23, ఏప్రిల్ 2009, గురువారం

వయోజన విద్య


వయోజన విద్య ;;;;; ''''''''''' ;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;; పలక తెమ్మంటేను పలక కుండా ఉంటె నేనేమి చేతును?ఓ రంగయో! నేనేమి చేతును?ఓ రంగయో! // అతను :;;;;; ''''''''' పలక,బలపం తోటి పరుగు పరుగున నన్ను అరుగు మీదకు పిలిచి కూర్చుండ బెడుతుంది నా పూల రంగి! చదువు విసుగంటేను వినకున్నదీ2 // చిలకవీ నువ్వంటు నన్ను బులిపిస్తాడు పాఠాలు చదవక ఎగవేయ జూస్తాడు ఆరు నూరైనా నే నూరుకుంటాన? విద్దె నేర్వని వాడు వింత పసువేకదా అక్షరాలు ముద్దు, బతుకు బాటలొ పూలు! పలక ,బలపం తోటి ఓ రంగయో! ఉన్న పాటున బడికి పోదామయా! రాత్రి బడికి చక్కగెళదామయా! //

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి