1, అక్టోబర్ 2011, శనివారం

అలుకల శోభల అమూల్య కాన్కలు




జవ్వని కేలనొ కినుక కలిగినది!
నా మదిలోన కలవరమాయెను;

మిన్నుల వెన్నెల పరదాలందున- 
దోబూచాడే ఓ శశాంకుడా!
మిలమిలలాడే జాబిల్లీ!- 
చెలియ కులుకుల- రోష్నీలోన  
చక్కగ దూరగ వస్తున్నావా?

దూరినంతనే చేరువవుదువా?


చిన్ని పాపగా మారాం చేస్తూ;
దూరాలన్నిటి - చెరిపేసేసి
చేరువ ఐతివి తనకు లిప్తలో! 
నీ టక్కరితనము ఔరౌరా! 
బల్ చమత్కారమే!....


అలిగిన సఖియా! 
నీదు అలకలు,
అలకల కులుకులు 

క్షీణించిన ఆ ఇందుబింబముకు
వెలవెలబోయే పదారు (చంద్ర) కళలకు
వేయి శోభల వరములిచ్చినవి ||  
  
@@@@@@@@@@@@@@@@



[సుందరి కినుకలు- కానుకలు
   జాబిలి కొసగిన అమూల్య కాన్కలు కాంకలు
అలుకల శోభల అమూల్య కాన్కలు ; 
;  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి