22, ఏప్రిల్ 2009, బుధవారం

టపా(ట) కాయలు

By kadambari piduri, Apr 17 2009 5:16PM
వేటూరి సుందర రామ్మూర్తి సినీ రంగంలో "పాటల రచయిత"గా కాలూని, లబ్ధ ప్రతిష్ఠులు అయ్యారు. 
గీత రచయితగా అనేక అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా వేటూరికి 
రా సాగాయి. 
"మనసు కవి"గా సుప్రసిద్ధులు ఐన ఆత్రేయ గారికి అవకాశాలు సన్నగిల్లాయి. 
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

దీపావళి పండుగ వస్తూన్నది. అంతటా హడావుడి సందడిగా ఉన్నది. 
మార్కెట్టులో ఆ ఇద్దరు ఒకరికొకరు ఎదురయ్యారు. 
పరస్పరమూ పలకరించుకున్నారు.ఆత్రేయ కావలసిన బాణసంచా కొనేసి, నిండు సంచీతో ఇంటిముఖం పట్టారు. 
"టపా కాయలు కొనేసారా?" స్నేహ పూర్వకముగా 
అడిగారు వేటూరి సుందర రామ్మూర్తి. 

"నా 'పాట కాయ'లన్నీ మీకే వస్తున్నాయి గదా! 
అందుకే ఊరికే ఖాళీగా ఉండట మెందుకు లెమ్మని, 
ఇదిగోండి!ఇలాగ 'టపా కాయలు' తెస్తున్నాను." 
అన్నారు ఆత్రేయ స్నేహ పూర్వకంగానే , 
సంభాషణలలోనూ పదముల అలికిడిని కలిగిస్తూ . 
Views (6) | Post Your Commen

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి