30, జులై 2015, గురువారం

వాక్కుల నోములు

యుగయుగాలుగా, ఎలనాగ ; 
ఒక మహోద్గ్రంధము; 

నేను తనకు అనుబంధము;
తరతరాలుగా తరుణీమణి - 
ప్రధాన వాచకము; 
నేను తనకి ఉపవాచకము;
ప్రణయకలహాల ఆత్మబాంధవి!!!  

తాను ఆకాశవాణి; నేనేమో ; 
ధరణీఫలకమున పరచుకుంటూనే ఉండే 
అచ్ - హల్ - కలబోతల వాక్కుల;
నిరంతర దీక్షాకంకణబద్ధుడిని;
విధేయుడిని! 
నాదు ప్రణయకలహాల ఆత్మబాంధవికి!!! 

=============================

waakkula nOmulu :- 

yugaయుగాలుgaa, elanaaga ; 
oka mahOdgramdhamu; 
nEnu tanaku anubamdhamu;
taraతరాలుgaa taruNImaNi; 
pradhaana waachakamu; 
nEnu tanaki upawaachakamu;
praNayakalahaala aatmabaamdhawi; 

taanu aakASawaaNi; 
nEnEmO -
dharaNIphalakamuna 
parachukumTUnE umDE 
ach - hal - kalabOtala waakkula;
niramtara diikshaakamkaNabaddhuDini;
widhEyuDini!
naadu praNayakalahaala aatmabaamdhawiki!!!!!!!   


*************************** 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి