22, ఏప్రిల్ 2009, బుధవారం

కొత్త అంజనం

   కొత్త త్త అంజనం

By kadambari piduri, Apr 16 2009 10:59AM

పల్లవి: వేణు వినోదం మృదు భావ విహారం 
వీనుల కొసగిన మధురాంజనము 

అనుపల్లవి: యమునా తీరం, క్రీడా వినోదం 
లలిత లలితముగ కళలను కలిసిన 
ఈ ధ్యాన మెంతటి మనోహరము 

1) ఈలల గీతం 
ఈ లలనల హాసము 
సుమధుర శబ్దములాయినవి 
సంగీతమునకు చిరు నామాలు 
కోరస్: 
ఇల్లూ వాకిలి,పల్లె పట్ణములు 
రేవులు,వనములు,కోవెలలు 
కళల వలయముల హరివిల్లులయేను 

2)గళముల సౌరుగ జానపదాలు, 
ప్రతి అడుగు జాడలును 
చిందిన సొగసుల పల్లె పదాలను 


3)ఇందిందివియే ఇవియే 
అరువది నాలుగు కళలకు నెలవు

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి