23, ఏప్రిల్ 2009, గురువారం

తేనీలు

 
తేనీలు ;;;;; 
'''''''''  
నీ క్రీ గంటి చూపుల గొడుగులోన 
నేను ఛత్రపతినీ,
సర్వం సహా ప్రణయ సామ్రాజ్యానికి
సామ్రాట్‌నీ! సఖియా!!! 
''''''''''''''''''''''''''''
నీ మమతల జరీ ప్రోగులతో
పకడ్బందీగా అల్లినట్టి
ప్రేమ పంజరములో 
నిశ్శ్శంకగా బందీగా 
ఈ ప్రణయంపు రామ చిలుక. 
''''''''''''''''''''''''''''  
కొక్కిరాయి రేయి
వెన్నెలలను  
నీ వీక్షణముల భరిణలలోన నింపి
నీ నిడుపాటి నీలి కురుల ఊయెలలను 
బహుమతులుగా పొంది 
మా మతులను కాస్తా పోగొట్టినది కద,ఔరా!
బహు గడసరి కదా ఈ నిశి! 
''''''''''''''''''''''''''''' 
నీ భావనల జడి వానలు 
ఏకధాటిగా కురిసి,కురిసీ
నా మానస సరోవరమ్ము 
ప్రణయ సుధల వెల్లువలతో త్రుళ్ళుతోంది. 
'''''''''''''''''''''''''''''  
నిను చూసిన మరు క్షణమే
అటు రేయీ,
ఇటు పగలూ
ఐనాయి కలికీ!
బంగారు కలలకు నేస్తాలు.

'''''''''''''''''''''''''''''
'''''''''''''''''''''''

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి