23, సెప్టెంబర్ 2011, శుక్రవారం

కిలికించితాల రొక్కము





గడి వేసిన తలుపులు- 
ముడివేసిన తలపులు- 
తడి తపనల ఒత్తిడి- 
మడి ఒడిలో చిత్తడి- ||



మడిగెలపయి- పసుపులు- 
విడి కుంకుమ బొట్టులు-  
జీరాడే కుచ్చిళ్ళకు –
చిడిముడిగా వన్నెలు ||


మక్కువ కుదిరిందనీ – 
మల్లిక తెలిపేను వనికి- 
రొక్కము కిలికించితాలు-  
చక్కని మన్మధ రాణికి ||


@@@@@@@@@@@@@


ga Di vEsina talupulu- muDivEsina talapulu- 
taDi tapanala ottiDi- maDi oDilO chittaDi- ||


maDigelapayi- pasupulu- viDi kuMkuma boTTulu-  
jIraaDE kuchchiLLaku –chiDimuDigaa vanniyalu ||


makkuva kudiriMdanI – mallika telipEnu vaniki- 
rokkamu kilikiMchitaalu- chakkani manmadha rANiki ||
;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి