22, ఏప్రిల్ 2009, బుధవారం


నందమూరు (ఉంగుటూరు)

By kadambari piduri, Mar 3 2009 5:16PM
విశ్వనాథ సత్యనారాయణ తెలుగు వారికి గర్వ కారణమైన పండితుడు;చిత్రంగా అనేక విమర్శలకు, ప్రశంసలను పొందిన మహా కవి. 
గాంధీజి ఉద్బోధించిన "సహాయ నిరాకరణోద్యమము"లో పాల్గొని ,తన ఉద్యోగాన్ని వదులుకున్న "మాతృ దేశ స్వాతంత్ర్యాభిలాషి ఈయన"అని చాలా మందికి తెలియదు. 
ఈయన తల్లి దండ్రులు పార్వతమ్మ, శోభనాద్రి. 
కృష్ణా జిల్లా నందమూరులో ( అనగా నేటి ఉంగుటూరు మండలము ) ,1895లో సెప్టెంబరు 10వ తేదీన (మన్మథ నామ సంవత్సరములో, భాద్రపద బహుళ షష్టి రోజు) శ్రీ విశ్వనాథ సత్యనారాయణ జన్మించారు. 
తండ్రి శోభానాద్రి భక్తాగ్ర గణ్యుడు. సాధారణముగా ,తల్లి దండ్రులు 'తమ పిల్లలలోని పండిత్య ,లలిత కళాది ,విజ్ఞాన అంశాదులలో గల ప్రజ్ఞను వారి బాల్యములోనే గుర్తించ లేరు 
కానీ శోభనాద్రి, తన కుమరుడు 'భవిష్యత్తులో మంచి పాండిత్యమును ఆర్జిస్తాడని" గుర్తించారు. 
. కనుకనే " తన పుత్రుడు వ్రాయ బోవు వ్రాయ బోవు మహా కావ్య కృతిని ఈశ్వరునికే అంకితము చేసెను." 
శోభనాద్రి భవిష్యత్తును అవగాహన చేసుకోగల మహా ద్రష్ట " అని ఈ సంఘటన వలన తేట తెల్లమగుచున్నది. 
శ్రీ మద్రామాయణ కల్ప వృక్షమును " తన తండ్రి కోరిక ననుసరించి" ,"నీహార రుక్ శ్రీ మంతంబయి పొల్చు, మహా తేజో మూర్తి యగు విశ్వేశ్వరునకే " అంకితము చేసెను. 
శోభనాద్రి కర్మ యోగి ఐన పరమ భక్త శిఖా మణి. 
నందమూరులో పరమేశుని నిలిపి, నిష్కామముగా గడిపిన ధన్యుడు , 
మహోన్నత జీవన పథగామి శోభనాద్రి .
Views (27) 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి