7, మే 2009, గురువారం

కీర్తనలు నెల కొనాలి!

మననము చేయుము,ప్రణవ నాదమును;;;; '''''''''''''''''''''''''' .............. లి;కీర్తనలు నెల కొనాలి!;;;;; '''''''''''';; మిత్రమా! శ్రవణేంద్రియాలూ,హృదయమూ ; ఇంకా అలాగే,అలాగ ఎండిన బీడుల్లాగ ఉన్నాయేమిటి?! భగవత్ కృపా భావనా వాహినులను ప్రవహించనీయి! కీర్తించు!కీర్తించు! దైవమును కీర్తించు! చెట్టు వ్రేళ్ళు ఎంత లోతుగా దూసుకు వెళతాయో అంత ఎత్తుకి ఆ అంబరంకేసి; ఎదుగుతూ సాగ గలుగుతూన్నది పాదపము! ** పెరిగే కొలదీ తన శాఖలను విస్తరిస్తూ దిశలనంటికీ పల్లవ,ఫల,పుష్ప పరిమళాలను గాలి దోసిళ్ళతో పంచుతూంటుంది. పాయలు పాయలుగా సాగుతూ, ప్రవాహాలు సారవంతమైన ద్వీపాలను నిర్మిస్తాయి. సంకీర్తనా మాధుర్యాన్ని కర్ణేంద్రియాలు గ్రోలినపుడే హృదయం'సస్య కేదార క్షేత్రంగా విరాజిల్లుతుంది. భక్తితో స్తుతి చేయి!భజన చేయి!కీర్తించు! తనివారా కీర్తనా సంరంభ పారవశ్యములో ఓలలాడు! "దైవ తాదాత్మ్య అనుభూతి అనిర్వచనీయమైనదనీ బోధ పరచుకున్నప్పుడు! నిఖిల జగము నీ మానస సీమలో వికసిస్తుంది! భజన చేయి! భజన చేయి! భజన చేయుమోయీ! ''''''''''''''''''''''''''''''''''''''''''''''''

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి