తెలుగు మాటలపై మమకారం ; కొన్ని కవిత్వాలు,వ్యాసాలు,జోక్సు, కంప్యూటరు తెరపైన వేసిన బొమ్మలు,పెయింటింగ్సు....... వగైరా,వగైరా.....
ఒక్క సారిగా ఎగురుతూన్న కలల విహంగాలతో నా నిద్రా వినువీధి క్రిక్కిరిసి పోయింది కిలకిలా రావాల సందడిలో ఏవేవో ఊసులు వెల్లువెత్తుతున్నాయి తారకల మిలమిలల మధ్య నింగి నుంచి నేలకు సుతి మెత్తగా జారుతూన్న పొగ మంచుల తెలి వలపు తెరలు అందాలకు నెలవులై కనువిందు చేస్తూన్నాయి. ప్రేయసీ! నీ క్రీ గంటి చూపుల గూటిలో ఒదిగి పోయిన నా హృదయ మొక బంగారు పిచ్చుక. అందుకే, దరహాసినీ! ఈ జీవితం నీకే సొంతం! (ఆంధ్రభూమి వార పత్రిక, 2008లో ప్రచురణ )
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి