Baala
సంతసాల కోవెల
![]() తొలి పొద్దున కిరణాలు వెచ్చ వెచ్చన బుల్లి బుల్లి పిట్టలతో బులి బుచ్చకాలు బాల పాపల్లార!ఇక అల్లరంతా మనది! 1)పువ్వులన్ని విరిసాయి తుమ్మెదలు ఎగిసాయి ఝుమ్ ఝుమ్మని తిరిగాయి పులుగులతో బహు సౌరుగ - తిరుగో!తిరుగు! 2)కొమ్మ పళ్ళు పండాయి పాప కొరకు వంగాయి తేనెలూరు మిసిమి పళ్ళు అందుకొమ్మన్నాయి 3)అచ్చు, హల్లులతో పాటుగ a-b-c-d-లు రాసి భాషల అందాలన్నీ దోసిటిలో నింపేసి శ్రీశారదా దేవి కిచ్చి సంతసాల కోవెలను కట్టుదాము అందరమూ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి