తెలుగు మాటలపై మమకారం ; కొన్ని కవిత్వాలు,వ్యాసాలు,జోక్సు, కంప్యూటరు తెరపైన వేసిన బొమ్మలు,పెయింటింగ్సు....... వగైరా,వగైరా.....
1, అక్టోబర్ 2011, శనివారం
అలుకల శోభల అమూల్య కాన్కలు
జవ్వని కేలనొ కినుక కలిగినది!
నా మదిలోన కలవరమాయెను;
దోబూచాడే ఓ శశాంకుడా!
మిలమిలలాడే జాబిల్లీ!-
చెలియ కులుకుల- రోష్నీలోన
చక్కగ దూరగ వస్తున్నావా?
దూరినంతనే చేరువవుదువా?
చిన్ని పాపగా మారాం చేస్తూ;
దూరాలన్నిటి - చెరిపేసేసి
చేరువ ఐతివి తనకు లిప్తలో!
నీ టక్కరితనము ఔరౌరా!
బల్ చమత్కారమే!....
అలిగిన సఖియా!
నీదు అలకలు,
అలకల కులుకులు
క్షీణించిన ఆ ఇందుబింబముకు
వెలవెలబోయే పదారు (చంద్ర) కళలకు
వేయి శోభల వరములిచ్చినవి ||
@@@@@@@@@@@@@@@@
[సుందరి కినుకలు- కానుకలు
జాబిలి కొసగిన అమూల్య కాన్కలు కాంకలు
అలుకల శోభల అమూల్య కాన్కలు ;
;
పగలును ఓదార్చు రాత్రి
![]() |
; dark hair = night ; |
అలివేణీ కుంతలమ్ముల శోభల
నేమని వర్ణించుదును?
అవనిని ఉన్న పదములు చాలవు.
నీలవేణీ కేశ గృహమున; నివసించాలని "కాల ప్రయత్నము"!
శూన్యము కాస్తా ఎటులో గాని-
తపసు ఫలించీ,
ఇంచక్కా -
తన తనువునె - "తమసు"గ మార్చుకున్నది,
రేయిగ అగును అంబరము;
కాలములోన అర్ధభాగమై,
పగలును బుజ్జగించుచునూ,
ఇదేమి వింత?
విడ్డూరముగా భలే తమాషా, జరిగినది ||
\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\
[పగలును ఓదార్చు రాత్రి]
;
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)