7, మే 2009, గురువారం

మననము చేయుము,ప్రణవ నాదమును

మననము చేయుము,ప్రణవ నాదమును;;;;
'''''''''''''''''''''' 
(చేతన,2007 లో ప్రచురణ);;;;; 
'''''''''''''''''''''''  
పెదవుల డోలలలోన ; 
ఊగనీయరా నాద బ్రహ్మం!;
ఓం!ఓం! ఓంకారం!;
ఓం...........3 //
 
కేంద్ర బిందువు ; 
'నాభీ'నుండి బయలు దేరగా; 
గళము మార్గమున పయనము చేయుచు; 
విచ్చేయునురా నాద బ్రహ్మం!;
అదియే అదియే ఓంకారం; 
ఓం,,,,,,,, 3 //  

నాలుకపైన చిత్తడిఒ ఆటలు; 
బుడి బుడి నడకలు,
పరుగులు అవగా; 
క్రీడించురా నాద బ్రహ్మము; 
తనువే అగును మేఘ మల్‌హారము  
ఓం................ //

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి