23, సెప్టెంబర్ 2011, శుక్రవారం

సింగరాయ బుల్లోడు


Raiding horse


టక్కు టిక్కు టెక్కులాడి- 
టుక్కు టెక్కు నడకలాడి- 
నడకలన్ని నాట్యాలై- 
పెక్కు నిక్కులాయె, పిల్లకు, 
నిక్కువమిది, మన్మధుడా! ||

డప్పు, డిప్ప, డెక్క వాజి- 
చుప్పనాతి రౌతు వీడు/ తాను/ 
డొప్ప డోలు తీర్థాలలొ- 
డుబుంగు డంగు తేలవోయి ||

ఆమె:- 
టాపు లేచిపోద్దిరోయి- 
తిక్క తిక్క మాటలను-
తుప్పు తుప్పున ఊస్తే – 
జాపత్రీ పిలగాడా! __
అతడు:-
టెంపరింత తగునా, 
ఓ మగనాలా!- 
తెంపరితనమేలనీకు? __
డాబుసరీ బుల్లెమ్మా!- 
జాబిలికీ కిక్కిచ్చే- 
ఓ హో బిలమా! కాంచనమా! ||

దంభారీ తనము చాలు!- 
గుంభనాలింగనములను –
 ఉపాహారమీయి చాలు! 
అదే నాకు పదివేలు ||

చంబేలీ పరిమళాల- 
సంబరాల బేలా!- 
ఈ, సింగరాయ బుల్లోడు- 
నిరంతరం నీ ఖైదీ! ||

@@@@@@@@@@@@@@@@@ 

Takku Tikku TekkulADi- 
Tukku Tekku naDakalADi- 
naDakalanni nATyaalai- 
pekku nikkulaaye, 
pillaku, 
nikkuvamidi, manmadhuDA! ||

Dappu, Dippa, Dekka vAji- 
chuppanaati rautu vIDu/ taanu/ Ime- 
Doppa DOlu tIrthaalalo- 
DubuMgu DaMgu tElavOyi ||

aame:- 
TApu lEchipOddirOyi- 
tikka tikka mATalanu- 
tuppu tuppuna UstE – 
jaapatrii pilagaaDA! __
ataDu:-
TeMpariMta tagunaa, 
O maganaalaa!- 
teMparitanamElaniiku? __
DAbusarii bullemmaa!- 
jaabilikii kikkichchE- 
O bilamaa! kaaMchanamaa! ||
;  

1 కామెంట్‌: