15, సెప్టెంబర్ 2015, మంగళవారం

బుంగమూతి ప్రేయసి

అరవిందదళనేత్రి నా ప్రేయసి; 
చిరు అలుకలకు గొప్ప వరములొసగేను,                                                     పెదవులను చుట్టి బుంగమూతిని పెట్టి,                                                       అలుకలకు గొప్ప వరములొసగేను, 
;
బింబాధరి కనులు త్రిప్పుచు 
ఏవేవొ ముచ్చట్ల ముగ్గులను వేయుచుండు; 
గుప్పిళ్ళు మూసేసి; 
"నా చేతిలోన; ఏమున్నవో చెప్పు చెప్పంటు" ; 
కొండగాలికి కూడ ఆటలను నేర్పేను!!
;
ఆహాహా! నేడు ఇట - లావణ్యవతి కడను;
'చంద్ర గుడి' కట్టిన వలయమ్ములు, 
ఘుమ్ము ఘుమ్మను తావుల 
కువలయ పుష్పాదులు; 
దారి తప్పేనో ఏమో!?, 
;
చంద్రాస్య నగుమోము చేతలన్నియును
వలయాలు, గుండుసున్నలను చుట్టేస్తు
గుండ్ర గుండ్రని రూపు చర్యలాయేను
;
నిశి రేడు, కలువలు
తమ బింబములు కోటి
నాదు సఖిలోన కాంచుతూ
అచ్చెరువులో మునిగి
కడ లేని ఈతలాడేను

================ 
[కుసుమాంబ1955]
=====================================

# arawimdadaLanEtri naa prEyasi; 
chiru alukalaku goppa waramulosagEnu, 
pedawulanu chuTTi bumgamuutini peTTi, 
bimbaadhari kanulu trippuchu EwEwo ; muchchaTla 
muggulanu wEyuchumDu; guppiLLu muusEsi; 
"naa chEtilOna; EmunnawO cheppu 
cheppamTu" ; komDagaaliki kuuDa ATalanu nErpEnu!!
aahaahaa! chamdra guDi kaTTina walayammulu, 
Gummu Gummanu taawula kuwalaya 
pushpaadulu; daari tappEnO EmO!? 
nEDu iTa - laawaNyawati kaDanu;
chamdraasya nagumOmu chEtalanniyunu
walayaalu, gumDusunnalanu chuTTEstu gumDra 
gumDrani ruupu charyalaayEnu 
niSi rEDu, kaluwalu
tama bimbamulu kOTi
naadu sakhilOna kaamchutuu
achcheruwulO munigi
kaDa lEni iitalaaDEnu

==========================
[kusumaamba1955] [కుసుమాంబ1955]
[ F. B. :-  తెలుగు సాహిత్య ప్రపంచం..
Kusuma Piduri ; September 8 at 7:42am

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి