7, మే 2009, గురువారం

ప్రణవ నాద మహిమ

ప్రణవ నాద మహిమ ;;;;; '''''''''''' నామము ఏదైన నేమి-కీర్తన ఏదైన నేమి?! పదే పదే "ఓం"అనుచు-పలుకవే!ఓ మనసా! ప్రణవ నాద మననములో -తనియుమా!మైమరచీ!! // శ్రీ వాణి కొన గోటిని-కచ్ఛపి వీణియపైన సుతారముగ కదలుచున్న-నాద బింబ మిదే కదా! ఆ నాద బ్రహ్మ మిదే!ఇదే! // విష్ణు తనయుని జన్మ స్థలమిది సహస్ర దళ యుత ఆది పద్మము; జ్~ఞాన మధువు ఉప్పొంగు చున్నది గ్రోలవె,హృదయమా! ఇదే తరుణము! // కోరస్;; '''''' ఓం ఒం ఒం ; మది తుమ్మెద గ్రోలుతోంది; ఓం జ్ఞానము సారము; పరమానంద స్వరూపము; కను గొను మనసుదే,ఈ భాగ్యము! // '''''''''''''''''''''''''''''''''''''''''''''''

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి