5, నవంబర్ 2014, బుధవారం

జాతీయపక్షి peacock (song)

హరిబోధిని దేవోత్థని; 
ఉత్థాన ఏకాదశి, ప్రబోధిని ; ఆహ్లాద వ్రత రాజ్ఞి ||

విశిష్టమైనది, సొగసులను ఎడదలకు; 
స్పర్శింప జేయగల; హర్షముల ఆచరణ||
కార్తీకమాసము చల్లని గాలులు; 
శుక్ల పక్షమునందు; 
శుభ కేకి నృత్యాల; శోభల పండుగ ||

మణికంఠ వాహనము వనమయూరీ!
శ్రీకృష్ణుడు చూడ, శిఖిపింఛమౌళియే! 
మన జాతీయపక్షికి జేజేలు పలుకులు ||   

ఆహ్లాద వ్రత రాజ్ఞి - ఉత్థాన ఏకాదశి
హరిబోధిని - దేవోత్థని;  ప్రబోధిని ;
ఆహ్లాద వ్రత రాజ్ఞి - ఉత్థాన ఏకాదశి
ఉత్థాన ఏకాదశి, ఉత్థాన ఏకాదశి!

******************************,

ఆహ్లాద వ్రత రాజ్ఞి 
 
ఈబుక్ నా బాల గీతికలు
Please download eBook 
which is a compilation 
of my contributions in NewAvakaya.com. 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి