17, ఏప్రిల్ 2014, గురువారం

నా పాట డోలిక

నిశి రేయి తరువునకు పూసినవి తారకలు; 
చుక్క మిణుకుల సురభిళము మోసేను నా పాట!
మోయుచూ మోయుచూ సాగేను దిశలంత!       ||నా పాట||
;
ఈ ‘పాట పల్లకీ’ పదిలముగ ఉన్నాది; 
చెలియ కులుకుల్లార! 
విచ్చేసి వేడుకగ  ఆసీనులవ్వండి! 
బహుళముగ వేడుకలు చేసుకొనుట 
ఇంక ఇక మీ వంతు!                           ||నా పాట||
;
మీ యొక్క  హాసముల హారమ్ములుగ చేసుకుని 
'తన మేను నిండా - నిలువెల్ల ధరియించుటయె   
గీతికా పల్యంకిక యొక్క వంతు ' 
అను గ్రహియింపుతో, చెప్పొద్దూ. 
ఈ పల్యంకిక కింక అవధులే లేనన్ని 
హర్ష సంబరములు!    ||నా పాట||

మన్మధ, రతి రాజ్యములకు
దక్కె ప్రకృతి శోభానుగ్రహ కోటి! శతకోటి – 
ఇకనేటికోయీ, పరమేశ!
శాంతమ్ము నీ నగ, ఇదియె ఆవశ్యకత ||                    ||నా పాట||

(గ్రహించిన భావములు) :-  చైత్ర కోణమానిని

so many kalars 


===================================================

naa paaTa DOlika :- 

 niSi rEyi taruwunaku pUsinawi taarakalu;
chukka miNukula surabhiLamu mOsEnu
mOyuchuu mOyuchuu; saagEnu naa paaTa! ||
ii paaTa pallakii padilamuga unnaadi; cheliya kulukullaara!
wichchEsi wEDukaga  aasiinulawwaMDi!
bahuLamuga wEDukalu chEsukonuTa ika mii waMtu!
mii  haasamulanu 'tana mEnu niMDA tOraNammulugaa chEsi,
kaTTukonu tana waMtu ' anu grahiyiMputO,
cheppodduu. ii palyaMkika kiMka a
wadhulE lEnanni harsha saMbaramulu!
manmadha, rati raajyamulaku
dakke prakRti SOBAnugaraha kOTi! SatakOTi –
ikanETikOyii, paramESa!
SAmtammu nii naga, idiye aawaSyakata ||

grahimchina bhaawamulu (2014 ) :- chaitra konamanini
;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి