDu timira siimala vaiSAlyaannikolava aSaktuDu ainaaDu;yuktigaa......nI nIli kurulanu kolabaddalugaa gaikonnaaDu; bharta aDugu jaaDalalOnE naDichiMdi ratI dEvi!aavali gaTTuna unnaaDu tana naadhuDu!Ivali tIraM nuMDi,cheliyaa!nI krIgaMTi chUpula naavanu gaikonnadi,avatali oDDukusunaayaasaMgaa chErutuMdi aame!saMSaya miMka lEdu.
@@@@@@@@@@@@@@@@@

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి