1, అక్టోబర్ 2011, శనివారం

కనులు బొమ్మల తెరలు


నీలాల కన్నులేల-
లాల పోసుకుంటూన్నవి?! ||


హిమబిందుల బొత్తులు 
అవి - 
మంచి మంచు ముత్యాల రాసులు – 
అవనీ తల తలంబ్రాలు- 
ఇలకు ఈ ముత్యాల కానుకలు- 
ఆనందబాష్పాలు     ||
ఇంత చక్కని బొమ్మలకు
నయనమ్ములు యవనికలు
(= బొమ్మ తెరలు)
కనుకనే
నీలాల కన్నులు 
ఈ లీలగ -
ఆనందబాష్పాల 
తానాలు ఆడేను 
లాల పోసుకొనేను ||


[కనులు బొమ్మల తెరలు]
;


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి