22, ఏప్రిల్ 2009, బుధవారం

ప్రశ్నాళి

ప్రశ్నాళి!

By kadambari piduri, Apr 2 2009 11:37AM

భగవంతుని ప్రసాదమా! 
చరా చర జగత్తునకు ప్రాణ దానమా! 
నీ స్వరూప మెట్టిది? 

మ్రోడులలో దాగినావా? 
ఓ మధుర స్వప్న లహరికా! 
నేడెటు నుండిటు వచ్చినావు 
నవ్వు పువ్వు రువ్వులతో 
మా ఇంటిలోన కేరింతల పాపాయిగా! 

కరుడు కట్టియున్న 
మంచు కొండల లోయల నుండా? 
నిరుడు గిరి శృంగమంచు కొండల లోయల నుండా? 
నిరుడు గిరి శృంగములపై కెక్కి 
అలిగి కూర్చున్నట్టి 
జలధరాల గిట్టల జాడల నుండా? 

రేయి కన్నుజాబిల్లి చూపుల 
వెన్నెల సోనల నుండా? 
వగలొలికే పగటి సిగల 
దినమణి కిరణాళి నుండా? 
సూటిగా ప్రసరించే 
ఉదయ ప్రభాద్యుతి నుండా? 
సృష్టి రచన చేయుచూ 
ఆ భగవంతుడు 
విదిలించిన కుంచె నుండి 
వెలసిన హరివిల్లునుండా? 
ఎచటి నుండి నీ రాక? 
మాలో ఎల్లరిలో 
జీవ ధాతువై నిలిచిన 
అనుకోని అతిథీ! 
ఓ జననమా!

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి