22, ఏప్రిల్ 2009, బుధవారం

టీచరులు, కాఫీచరులు!

By kadambari piduri, Apr 1 2009 12:53PM


తెలుగు వారికే గర్వకారణమైన "అష్టావధానము"సాహితీ ప్రక్రియలో,"అప్రస్తుత ప్రసంగము"ఒక అంతర్భాగము.అవధానము కొనసాగేటప్పుడు వారిని తికమక పెట్టేటందుకు పృచ్ఛకులు లల్లాయి లొల్లాయి కబుర్లూ,ప్రశ్నలూ వేస్తూంటారు. ఆ చొప్పదంటు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలంటే పండితునికి కత్తి మీద సాము లాంటిదే!ద్వేదిక మీద అప్పటికప్పుడు చమత్కర భరితముగా జవాబు నివ్వగలిగివాకవి గారికి
ప్రశంసలు లభిస్తాయి,ఆ సమయోచిత సంభాషణలను ,సభికులు మరల మరల గుర్తుకు తెచ్చుకుని,ఆనందిస్తూంటారు. 

ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారిది అవధానములు చేయటములో అందె వేసిన చెయ్యి. అప్రస్తుత ప్రసంగముచేస్తూన్న వారి కొంటె ప్రశ్నలకు లభించే హాస్య సమాధమములలో మచ్చుకు ఒకటి. ప్రశ్న "రామబ్రహ్మం పంతులు గారూ! మీకు 'కాఫీ' ఇష్టమా?'టీ' అంటే ఇష్టమా?" అధ్యాపక(=టీచర్) వృత్తిలో ఉన్న ఆ పండిత వరేణ్యుడు బేతవోలు రామ బ్రహ్మం ఇలా అన్నారు,ఏమాత్రం తడుముకోకుండా "సోదరా! మనము టీచర్లం("టీ"చర్)కదండీ!". 

ఇతరులను నొప్పించని ఇలాంటి సంభాషణలు, తొణికిసలాడే హాస్య మంజరుల గుబాళింపులు


ఇతరులను నొప్పించని ఇలాంటి సంభాషణలు, తొణికిసలాడే హాస్య మంజరుల గుబాళింపులు సారస్వత నందనవనములలో రసజ్ఞులు విహరించేలా చేస్తాయి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి