22, ఏప్రిల్ 2009, బుధవారం

తలంబ్రాలు

By kadambari piduri, Apr 4 2009 1:41PM
శుభలేఖలలో కొన్ని శ్లోకములను తఱచుగా వాడుతూంటారు. వానిలో ఒక సుప్రసిద్ధ శ్లోకమును పరిశీలిద్దాము. 

"జానక్యనః కమలాంజలి పుటేయాః పద్మ రాగాయితాః 
న్యస్తా రాఘవ మస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితాః 
స్రస్తా శ్యామల కాయ కాంతి కలితాయః ఇంద్ర నీలాయితాః 
ముక్తాస్తా శుభదా భవంతు భవతా శ్రీ రామ వైవాహికః ." 
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
"సీతా రామ కళ్యాణము", సంపూర్ణ రామాయణము"(బాపు దర్శకుడు) సినిమాలలో ఈ శ్లోక భావమునే ప్రేక్షకుల హృదయాలను రంజించే రీతిగా 
చిత్రించారు. 
"శ్రీ కృష్ణ లీలా తరంగిణి"లోని ద్వాదశ తరంగములో రుక్మిణీ కళ్యాణము" వర్ణించబడినది. 
నారాయణ తీర్ధుల వారి ఈ శ్లోకమును పఠించండి. 

"భైష్మ్యాః పాణి సరోరుహాంజలి గతా రక్తాస్తు ముక్తాః స్థితాః 
యా ముక్తా గళితాను రాగ విమలాః కృష్ణోత్తమాంగాశ్రయాః 
యా తా స్తస్య యదూద్వహస్య పరమం సామ్యం విశుద్ధాత్మనః 
తాః కుర్వంత్వభిత శ్శుభాని సతతం శ్రీ కృష్ణ వైవాహికాః." 

తాత్పర్యము::: 
''''''''''''''''''''''''''''''' 
మంగళసూత్ర ధారణము జరిగినది. రుక్మిణీ కృష్ణులు ఒండొరులు తలంబ్రాలను పోసుకొన్నారు. ఆ తరుణమున రుక్మిణీ దేవి యొక్క పద్మముల వంటి ఎర్రని అఱ చేతులలో(అంజలి, దోసిలి)ఉన్నప్పుడు ముత్యాల తలంబ్రాలు" ఎర్రగా నైనవి.శ్రీ కృష్ణుని శిరసుపై నున్నపుడు ఆ 
మౌక్తికములు తమకు సహజమైనట్టి తెల్లని కాంతిని పొందినవి.:అనురాగము 
తొణికే రుక్మిణీ దేవి సామీప్యమున అవి రాగము"(= ప్రేమ, ఎర్రని రంగు) ను పొందినవి. (రాగ,ద్వేష రహితుడైన శ్రీ కృష్ణ మూర్తి సన్నిధిలో విశుద్ధ ఆత్మ), ఆ స్వామి నిర్మల హృదయమునకు సాటి రావాలని ,సామ్యమును ఆ నవ మౌక్తికములు అభిలషిస్తున్నాయి కాబోలును!అని అనిపిస్తున్నది." 
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;; 
పైన ఉన్న రెండు శ్లోకములలోని భావములలోని సారూప్యతను తిలకించారా? 
తెలుగు వారి గృహములలోని పరిణయ వేడుకలలో "తలంబ్రాలు నయనానందకరము కలిగించే సాంప్రదాయ కలిమి. ఈ నేత్ర పర్వము ఐన వేడుక సారస్వతము అనే మర్రి చెట్టు కొమ్మలలో అనేక పర్యాయములు ఊయలలు నిర్మించుకుని, క్రీడించి, హర్షమును కలిగించినది

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి