వసంతరాణి;
వసంతరాణీ! చూపుల గీతలు గీసేను;
నవ్వుల లిపిని నేర్చుకోమని;
వక్కాణమును ఇచ్చినది;
పూవై విరిసిన ఆహ్లాదం;
అచ్చులు, హల్లుల పూలసజ్జ అది; ;
గుణింతములకు బోధిని ఐనది;
పచ్చదనమ్ముల ఊసుల నిచ్చెను;
పుప్పొడి ఊహల వెదజల్లినది;
కావ్య కులాయములెన్నో కట్టగ;
నుడువుల ఆకుల గుబురులాయెను;
ప్రబంధమ్ముల 'పట్టు-కొమ్మ అయి
జానపదమ్ముల ఇంపుగ చేరిన;
పల్లెపాటల ముల్లె ఐనది;
సామెతలకు, లోకోక్తులకు
తనుచక్కని నీడనొసగెను;
పాటలు, ఆటలు, చాటువులయ్యెను!
అయ్యారే!
లలితగీతముల, కృతి, కీర్తనలకు
లావణి, నటనల, నర్తనములకు - భవనము నిలిపెను,
భువికి మోహనము, రాగ గమకము;
వాసంతహేలవీ,
ఓ మహరాణీ! నా హృత్ సామ్రాజ్ఞీ!
*************************,
{వాసంతి ఋతు చాందిని}:
*************************,
{వివిధ భాషల వింతలు:-}:
వసంతరాణీ! చూపుల గీతలు గీసేను;
నవ్వుల లిపిని నేర్చుకోమని;
వక్కాణమును ఇచ్చినది;
పూవై విరిసిన ఆహ్లాదం;
అచ్చులు, హల్లుల పూలసజ్జ అది; ;
గుణింతములకు బోధిని ఐనది;
పచ్చదనమ్ముల ఊసుల నిచ్చెను;
పుప్పొడి ఊహల వెదజల్లినది;
కావ్య కులాయములెన్నో కట్టగ;
నుడువుల ఆకుల గుబురులాయెను;
ప్రబంధమ్ముల 'పట్టు-కొమ్మ అయి
జానపదమ్ముల ఇంపుగ చేరిన;
పల్లెపాటల ముల్లె ఐనది;
సామెతలకు, లోకోక్తులకు
తనుచక్కని నీడనొసగెను;
పాటలు, ఆటలు, చాటువులయ్యెను!
అయ్యారే!
లలితగీతముల, కృతి, కీర్తనలకు
లావణి, నటనల, నర్తనములకు - భవనము నిలిపెను,
భువికి మోహనము, రాగ గమకము;
వాసంతహేలవీ,
ఓ మహరాణీ! నా హృత్ సామ్రాజ్ఞీ!
*************************,
{వాసంతి ఋతు చాందిని}:
*************************,
![]() |
shandiliars Designs |
![]() |
konamanini image- in TAMIL |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి