22, ఏప్రిల్ 2009, బుధవారం

చమక్కులు

By kadambari piduri, Jan 5 2009 6:06PM
1)అన్న,తమ్ముడితో ఆడుకుంటూ,సిరాను ఒలక బోసి,ఒళ్ళంతా ఖరాబు చేసుకున్నది, బేబీ. 
"ఐతే రోజూ నా ఫైళ్ళను ఖరాబు చేస్తూన్నది,నువ్వేనన్న మాట!హన్నా! ఇవాళ రెడ్ హ్యాండెడ్ గా పట్టు బడ్డావు."తల్లి కోప్పడుతూ అన్నది. 
"కాదు మమ్మీ! చెల్లి (/అక్క) నీలం కలరు ఇంకును పూసేసుకున్నది." 
"కాబట్టి అక్క 'బ్లూ హ్యాండు'లతోటి పట్టు బడినదన్నమాట!" 
అమ్మ మాటను సరిదిద్దారు, ఆ సోదరులు. 
""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""" 
2)కుందేలు బొమ్మను వేసారు విద్యార్ధులు. 
డ్రాయింగు టీచరు అడిగింది "సోమూ! ఇదేంటి? రెండు "v","v" లను మాత్రమే వేసి పెట్టావు? కుందేలు ఏదీ?"చిత్ర లేఖనము పుస్తకమును చూపిస్తూ,వేసిన ఆమె ప్రశ్నకు జవాబు వచ్చింది ఇలాగ. 
"అవ్వి కుందేలు చెవులు, మేడమ్ ! కుందేలేమో ఆ గోడ వెనకాతల ఉన్నదన్నమాట!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి