20, నవంబర్ 2012, మంగళవారం

మెరుపు తీగలకు ఉరుకులు


మన అందరికీ పరుగుల పోటీ!
తేల్చుకుందము ఎవరిదొ ధాటీ!
ముక్కోటి తటిల్లతా తతులారా!

ఆ తరుణీ మణి లావణ్యాలతొ
భేటీ అయ్యీ అవగానే
మిమ్ము మీరే మరచుదురేమో!?
లంఘనమ్ములను విడెదరేమో!?

ఆ పై 
ఆమె పద ద్వయికి
అలరే పారాణిగ మారి
అయ్యారే! పాదాక్రాంతులు అయీ
అల్లరి అద్వైతమ్మును
నవీనమ్ముగా వెలయించెదరో, ఏమో!? 
;
వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి